dashara
-
దసరా జరుపుకోని ఏకైక గ్రామం! కారణం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!
దసరా సంబరాలు. ఊరు, వాడ, పల్లే, పట్టణం అనే తారతమ్యం లేకుండా అంబరాన్నంటాయి. భారత్‌లోని నలుమూల ప్రాంతాలు దసరా ఉత్సవాలతో మునిగితేలుతుంటే ఓ గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉంటుంది. ఇది ఈ ఏడాది వ్యవహారమూ కాదండోయ్. వందేళ్లుగా దసరా వేడుకలు జరగడం లేదీ గ్రామంలో. పైగా గ్రామ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటారు ఎక్కడకి వెళ్లరు. ఎందుకిలా? అనుకుంటున్నారా? మంచి కారణమే ఉంది. తెలిస్తే మీరూ బాధపడే అవకాశమూ ఉంది. ఆ గ్రామ ప్రజల మనసెంత గొప్పదో కదా అనుకోకుండానూ ఉండలేరు. ఆ గ్రామం పేరు గగోల్. ఉండేది ఉత్తర ప్రదేశ్‌లో. మీరట్ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనిదీ పల్లె. ఇక్కడ దసరా రోజున ప్రజలు ఇంటిగడప దాటరు. నోరూ మెదపరు. మౌనంగా బాధను అనుభవిస్తున్నట్లు ఉంటారు. ఈ వింత పోకడలన్నీ ఎందుకంటే....ఎప్పుడో... 156 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని బ్రిటిష్ పాలకులు ఉరితీసిన విషయాన్ని గుర్తుపెట్టుకుని... ఇప్పటికీ పండుగ జరుపుకోకపోవడం విశేషం. వివరాలేమిటంటే.... భారతదేశ చరిత్ర ఓ ముఖ్యమైన సంఘటన 1857 సిపాయిల తిరుగుబాటు. బ్రిటీష్ వలసవాద విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన తొలి వలసవాద వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బ్రిటీష్ వాళ్లు చాలా క్రూరంగా అణిచివేసినప్పటికీ ఎందరికో స్వాతంత్ర నినాదాన్ని ఇచ్చేలా చైతన్యపరిచింది. వారిలోని దేశభక్తిని మేల్కొల్పి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన గొప్ప ఘటం అది. ఐతే ఈ 1857 సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుని భారత్‌లో పలు చోట్ల బ్రిటీషర్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు జరిగాయి. వీరిలో గగోల్ ప్రాంతవాసులు కూడా ఉన్నారు. ఆ గగోల్ గ్రామం చుట్టపక్కల గ్రామాలైన మురాద్‌నగర్, నూర్‌నగర్, ప్రాంతవాసులు ఝండాసింగ్ సారథ్యంలో తమ గ్రామాలకు సమీపంలో ఉన్న ఆంగ్లేయుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. దీంతో బ్రిటీష్ వాళ్లు ఆ గ్రామస్తులపై దాడికి దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం మీరట్ నగరానికి చెందిన కొత్వాల్ బిషన్ సింగ్ సాయం తీసుకున్నారు. అతను ఆంగ్లేయులను పక్కదారి పట్టించి వారి పన్నాగాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. ఫలితం... ఆ గ్రామాల ప్రజలు సులభంగా తప్పించుకోగలిగారు. కానీ గ్రామాలను ధ్వంసమైపోయాయి. దీంతో ఝుండా సింగ్ పారిపోక తప్పలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు అతడు బ్రిటిష్ వారి చేతిలోనే హతమయ్యాడు. కానీ హింస అక్కడితో ఆగలేదు. ఝండాసింగ్ నేతృత్వంలో దాడులకు దిగిన సుమారు తొమ్మిది మందిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడమే కాకుండా.. వారికి మరణదండన కూడా విధించారు. 1857 దసరా రోజున ఆ తొమ్మిది మందిని ఉరితీశారు. ఆ వీరుల పేర్లు రామ్ సహాయ్, ఘసితా సింగ్, రమణ్ సింగ్, హర్జాస్ సింగ్, హిమ్మత్ సింగ్, కధేరా సింగ్, శిబ్బా సింగ్, బైరామ్, దర్బాసింగ్ తదితరులు. ఈ తొమ్మిదిమంది జ్ఞాపకార్థం వారిని ఉరితీసిన మర్రి చెట్టు కింద సమాధులు నిర్మించారు గ్రామస్తులు. ఏటా దసరా రోజున ప్రజలు వారికి నివాళులర్పించి వారి స్మృత్యార్థం వేడుకలు జరుపుకోవడం మానేశారు. ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు దాదాపు 156 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. స్వాతంత్రం కోసం పాటుపడి, ఆ పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఉత్సవాలు జరుపుకోకుండా ఇంట్లోనే ఉంటూ మౌనం పాటిస్తున్న ఆ గ్రామ ప్రజలు నిజంగా వందనీయులు. ఆ గ్రామ ప్రజలకు దేశం పట్ల, స్వతంత్రం కోసం ప్రాణాలొదిలిని అమరవీరుల యందు కనబరుస్తున్న గౌరవానికి, ప్రేమకు ఫిదా కావల్సిందే కదూ. (చదవండి: ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..) -
లండన్‌లో వైభవంగా చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎంపీ, సీమ మల్హోత్రా ,(లేబర్ పార్టీ షాడో మినిస్టర్) స్థానిక హౌంస్లౌ మేయర్ ఆఫ్జాల్ కియాని, కౌన్సిలర్ ఆదేశ్ ఫార్మహాన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే.టి.ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా "చేనేత బతుకమ్మ మరియు దసరా" వేడుకలను జరుపుకున్నామని యూకే ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు, టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. టాక్ కార్యవర్గానికి అన్ని సందర్భాల్లో కవితక్క వెన్నంటి ఉండి ప్రోహించారని, టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున తెలిపారు. మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంత సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి,స్వాతి బుడగం, క్రాంతి రేతినేని,జాహ్నవి దూసరి, శ్రావ్య వందనపు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షుడు సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుంచి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ " కార్యక్రమంలో.. చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి( బంగారం)ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడమేగాక చేనేతకు చేయూతగా చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు సరికొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతోతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తునందుకు టాక్ సంస్థను పలువురు అభినందించారు. ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ అడ్విసోరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి మరియు టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేత వస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా ఉందన్నారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగలుగుతున్నామని, కాబట్టి కేసిఆర్ గారి పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు. టాక్ కార్యదర్శులు రవి రేతినేని, సుప్రజ పులుసు మరియు గణేష్ కుప్పాల మాట్లాడుతూ.. మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు సహకరించిన స్పాన్సర్ సంస్థలకు స్థానిక అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రైమ్ స్పాన్సర్ అన్నపూర్ణ రైస్ వారు ప్రత్యేక బహుమతులు అందజేసినందుకు అశోక్ గౌడ్ దూసరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ముఖ్య అతిధులు ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా వున్నప్పటికీ, బాద్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఉత్తమ బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్యమూర్తి చిలుమూలా, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం, జాహ్నవి దుసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ కుప్పలా, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, మాధవ రెడ్డి ,సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య వందనపు, హరి గౌడ్ నవాబ్ పేట్, క్రాంతి రేటినేని, శ్వేతా మహేందర్, శశి దొడ్లే, శ్రీ లక్ష్మి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, మౌనిక, ప్రవీణ్ వీర, శ్రీకాంత్ జెల్ల, శైలజ, శ్రీధర్ రావు, కార్తీక్, ప్రశాంత్ మామిడాల, మహేందర్, శ్రీవిద్య, స్నేహ, విజిత, సత్యం కంది, రంజిత్, వంశీ, నరేష్, నాగరాజు, మ్యాడి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!) -
ఇక జగిత్యాల జిల్లా
మారనున్న రూపురేఖలు దసరాకు ఆవిర్భావం జగిత్యాల అర్బన్: కొత్త జిల్లాలపై వచ్చేవారమే నోటిఫికేషన్ రానుంది. జగిత్యాల ఇక జిల్లా కేంద్రంగా మారనుంది. ప్రభుత్వం 23 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఇప్పటికే సీసీఎల్ఏ నోటిఫికేషన్ జారీచేసింది. విజయదశమి నుంచి నూతన జిల్లా కేంద్రాల పరిపాలన చేపట్టేందుకు రెవెన్యూ, సీసీఎల్ఏ ఇప్పటికే సన్నాహాలు పూర్తిచేసింది. అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యావ్నూయ ఏర్పాట్ల బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించింది. అధికారులు, ఉద్యోగుల రేషనలైజేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కరీంనగర్ తర్వాత జిల్లాలో జగిత్యాల అతిపెద్ద పట్టణం. గ్రేడ్–1 మున్సిపాలిటీ కూడా. జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే సబ్‌కలెక్టర్ శశాంక నివేదిక అందజేశారు. ఈ ప్రాంతంలోని 20 మండలాలను కలుపుతూ జిల్లా చేయొచ్చని ప్రతిపాదించారు. జగిత్యాలలో జగిత్యాల అర్బన్, రాయికల్, సారంగాపూర్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి, పెగడపల్లి, మల్యాల, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల అర్బన్, మెట్పల్లి అర్బన్, ధర్మారం, వెల్గటూర్తో పాటు కొత్తగా జగిత్యాల రూరల్, కోరుట్ల రూరల్, మెట్పల్లి రూరల్, బుగ్గారం మండలాలుగా ఏర్పాటుచేసి కొత్త జిల్లాలో కలపనున్నారు.ప్రస్తుతం జిల్లాల జాబితాలో సిరిసిల్లకు చోటు దక్కకపోవడంతో మరిన్ని మండలాలు జగిత్యాల కలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాకుండా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి జగిత్యాల కాగా, రెండోది కోరుట్లగా అధికారులు నిర్ణయించారు. నూకపల్లిలో కలక్టరేట్ జగిత్యాల కలక్టరేట్ సముదాయాన్ని పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) భవన ంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. కానీ.. ఇది దూరంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కలక్టరేట్ ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. ధరూర్‌లో స్థలఅన్వేషణ జగిత్యాల కలెక్టర్ కార్యాలయం కోసం పట్టణంలోని ధరూర్ క్యాంపులోని 75 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇందులో కలక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మారనున్న రూపురేఖలు ప్రస్తుతం టవర్‌సర్కిల్ నుంచి ఎటు 3 కి.మీ ప్రాంతంలో విస్తరించి ఉంది. 38 వార్డులు ఉండగా 1,00,863 జనాభా కలిగి ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో చుట్టూ గ్రామాలైన మోతె, తిప్పన్నపేట, చల్గల్, లింగంపేట, హుస్నాబాద్, పూర్తిస్థాయిలో విలీనం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పట్టణ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా జగిత్యాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. జిల్లా కేంద్రం కానుండటంతో విద్య, వైద్య సౌకర్యాలూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చదువుల కోవెలగా.. జగిత్యాల డివిజన్ కేంద్రం ఇప్పటికే చదువుల కోవెలగా పేరుగాంచింది. కొండగట్టులోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలతో పాటు పొలాసలో వ్యవసాయ పరిశోధన స్థానం, అగ్రికల్చర్ కాలేజీ, బీఎస్సీ నర్సింగ్ కళాశాలతో పాటు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలూ ఉన్నాయి. జిల్లా కేంద్రంగా మారితే మరిన్ని కళాశాలు వచ్చే అవకాశాలున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ కవులు కేవీ.నరేందర్, బీఎస్.రావ¬లు, సంగవేని రవీంద్ర, చరిత్రకారులు జైశెట్టి రమణయ్య వీరు కరీంనగర్ జిల్లాలో ప్రాముఖ్యం సంపాదించారు. వీరు జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు. పట్టణంలో ముఖ్యంగా ఖిల్లా పర్యాటక కేంద్రంగా మారనుంది. జగిత్యాలలోని చింతకుంట చెరువును సైతం మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నారు. వ్యవసాయం జగిత్యాల జిల్లా పరిధిలో ముఖ్యంగా వరి ప్రధానమైన పంట. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగునీరు అందుతుంది. ఇక్కడ ప్రధానమైన పంట వరి కావడంతో పాటు పత్తి కూడా ఎక్కువ శాతం పండిస్తుంటారు. ఆరుతడి పంటల్లో మొక్కజొన్న, శెనగ తదితర పంటలు వేస్తుంటారు. ఆలయాలు జగిత్యాల జిల్లాలో ప్రముఖ ఆలయాలైన కొండగట్టుతో పాటు ధర్మపురి దేవస్థానం కూడా ఇందులో వస్తుంది. రెండు దేవాలయాలు ప్రధానమైనవి.