dalits lands
-
బతకమని ఇచ్చి.. లాక్కుంటారా..?
దళితులకిచ్చిన భూముల్లో ‘డబుల్’ నిర్మాణాలు మా భూములు మాకే ఇవ్వాలని డిమాండ్ హుస్నాబాద్: 25 ఏళ్ల క్రితం భూమి లేని నిరుపేద దళితులకు వ్యవసాయం చేసుకొమ్మని భూమి, పట్టాలిచ్చిన అధికారులు నేడు ఆ భూముల్లోనే డబుల్ బెడ్రూంలను కట్టడంపట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. హుస్నాబాద్ పట్టణానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూంల నిర్మాణాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 160 మంది లబ్ధిదారులకు ఈనెల 8న మంత్రి హరీశ్‌రావు ‘డబుల్’ ఇండ్లు నిర్మించేందుకు శిలాఫలకం సైతం రెడీ చేయడంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం సెంటు భూమి లేని ఏడుగురు దళితులకు ఎకరం చొప్పున ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. రాళ్లు, రప్పలతో ఉన్న ఈ భూములను సాగులోకి తెచ్చేందుకు దళితులు వేల రూపాయలు ఖర్చు పెట్టారు. నాలుగైదు ఏళ్ల నుంచి పత్తి, జొన్న పంటను వేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా ఇటీవల ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణానికి మొదటిద«శలో 160 డబుల్ బెడ్రూంలను మంజూరు చేసింది. పట్టణంలో సర్కార్ భూమి లేకపోవడంతో అధికారులు ప్రభుత్వం దళితులచ్చిన భూమిపై కన్నేసింది. ప్రభుత్వం ఇచ్చిన భూములను ఎందుకు సాగు చేసుకోవడం లేదని సంజాయిషీ ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం లబ్ధిదారులైన దళితులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ స్థలంలోనే డబుల్ బెడ్రూంలను నిర్మిస్తున్నారనే సమాచారం దళితులకు తెలవడంతో ఇదేక్కడి ఆందోళన చెందుతున్నారు. తమకు బతుకుమని ఇచ్చి భూములను గుంజుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దళితులకు ఇచ్చిన భూముల్లోనే డబుల్ బెడ్రూంలను నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి డబుల్ బెడ్రూంలు నిర్మిస్తున్న భూమిలో ఇళ్లు కట్టి తమకు అన్యాయం చేయొద్దని, తమ భూమి తమకే ఇవ్వాలని దళితులు అంటుంటే.. గుట్టల్లో ఇండ్లు కట్టవద్దని పేదలు కోరుతున్నారు. దళితులకు ప్రత్యామ్నాయంగా భూమిని ఇచ్చి.. ఇండ్లు కడతారా..? లేక లబ్ధిదారుల కోరిక మేరకు మరోచోట డబుల్ బెడ్రూంలను కట్టిస్తారా..? వేచి చూడాల్సిందే. మాకు అన్యాయం చేయవద్దు.. ఏన్నో ఏళ్ల క్రితం గుట్టల్లో వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం పట్టాలిచ్చింది. శక్తి మేరకు గుట్టలు, రాళ్లున్న భూములను చదును చేసుకున్నాం. ఇప్పుడేమో మాకెవ్వరికీ తెలువకుండానే ఇచ్చిన భూములను లాక్కోవడం అన్యాయం. మా భూమి మాకు ఇవ్వాలి.. లేదంటే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇవ్వాలి. – ఖాతా అనందం -
దళితుల భూములు కబ్జా
సీఐ, తహసీల్దార్ల పర్యవేక్షణలో చింతకుంట అసైన్డ్ భూముల్లోని పెసర పంటను కోసిన పొలాల వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు జోగిపేట: అందోలు మండలం చింతకుంటలో దళితులకు పంపిణీ చేసిన భూములు కబ్జాపరమయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గురువారం సీఐ వెంకటయ్య, తహసీల్దార్ నాగేశ్వరరావు సిబ్బందితో వెళ్లి గ్రామంలోని భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న పెసర పంటను రెవెన్యూ శాఖ పరిధిలోని గ్రామ సేవకులతో కోయించారు. మూడెకరాల పొలంలో కోసిన పెసర పంటను స్థానిక పోలీసు స్టేషన్లో భద్రపరిచారు. గ్రామంలో 572, 634,635,636, 637,638 సర్వే నంబర్లలో సుమారుగా 302 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని నిరుపేదలైన దళితులకు పంపిణీ చేయగా 39 ఎకరాలు పంపిణీ చేయకుండా మిగిలి ఉంది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానిక ఎస్సీలు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. రోజు రోజుకు ఎస్సీల ఆందోళన ఉధృతం కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 638 సర్వే నంబరులోని మూడెకరాలలో ఉన్న పెసర పంటను గురువారం గ్రామ సేవకులు కోశారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మొహన్సింగ్ గ్రామానికి చెందిన దళితులకు ఈ భూములను పంపిణీ చేశారని, ఈభూములు ఇతరులు పేర్లపై ఎలా మారాయంటూ దళిత సంఘాల నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివాదస్పద భూమి వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు రావడంతో గ్రామంలోని దళిత కుటుంబాలకు చెందిన వారు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టేక్మాల్ ఎస్ఐ రమేశ్, అల్లాదుర్గం ఎస్ఐ గౌస్‌తో పాటు జోగిపేట ఏఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, ఆర్ఐ సతీష్, వీర్‌ఓలు, వీఆర్ఏలు అక్కడికి చేరుకున్నారు. 2, 3 రోజుల్లో సర్వేలు నిర్వహిస్తాం : తహసీల్దారు వివాదస్పద సర్వే నంబర్ 638లోని భూమిని 2,3 రోజుల్లో సర్వే చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారని తహసీల్దారు నాగేశ్వరరావు తెలిపారు. సర్వే నివేదిక వచ్చేంతవరకు ఇతరులు ఈ భూమిలోకి ప్రవేశించకూడదన్నారు. ఈ భూమిని సర్వే చేసేందుకు ఐదుగురు సర్వేయర్లను నియమించామన్నారు. సర్వేలో భూమి ఎవరిదని తేలితే వారికే అప్పగిస్తామని ఒక్కరొక్కరి పేర ఎంత భూమి ఉండాలో నిబంధనల ప్రకారం అంతే ఉండాలని ఎక్కువగా ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందన్నారు. చింతకుంట భూములకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడడం వల్ల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసామని సీఐ వెంకటయ్య తెలిపారు. -
దళితుల భూములకు.. ‘రెవెన్యూ’ గండం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గూడు లేని బీదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం 20 ఏళ్ల కిందటే 68మంది దళిత రైతులకు నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని 310, 411, 414, 415, 416, 425 సర్వే నంబర్లలో పంపిణీ చేసిన సుమారు 69.10 ఎకరాల ప్రభుత్వ అసైన్డు భూమిని తిరిగి లాగేసుకునే ప్రయత్నం చేసింది. నల్లగొండ పట్టణానికి చెందిన బలహీనవర్గాల ప్రజలకు, ఇందిరమ్మ రెండవ విడత గృహసముదాయంలో భాగంగా రాజీవ్‌గృహకల్ప కింద ఇంటి స్థలాలను ఇచ్చేందుకు అధికారులు ఈ స్థలాన్ని ఎంపిక చేయడం వివాదాస్పదం అవుతోంది. అసలు ఒక నియోజకవర్గం పరిధిలోని ప్రజలను మరో నియోజకవర్గం పరిధిలోకి తరలించాలనుకోవడ ంలోనే కుట్ర దాగుం దని, తమ భూములకు అమాంతం విలువ పెంచేసుకునే వ్యూహం దాగుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే భూమిలో 2008 నవంబర్ 17న అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇదంతా ఇదీ.. అసలు కథ ప్రభుత్వం భూములు పంపిణీ చేసినా, ఎలాంటి సాగు చేయకుండా నిరుపయోగంగా ఉంచారు కాబట్టి, ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి వెనక్కి తీసేసుకుంటున్నామని, దీనికిగాను కొంత నష్టపరిహారం చెల్లిస్తామని నోటీసులు ఇచ్చింది. దీంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఎల్లారెడ్డిగూడెం దళితులు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. కనీసం ఈ కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నామని వారు వ్యాఖ్యానించారు. కాగా, నల్లగొండ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బడుగు బలహీనవర్గాలకు ఇళ్లు కట్టిస్తామనడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరిలో అత్యధికులు నల్లగొండలోనే చిన్నా చితక పనులు, ఇళ్లలో పనిచేసుకునే మహిళలు తదితరులు ఉంటారు. వీరిని నల్లగొండకు 12 కిలోమీటర్ల దూరానికి తరలిస్తే వారి ఉపాధి ఏం కాను అన్న ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి. ఇది ఒక ఎత్తయితే, రెండు దశాబ్దాలుగా హక్కుదారులుగా ఉన్న దళితుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకోవాలని చూడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో శిలాఫలకం ధ్వంసం తమకు నష్టపరిహారం అక్కర్లేదని, బొత్స సత్యనారాయణ వేసిన శిలాఫలకాన్ని దళిత రైతులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు కేసులు కూడా పెట్టారు. సేద్యం చేయడం లేదన్న కారణం చూపెట్టి ఈ భూములను రెవెన్యూ అధికారులు వెనక్కి లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తాము సేద్యం చేయకుండా ఉండి ఉంటే పంట నష్ట పరిహారం ఎలా చెల్లించారంటూ ఈ రైతుల్లో అత్యధికులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. మరోమారు 2009లో ఇదే ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని, భూములు ఇచ్చేయాలని తమపై ఒత్తిళ్లు వచ్చాయని బాధితులు తెలిపారు. ఎకరాకు మొదట రూ.1.28లక్షల నష్ట పరిహారం ఇస్తామని నోటీసులు జారీచేసిన అధికారులు ఆ తర్వాత రూ.2.50లక్షల నుంచి రూ.3.00లక్షల నష్టపరిహారం ఎకరాకు చెల్లిస్తామని నోటీసులు ఇచ్చారు. కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటే రూ.3.50లక్షలు కూడా చెల్లిస్తామని మరో మారు రాయబారం నడిపారు. రెవెన్యూ అధికారులకు.. ఎందుకంత శ్రద్ధ సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం మరో తాయిలం కూడా ఇచ్చింది. ఎకరాకు రూ.4.50లక్షలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ప్లీడర్ దగ్గర లేఖలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. దీని వెనుకున్న బలమైన కారణం ఒక్కటే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దళితుల చేతుల్లో ఉన్న ఈ భూములకు మార్కెట్ విలువ ఎక్కువగా ఉంది. ఎకరా భూమి విలువ కనీసం రూ.30లక్షలు పలుకుతుండగా, రోడ్ వెంట ఉన్న భూమికైతే ఎకరాకు అత్యధికంగా రూ.60లక్షల దాకా ఉంది. కొత్త భూసేకరణ చట్టం మేరకు మారిన నిబంధనల ప్రకారం కూడా ఈ భూములను దళితులకే చెందుతాయని అంటున్నారు. ఉన్న భూమిని కాపాడాలని.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎస్సీలకు 3 ఎకరాల సాగుభూమిని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కనీసం ఈ హామీలో భాగంగానైనా తమకు భూములు పంపిణీ చేయకున్నా, ఉన్న భూములు లాగేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి నల్లగొండలోని బీదలకు గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టించాలంటే.. అది అర్బన్ హౌసింగ్ కిందకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు జవాబు చెప్పే అధికారి లేడు. అంతేకాకుండా, ప్రధానమైన మరో అభ్యంతరం కూడా ఉంది. నల్లగొండ నియోకవర్గ ప్రజలకోసం, నకిరేకల్ నియోజకవర్గ ప్రజ ల అసైన్డు భూములు ఎలా లాక్కుంటారు..? ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రెవెన్యూ అధికారులు తమపై పడిపోకుండా చూడాలని దళిత రైతులు కోరుతున్నారు.