damage to property
-
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే...
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో అక్కడక్కడా విధ్వంసకాండ కొనసాగుతోంది. మోటారు వాహనాలను, దుకాణాలను దగ్ధం చేయడం, భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వడం మనం చూస్తున్నాం. ప్రజల ఆగ్రహాన్ని, అసహనాన్ని ఇలా వ్యక్తం చేస్తే తప్పా ప్రభుత్వ ప్రభువులకు అర్థం కాదని వాదించే కార్మిక నాయకులు ఉన్నారు. అల్ప సంఖ్యలో ఉండే వెనక బడిన వర్గాల ప్రజలు తమ అసమ్మతిని అగ్గిలా మండిస్తే తప్పిస్తే ప్రభుత్వ పెద్దలకు కాగ తగలదంటూ సమర్థించే నాయకులూ ఉన్నారు. ఇది ఎంత మేరకు సబబు? భారత రాజ్యాంగంలోని 19 (1) ఏ సెక్షన్ కింద డిమాండ్లపై శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు ప్రజలకు ఉంది. అదే రాజ్యాంగంలోని 51 ఏ అధికరణ కింద హింసాకాండకు దూరంగా ఉండడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది. బాధ్యత విషయాన్ని పక్కన పెడితే విధ్వంసకాండకు పాల్పడిన వారిని శిక్షేందుకు కేంద్ర ప్రభుత్వం 1984లో ‘పివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్’ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులకు ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్న ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ రవాణా లేదా టెలీ కమ్యూనికేషన్ల ధ్వంసంతోపాట ప్రజల కోసం ఉపయోగపడే భవనం లేదా కేంద్రం పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులు)గా చట్టం నిర్వచించింది. ఇటీవల లక్నోలో జరిగిన ఆందోళనలో ప్రభుత్వ వాహనాలతోపాటు ప్రైవేటు వాహనాలైనా కార్లు, బైకులను కూడా తగులబెట్టారు. ఓ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ప్రైవేటు పాపర్టీ విధ్వంసం విషయంలో చర్యలు తీసుకునేందుకు చట్టంలో సరైన నిబంధనలు లేదు. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఎన్నోసార్లు జోక్యం చేసుకొని చట్టంలో అవసరమైన సవరణలు తీసుకరావాల్సిందిగా ఆదేశించినా పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోయాయి. 2007లో సుప్రీం కోర్టు స్పందన ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా సమ్మెలు, బంద్‌లు, ఆందోళనల పేరిట ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన భారీ నష్టంపై తనంతట తాను స్పందించిన సుప్రీం కోర్టు, సరైన మార్గదర్శకాల కోసం రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీ కేటీ థామస్, సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్ నాయకత్వంలో రెండు వేర్వేరు కమిటీలను నియమించింది. 1984 చట్టాన్ని సవరించాల్సిందిగా ఆ రెండు కమిటీలు పలు సూచనలు చేశాయి. 2015లో గుజరాత్లో హార్దిక్ పటేల్ ఆందోళన, 2016లో హర్యానాలో కోటా కోసం జాట్లు నిర్వహించిన ఆందోళన సందర్భంగా కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి ఆందోళనలకు పిలుపునిచ్చిన సంఘాలను బాధ్యులను చేస్తూ చట్టం తీసుకరావాలని సూచించింది. సరైన చట్టాలు లేని కారణంగానే నాడు హార్దిక పటేల్‌పై పోలీసులు ‘దేశ ద్రోహం’ కేసు పెట్టారు. అది వీగిపోయింది. ఇటీవల ఎన్ఏఏ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిటిషన్ తీసుకరాగా ‘దేశంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పాడ్డాకే విచారిస్తాం’ అని వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గమనార్హం. చదవండి: సీఏఏపై వెనక్కి తగ్గం మమతా బెనర్జీకి అమిత్ షా సవాల్.. ‘బెంగాల్ సహా దేశమంతటా సీఏఏ’ ‘పౌర చట్టంపై విపక్షాల రాద్ధాంతం’ దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది : గవాస్కర్ సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు -
సీఏఏ : యూపీ దారిలో కర్ణాటక
సాక్షి, బెంగళూరు : నిరసనల సందర్భంగా ఎవరైనా ప్రజా ఆస్థుల విధ్వంసానికి పాల్పడితే జరిగిన నష్టాన్ని వారి వద్దనుంచే వసూలు చేసే యూపీ తరహా చట్టాన్ని కర్ణాటకలో కూడా తెస్తామని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అశోకా గురువారం వెల్లడించారు. యూపీలో తెచ్చిన నూతన చట్టం ప్రకారం ఇప్పటికే ఆందోళనకారుల ఆస్థులు జప్తు చేస్తూ చాలా మందికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిరసనల సందర్భంగా యూపీలో నెలకొన్న హింసాత్మక పరిస్థితే మంగూళూరులో కూడా ఉత్పన్నమైనందున యూపీ ప్రభుత్వ మార్గంలో నడవాలని నిర్ణయించినట్టు మంత్రి గురువారం తెలిపారు. ఈ విషయంపై మరో మంత్రి సీటీ రవి మాట్లాడుతూ.. నష్టాన్ని ఆందోళనకారులకు జరిమానా విధించి భర్తీ చేయడమే కాకుండా వారిపై గూండా చట్టం ప్రకారం కేసులు పెట్టాలని, ఇలా అయితేనే వ్యవస్థీకృత నేరాలను అరికట్టవచ్చని సూచించారు. కన్నడ బీజేపీ ఎంపీ శోభా కరాండ్లేజ్ మాట్లాడుతూ.. పౌరులు శాంతియుతంగా నిరసన తెలపాలి. అంతేకానీ ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే మాత్రం జరిగిన నష్టాన్ని భరించాల్సిందేనని పేర్కొన్నారు. కాగా, గత వారం సీఏఏకు వ్యతిరేకంగా మంగుళూరులో జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆయా సంఘటనలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. దాదాపు 1500 నుంచి 2వేల మంది ఆందోళనకారులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పోలీస్ స్టేషన్ సమీపంలో గుమిగూడారు. పోలీసులు ఎంత చెదరగొట్టినా చెదరకపోగా, పోలీసులపైనే రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లో కాల్పులు జరిపినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఇద్దరు పౌరులు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో మృతులకు నష్టపరిహారంగా ముఖ్యమంత్రి యడ్డియూరప్ప చెరో రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకొని మృతుల తప్పిదం లేదని విచారణలో తేలితేనే పరిహారం ఇస్తామని తేల్చిచెప్పారు. అనంతరం కాల్పుల ఘటనపై సీఐడీ, మెజిస్ట్రీయల్ విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. ముసుగు వేసుకున్న పురుషులు సీసీకెమెరాలను ధ్వంసం చేయడం, రోడ్లను దిగ్భంధం చేయడం, వ్యాన్లను ధ్వంసం చేయడం, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి వీడియో ఇప్పటికే సేకరించారు. చదవండి :సీఏఏ: ఉక్కుపాదం మోపిన యూపీ ప్రభుత్వం -
అప్రమత్తంగానే ఉన్నాం..
భద్రాచలం : గోదావరి వరదలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి చెప్పారు. వరద పరిస్థితిని పరిశీలించేందుకు భద్రాచలం వచ్చిన ఆయన సోమవారం స్థానిక అధికారులతో కలసి కరకట్ట, నిమజ్జనం ప్రాంతం, తానీషా కల్యాణ మండపం ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి పరివాహక మండలాల్లో పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదిక చేపట్టాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. సెక్టోరియల్, జోనల్, మండల స్థాయి అధికారులంతా స్థానికంగానే ఉండి ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వరద పెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే మండల కేంద్రాల్లో సరిపడా బియ్యం, ఇతర నిత్యావసర నిల్వలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 20 లాంచీలను సిద్ధంగా ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భద్రాచలం కరకట్ట వద్ద స్లూయీస్‌ల వద్ద నీరు లీకవుతున్నందున ఐటీసీ నుంచి ప్రత్యేకంగా మోటార్లు తెప్పించి ఎప్పటికప్పుడు నీటిని బయటకు తోడేలా చర్యలు చే పట్టామని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వరద సహాయక చర్యలకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులంతా భద్రాచలంలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షించేలా తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష... వరద ఉధృతి క్రమేపీ పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ జిల్లా స్థాయి అధికాారులతో సమీక్షించారు. ముంపు ప్రాంత ప్రజానీకాన్ని సత్వరమే సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరద తగ్గుముఖం పట్టగానే ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తానీషా కల్యాణ మండపంలో బస చేసిన గుంటూరు నాగార్జున విశ్వ విద్యాలయ 10వ బెటాలియన్‌కు చె ందిన జాతీయ విపత్తు స్పందన ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, ఆర్డీవో అంజయ్య, ఇరిగేషన్ ఈఈ శ్రావ ణ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ సరస్వతి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.