dangerous country
-
దక్షిణాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం
జొహన్నెస్‌బర్గ్: వాహన డ్రైవింగ్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ అపప్రథ మూటగట్టుకున్న దేశంగా ఉంది. ఈ విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అదేసమయంలో, ప్రపంచంలోనే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా నాలుగోసారి కీర్తి కిరీటం ధరించింది. అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రెయినింగ్ కంపెనీ జుటోబీ వార్షిక నివేదికలో ఈ విషయాలున్నాయి. మొత్తం 53 దేశాలకు గాను దక్షిణాఫ్రికా అట్టడుగున 53వ స్థానంలో ఉండగా అమెరికాకు 51, భారత్‌కు 49వ ర్యాంకులు దక్కా యి. రహదారులపై స్పీడ్ లిమిట్లు, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్ మోతాదు పరిమితులు, రహదారి ప్రమాదాల స్థాయిలు ఆధారంగా డ్రైవింగ్‌కు సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాలను విశ్లేషించామ ని జుటోబీ తెలిపింది. ప్రతి లక్ష మందిగాను రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల్లో చనిపోయే సరాసరి సంఖ్య గతేడాది 8.9 ఉండగా ఈసారి ఇది 6.3కు తగ్గిందని జుటోబీ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో చట్టాలున్నా అవినీతి అధికారుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమని జొహన్నెస్‌బర్గ్‌కు చెందిన డ్రైవింగ్ కంపెనీ ఉద్యోగి అలిషా చిన్నాహ్ వ్యాఖ్యానించారు. -
భారత్‌లో అత్యంత ప్రమాదకరస్థాయిలో మహిళల భద్రత
-
భారత్.. జర్నలిస్టులకు వెరీ డేంజరస్.!
న్యూఢిల్లీ: మీడియా వ్యక్తులకు భారత్ ప్రమాదకరదేశమట. అంతేకాదు జర్నలిస్టులకు రక్షణ కరువైన దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయం 2015లో జరిపిన ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. పాత్రికేయులకు హాని ఉన్న దేశాల జాబితా రూపొందించడానికి చేసిన సర్వేలో ఇరాక్, సిరియా తొలి రెండు స్థానాల్లో నిలవగా... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వే వివరాలను కొట్టిపారేయడానికి ఆస్కారం లేదని మనం గమనించాలి. అందుకు తాజాగా జరిగిన జర్నలిస్టుల హత్యలే ఇందుకు ఉదాహరణ. పక్క పక్క రాష్ట్రాలైన బిహార్, జార్ఖండ్‌లలో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు జర్నలిస్టులు దారుణహత్యకు గురయ్యారు. సీనియర్ పాత్రికేయుడు రాజ్దేవ్ రంజన్‌ను ఈ శుక్రవారం సాయంత్రం బిహార్‌లోని సివాన్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. రాజ్దేవ్ హిందీ దినపత్రిక 'హిందూస్తాన్'లో బ్యూరో చీఫ్ గా 20 ఏళ్లుగా విధులు నిర్వర్తించారు. సివాన్ రైల్వేస్టేషన్ వద్ద అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. జార్ఖండ్‌లోని చాత్రా జిల్లాలో 35 ఏళ్ల అఖిలేశ్ అనే జర్నలిస్టును గురువారం రాత్రి అతి దారుణంగా కాల్చిచంపారు. 1992 నుంచి భారత్ లో అధికారికంగా ఇప్పటివరకూ 64 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని సర్వేలో వెల్లడైంది. ఇందులో చాలా మంది చిన్న చిన్న గ్రామాలు, టౌన్ ప్రాంతాల్లో తమ సమస్యలపై కథనాలు రాసిన వారు ఉన్నారు. స్థానిక రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వల్ల హత్యకు గురవుతున్నారని ఎన్నో ఆరోపణలున్నాయి. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, దాడులు జరిగిన తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త పాలసీలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ చంద్రమౌళి కుమార్ విజ్ఞప్తిచేశారు.