సాక్షి, న్యూ ఢిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న దైనిక్ భాస్కర్ గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఐటి అధికారులు గురువారం ఉదయం దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, న్యూఢిల్లీల్లోని కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ కరోనాను కట్టడి చేయటంలో మోదీ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు దైనిక్ భాస్కర్ మూల్యం చెల్లిస్తోంది. అరుణ్ శౌరీ చెప్పినట్లుగా ఇది ప్రకటించని ఎమర్జెన్సీ.. ఎమర్జెన్సీకి మరో రూపం’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment