రాజస్థాన్ లో బీజేపీకే పట్టం: నీల్సన్ సర్వే
Published Thu, Nov 21 2013 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్, డైనిక్ భాస్కరన్, నీల్సన్ సర్వేలో వెల్లడించింది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది సర్వే తెలిసింది.
ఈ ఎన్నికల్లో ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి తిరిగి అధికారం కట్టబెట్టే అవకాశాలు కష్టమే అని సర్వేలో 50 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఒకవేళ అధికారంలోకి బీజేపీ వస్తే.. ఆ పార్టీ తరపున వసుంధర రాజే తగిన ముఖ్యమంత్రి అభ్యర్థి అని 56 శాతం మంది తెలిపినట్టు సర్వే రిపోర్ట్.
బీజేపీకి 37 శాతం ఓట్లు రానున్నట్టు, అధికార కాంగ్రెస్ 75 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి లాంటి అంశాలు కాంగ్రెస్ పై ప్రతికూల ప్రభావం చూపనున్నయని సర్వేలో వెల్లడైంది.
Advertisement
Advertisement