Dandiya fest
-
దాండియా వేడుకలకు ఆధార్ చెక్ చేశాకే ఎంట్రీ..
సాక్షి, హైదరాబాద్ : దసరా ఉత్సవాల్లోకి హిందూయేతర వర్గాలకు చెందిన వారు ప్రవేశించకుండా ప్రవేశ ద్వారాల్లో ఆధార్ కార్డులు చెక్ చేయాలని గర్బా, దాండియా నిర్వాహకులకు బజరంగ్దళ్ సూచించింది. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ఇతర మతస్తులు పాల్గొనకుండా ఆయా ఎంట్రీ పాయింట్లలో ఆధార్ కార్డులు తనిఖీ చేయాలని, ఈ వేడుకలకు హిందువేతరులను బౌన్సర్లుగా నియమించుకోరాదని బజరంగ్దళ్ మీడియా కన్వీనర్ ఎస్ కైలాష్ కోరారు. గత కొన్నేళ్లుగా దసరా వేడుకల్లో హిందూయేతర వర్గాలకు చెందిన కొందరు యువకులు చొరబడి, దాండియా, గర్బాలో పాల్గొనే మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన ఘటనలు చోటుచేసుకున్నాయని, బాధితుల పక్షాన నిలిచిన పురుషులపైనా వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. హిందూయేతర బౌన్సర్లను నిర్వాహకులు నియమించుకోవడంతో దుండగులు ఈ కార్యక్రమాల్లోకి వచ్చేందుకు దోహదపడుతోందని గుర్తించామని అన్నారు. దసరా వేడుకలు జరిగే వేదికల వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉంటారని, ఇలాంటి ఉదంతాలు తమ దృష్టికి తీసుకువస్తే కార్యక్రమాలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అడ్డుకుంటామని చెప్పారు. -
విల్లామేరీ కాలేజీలో కలర్‌ఫుల్ దాండియా ఫెస్ట్
-
ఉత్సాహ్.. దాండియా
గుజరాతీల సంప్రదాయ నృత్యం దాండియాలో హైదరాబాదీయులు దుమ్ము రేపారు. దసరా నవరాత్రుల సందర్భంగా వజ్రా ఈవెంట్స్ బంజారాహిల్స్ ఆిషియానాలో గురువారం నిర్వహించిన ‘దాండియా ఫెస్ట్’లో ఉత్సాహంగా గడిపారు. శుక్రవారం కూడా కొనసాగే ఈ ఫెస్ట్‌లో దాండియా, గార్భా నృత్యాలే కాదు... పిల్లా, పెద్దా అంతా కలసి ఇక్కడి పండుగ షాపింగ్‌ను కూడా ఆస్వాదించారు. వారి ఆనందాన్ని ‘సిటీ ప్లస్’తో పంచుకున్నారు. అంతా కలసి... మా ఆఫీసులో నిర్వహించే కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొంటా. అలా దాండియాతో పరిచయం ఏర్పడింది. మన హైదరాబాద్ మినీ భారత్. అందుకే ఈ సందడిని అన్ని రాష్ట్రాల వారితో కలసి చేసుకొంటాం. గుజరాతీల సంప్రదాయ దాండియా నేర్చుకొని వారితోనే ఆడటం మంచి అనుభూతి. - చంద్రిక, ఐటీ ఉద్యోగిని ఎంజాయ్ చేస్తా... నాకు కూచిపూడిలో కొంత ప్రవేశం ఉంది. ఉత్తర భారత సంప్రదాయ నాట్యం ఇక్కడి వారితో మమేకం అయిపోయింది. ఒకరి సంస్కృతిని ఒకరు పంచుకున్నప్పుడే స్నేహభావం పెంపొందుతుంది. ఏదేమైనా... దాండియాను బాగా ఎంజాయ్ చేస్తా. - శ్రీలలిత, ఎంఎన్సీ ఉద్యోగిని మధురానుభూతి... మాది చెన్నై. రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. దాండియా అపరిచితులను ఒక చోటికి తెస్తుంది. స్నేహ బంధం వేస్తుంది. నా కుమార్తెకు డ్యాన్స్ చాలా ఇష్టం. తన కోసమే ఇక్కడకు వచ్చా. నిజంగా ఇది ఓ మధురానుభూతి. ఉండబట్ట లేకో... మరేదన్నా ఊహించుకున్నాడో గానీ... ‘టెరెన్స్ లూయీస్‌తో మీరు డేటింగ్ చేస్తున్నారట కదా’ అని టీవీ స్టార్ సయంతాని ఘోష్‌ను ఠక్కున అడిగేశాడొకాయన. మరీ అంత డెరైక్ట్ ప్రశ్నకు లోపల ఎలా ఫీలైనా... బయటకు మాత్రం ‘అలాంటిదేమీ లేద’ంటూ కూల్‌గా బదులిచ్చిందీ భామ. ‘మేమిద్దరం కలిసి కాఫీకో, డిన్నర్‌కో వెళ్లాలని ఏడాదిగా ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కుదరలేదు. మా ఇద్దరి గురించీ చాలాచాలానే రాస్తున్నారు. కానీ కలిసింది లేదు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది. - గాయత్రి