ఉత్సాహ్.. దాండియా | Hyderabad citizens to celebrate Dandiya festival | Sakshi
Sakshi News home page

ఉత్సాహ్.. దాండియా

Published Fri, Oct 3 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

ఉత్సాహ్..  దాండియా

ఉత్సాహ్.. దాండియా

గుజరాతీల సంప్రదాయ నృత్యం దాండియాలో హైదరాబాదీయులు దుమ్ము రేపారు. దసరా నవరాత్రుల సందర్భంగా వజ్రా ఈవెంట్స్ బంజారాహిల్స్ ఆిషియానాలో గురువారం నిర్వహించిన ‘దాండియా ఫెస్ట్’లో ఉత్సాహంగా గడిపారు. శుక్రవారం కూడా కొనసాగే ఈ ఫెస్ట్‌లో దాండియా, గార్భా నృత్యాలే కాదు... పిల్లా, పెద్దా అంతా కలసి ఇక్కడి పండుగ షాపింగ్‌ను కూడా ఆస్వాదించారు. వారి ఆనందాన్ని ‘సిటీ ప్లస్’తో పంచుకున్నారు.
 
 అంతా కలసి...
 మా ఆఫీసులో నిర్వహించే కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొంటా. అలా దాండియాతో పరిచయం ఏర్పడింది. మన హైదరాబాద్ మినీ భారత్. అందుకే ఈ సందడిని అన్ని రాష్ట్రాల వారితో కలసి చేసుకొంటాం. గుజరాతీల సంప్రదాయ దాండియా నేర్చుకొని వారితోనే ఆడటం మంచి అనుభూతి.  
 - చంద్రిక, ఐటీ ఉద్యోగిని
 
 ఎంజాయ్ చేస్తా...
 నాకు కూచిపూడిలో కొంత ప్రవేశం ఉంది. ఉత్తర భారత సంప్రదాయ నాట్యం ఇక్కడి వారితో మమేకం అయిపోయింది. ఒకరి సంస్కృతిని ఒకరు పంచుకున్నప్పుడే స్నేహభావం పెంపొందుతుంది. ఏదేమైనా... దాండియాను బాగా ఎంజాయ్ చేస్తా.  
 - శ్రీలలిత, ఎంఎన్‌సీ ఉద్యోగిని  
 
 మధురానుభూతి...
 మాది చెన్నై. రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. దాండియా అపరిచితులను ఒక చోటికి తెస్తుంది. స్నేహ బంధం వేస్తుంది. నా కుమార్తెకు డ్యాన్స్ చాలా ఇష్టం. తన కోసమే ఇక్కడకు వచ్చా. నిజంగా ఇది ఓ మధురానుభూతి.      ఉండబట్ట లేకో... మరేదన్నా ఊహించుకున్నాడో గానీ... ‘టెరెన్స్ లూయీస్‌తో మీరు డేటింగ్ చేస్తున్నారట కదా’ అని టీవీ స్టార్ సయంతాని ఘోష్‌ను ఠక్కున అడిగేశాడొకాయన. మరీ అంత డెరైక్ట్ ప్రశ్నకు లోపల ఎలా ఫీలైనా... బయటకు మాత్రం ‘అలాంటిదేమీ లేద’ంటూ కూల్‌గా బదులిచ్చిందీ భామ. ‘మేమిద్దరం కలిసి కాఫీకో, డిన్నర్‌కో వెళ్లాలని ఏడాదిగా ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కుదరలేదు. మా ఇద్దరి గురించీ చాలాచాలానే రాస్తున్నారు. కానీ కలిసింది లేదు’ అంటూ గోడు వెళ్లబోసుకుంది.
 - గాయత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement