లండన్‌లో వైభవంగా చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు! | Chenetha Bathukamma And Dasara Celebrations In Landon | Sakshi
Sakshi News home page

లండన్‌లో వైభవంగా చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు!

Published Wed, Oct 25 2023 1:08 PM | Last Updated on Wed, Oct 25 2023 1:08 PM

Chenetha Bathukamma And Dasara Celebrations In Landon - Sakshi

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎంపీ, సీమ మల్హోత్రా ,(లేబర్ పార్టీ షాడో మినిస్టర్) స్థానిక హౌంస్లౌ మేయర్ ఆఫ్జాల్ కియాని, కౌన్సిలర్ ఆదేశ్ ఫార్మహాన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే.టి.ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా "చేనేత బతుకమ్మ మరియు దసరా" వేడుకలను జరుపుకున్నామని యూకే ఎన్నారై బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. టాక్ కార్యవర్గానికి అన్ని సందర్భాల్లో కవితక్క వెన్నంటి ఉండి ప్రోహించారని, టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపుని పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున తెలిపారు. మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంత సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి,స్వాతి బుడగం, క్రాంతి రేతినేని,జాహ్నవి దూసరి, శ్రావ్య వందనపు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ఉపాధ్యక్షుడు సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుంచి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా " అలాయ్ - బలాయ్ " కార్యక్రమంలో.. చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి( బంగారం)ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడమేగాక చేనేతకు చేయూతగా చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు.

విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు సరికొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతోతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తునందుకు టాక్ సంస్థను పలువురు అభినందించారు.

ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ అడ్విసోరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి మరియు టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేత వస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా ఉందన్నారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగలుగుతున్నామని, కాబట్టి కేసిఆర్ గారి పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు.

టాక్ కార్యదర్శులు రవి రేతినేని, సుప్రజ పులుసు మరియు గణేష్ కుప్పాల మాట్లాడుతూ.. మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు సహకరించిన స్పాన్సర్ సంస్థలకు స్థానిక అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రైమ్ స్పాన్సర్ అన్నపూర్ణ రైస్ వారు ప్రత్యేక బహుమతులు అందజేసినందుకు అశోక్ గౌడ్ దూసరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ముఖ్య అతిధులు ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా వున్నప్పటికీ, బాద్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

ఉత్తమ బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్యమూర్తి చిలుమూలా, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం, జాహ్నవి దుసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ కుప్పలా, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, మాధవ రెడ్డి ,సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య వందనపు, హరి గౌడ్ నవాబ్ పేట్, క్రాంతి రేటినేని, శ్వేతా మహేందర్, శశి దొడ్లే, శ్రీ లక్ష్మి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, మౌనిక, ప్రవీణ్ వీర, శ్రీకాంత్ జెల్ల, శైలజ, శ్రీధర్ రావు, కార్తీక్, ప్రశాంత్ మామిడాల, మహేందర్, శ్రీవిద్య, స్నేహ, విజిత, సత్యం కంది, రంజిత్, వంశీ, నరేష్, నాగరాజు, మ్యాడి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement