daughter complaints
-
సీనియర్ నటుడిపై కుమార్తె ఫిర్యాదు
యశవంతపుర: డబ్బు కోసం తనను వేధిస్తున్నాడని కన్నడ నటుడు సత్యజిత్‌పై ఆయన కుమార్తె అక్తర్ సాలేహా బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నెలకు రూ.లక్ష చెల్లిస్తున్నప్పటికీ, ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. అదీకాక రౌడీలతో బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, గ్యాంగ్రేన్ వ్యాధి కారణంగా నటుడు సత్యజిత్ కాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి -
రెండో వివాహం చేసుకుని నన్ను చంపేందుకు కుట్ర
రసూల్‌పురా: తన తండ్రి రెండో వివాహం చేసుకుని తన చంపేందుకు యత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి బొల్లారం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక జనప్రియ అపార్ట్మెంట్లో ఉంటున్న డేవిడ్ రాణిగండ్ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె అమూల్య (26) అలియాస్ ఆసియా తొమ్మిదేళ్ల క్రితం చంపాపేట సింగరేణి కాలనీకి చెందిన ఇస్మాయిల్‌ను ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. తొమ్మిది నెలల క్రితం తన తల్లి మృతి చెందినట్లు తెలియడంతో పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తండ్రి, కుమార్తె మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం డేవిడ్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆస్తి అడిగినందుకు తన తండ్రి డేవిడ్ రెండో భార్యతో కలిసి దాడి చేశాడని గత అక్టోబర్ 2న అమూల్య బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు డేవిడ్ అతని భార్యపై చార్జ్‌షీట్ దాఖలు చేయగా కోర్టులో కేసు నడుస్తోంది. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడమేగాకుండా, తన ను హత్య చేసేందుకు డేవిడ్ సుపారీ ఇచ్చాడని ఆరోపిస్తూ అమూల్య మూడు రోజుల క్రితం బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. కోర్టులో తేల్చుకోవాలి: సీఐ తన తల్లికి సంబందించిన వస్తువులతో పాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని అమూల్య మూడు రోజుల క్రితం ఫిర్యాదులో పేర్కొందని సీఐ రమేష్‌రెడ్డి తెలిపారు. ఆస్తికి సంబందించిన ఫిర్యాదు అయినందున సివిల్ కేసుగా పరిగణిస్తూ కోర్టులో తేల్చుకోవాలని వారికి సూచించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఆడపిల్ల మాకొద్దు.. మేం సాకలేము!
పెద్దవూర(నాగార్జునసాగర్) : ‘ఆడశిశువు మాకొ ద్దు, మేము సాకలేము శిశుగృహకు అప్పగించండి’ అని ఐసీడీఎస్ అధికారులను వేడుకుంటున్నారు.. పెద్దవూర మండలంలోని పాల్తీతండాకు చెందిన గిరిజన దంపతులు. వివరాలు.. తండాకు చెందిన రమావత్ జయ–జాను దంపతులకు నాలుగో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. మొదటి, మూడో సంతానాల్లో ఆడ శిశువులు, రెండో సంతానంలో మగపిల్లాడు జన్మించాడు. మరో మగపిల్లాడు కావాలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. నాలుగో సంతానంలోనూ ఈ నెల 18వ తేదీన జయ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడశిశువుకు జన్మనిచ్చిన మరుసటి రోజే తండాలోని అంగన్వాడీ టీచర్‌కు తనకు ఈ ఆడశిశువు వద్దని శిశుగృహకు అప్పగించమని కోరుతుంది. ఎన్నిసా ర్లు చెప్పినా పాపను శిశుగృహకు తీసుకెళ్లకుండా పట్టించుకోవడం లేదని, ఇలా అయితే పాపకు పాలు కూడా ఇవ్వడం మానేస్తానని.. ఒకేరోజులో సీడీపీఓకు, అంగన్వాడీ టీచర్‌కు పదేపదే ఫోన్లు చేసింది. దీంతో అంగన్వాడీ సూపర్వైజర్ వెం కాయమ్మ తండాకు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పాప పుట్టిన వెంటనే శిశుగృహకు తరలిస్తే ఇమ్యూనిటీ పవర్ లేక పిల్లలు చనిపోతున్నారని, కనీసం మూడు నెలలైనా తల్లిపాలు ఇస్తే బిడ్డకు ఇబ్బంది ఉండదని చెప్పే ప్రయత్నం చేసినా ఎంతకూ వినిపించుకోలేదు. మూడు గంటల పాటు కౌన్సెలింగ్ ఇవ్వగా చివరికి మనసు మార్చుకున్న శిశువు తల్లిదండ్రులు శిశుగృహకు ఏమి అప్పగించమని మూడు నెలల తర్వాతనే అప్పగిస్తామని ఒప్పుకున్నారు. దీంతో పాపకు అనా రోగ్యం కలిగినా, ఏదైనా అపాయం కలిగినా పూర్తి బాధ్యత మాదే అని ఐసీడీఎస్ అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. -
తండ్రి అసభ్య ప్రవర్తనపై కూతురు ఫిర్యాదు
బంజారాహిల్స్: తండ్రి వేధిస్తున్నాడంటూ ఓ బాలిక బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు... ఈనెల 8న ఇంటికి వచ్చిన తన తండ్రి తనను అసభ్యపదజాలంతో దూషించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీలో నివసించే విద్యార్థిని (17) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్డువచ్చిన తన తల్లీచెల్లెల్ని కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను రోజూ కొడుతూ, వేధిస్తున్నాడని ఈ మేరకు పోలీసులు శంకర్‌పై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.