dangerous game
-
‘భారత్‌తో పాక్ డేంజర్ గేమ్.. తట్టుకోలేదు’
గోవా: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ చాలా ఆపాయకరమైన ఆట ఆడుతోందని రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఒక్కసారి భారత్ యాక్షన్‌కు దిగితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ సరైన ఆధారాలు చూపించకుండానే కులభూషణ్‌కు పాక్ ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారికర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కులభూషణ్ యాదవ్ పేరిట భారత్‌తో పాక్ చాలా డేంజర్ గేమ్ ఆడుతోంది. భారత్ తిరుగుబాటుకు దిగితే తిరిగి పోరాడే శక్తి పాక్‌కు లేదు. వారిని వారు ఏ విధంగా రక్షించుకోలేరు. కానీ, మేం శాంతిని కోరుకుంటున్నాం. రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు. ఈ విషయం అర్ధం చేసుకొని జాదవ్‌ను తిరిగి పంపిస్తే ఆ దేశానికే మంచిది. ముందుగా ఒక విషయం చెప్పాలి. పాకిస్థానే ఇరాన్లో ఉన్న జాదవ్‌ను ఎత్తుకెళ్లింది. అరెస్టు సమయంలో పాక్‌లో లేడు. ఓ తాలిబన్ జాదవ్‌ను కిడ్నాప్ చేసి పాక్ తీసుకెళ్లినట్లు మాకు ఇరాన్ స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలు చేస్తుండటం పాక్‌కు అలవాటు. అవసరం అయితే ఆ దేశం ఇంకోలాగ కూడా చేస్తుంది. ఏదేమైనా జాదవ్‌ను ఉరి తీస్తే చూస్తూ ఊరుకోం. బదులిచ్చి తీరుతాం. ఈ విషయాన్ని ఇప్పటికే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు కూడా’ అని పారికర్ అన్నారు. -
'ప్రమాదకర ఆట ఆడుతున్న కాంగ్రెస్'
-
ప్రమాదకర ఆట ఆడుతున్న కాంగ్రెస్: వెంకయ్య
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఈరోజు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిన బహుమానంగా అందరూ చెబుతున్నారు. రాష్ట్ర విభజన అంటే కాంగ్రెస్ అంతర్గత వ్వవహారం కాదన్నారు. ''రాష్ట్ర విభజన సాధారణమైన విషయం కాదు. విభజన విషయంలో ముఖ్యమంత్రిని, మంత్రులను విశ్వాసంలోకి తీసుకోలేదు. తమను విశ్వాసంలోకి తీసుకోలేదని కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలే చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రానికి ప్రణాళిక ఏమైనా ఉందా? 2004 నుంచి 2013 వరకు కాంగ్రెస్ ఏం చేసింది? విభజనపై కేంద్రం ఎటువంటి కసరత్తు చేసింది? బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుల్లా మెలుగుతున్నారా? కాంగ్రెస్ నేతలతో కూడిన ఆంటోనీ కమిటీ వల్ల ప్రయోజనం ఏమిటి?'' అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేశారన్నారు. హైదరాబాద్ ప్రజల భద్రతపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయన్నారు.