వారికి పార్టీతో సంబంధం లేదు
బెంగళూరు: ‘దళిత ముఖ్యమంత్రి నినాదంతో తరుచూ మీడియా ముందుకు వస్తోంది కాంగ్రెస్ నాయకులు కారు. మా పార్టీకి చెందని వారు చేసే వాఖ్యలపై నేను ప్రతిస్పందించబోను.’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పే ర్కొన్నారు. గురువారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ఆయన మీడియాతో మా ట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు.
ఇతర పార్టీల నా యకులు, లేదా వేర్వేరు సంఘాలు దళిత ము ఖ్యమంత్రి కావాలని చేసే డిమాండ్ గురించి ఆలోచించే తీరిక కాని ప్రతిస్పందించే సమయం కాని తనకు లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇలాంటి చిన్నచిన్న విషయాలను హై కమాండ్ దృష్టికి తీసుకు వెళ్లే ఆలోచన ఏదీ లేదన్నారు. తెరవెనక ఉండి ‘దళిత సీఎం’ నినాదాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ.పరమేశ్వర్ వినిపిస్తున్నారన్న వార్తలు సత్యదూరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ.దేశ్పాండేపై లోకాయుక్తలో కేసు దాఖలైన విషయం తనకు తెలియదని పూర్తి సమాచారం లభించిన తర్వాత ఈ విషయం పై స్పందిస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 200వ శాఖను సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు.