దంపతులకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వెంకాయమ్మ
పెద్దవూర(నాగార్జునసాగర్) : ‘ఆడశిశువు మాకొ ద్దు, మేము సాకలేము శిశుగృహకు అప్పగించండి’ అని ఐసీడీఎస్ అధికారులను వేడుకుంటున్నారు.. పెద్దవూర మండలంలోని పాల్తీతండాకు చెందిన గిరిజన దంపతులు. వివరాలు.. తండాకు చెందిన రమావత్ జయ–జాను దంపతులకు నాలుగో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. మొదటి, మూడో సంతానాల్లో ఆడ శిశువులు, రెండో సంతానంలో మగపిల్లాడు జన్మించాడు. మరో మగపిల్లాడు కావాలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. నాలుగో సంతానంలోనూ ఈ నెల 18వ తేదీన జయ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడశిశువుకు జన్మనిచ్చిన మరుసటి రోజే తండాలోని అంగన్‌వాడీ టీచర్‌కు తనకు ఈ ఆడశిశువు వద్దని శిశుగృహకు అప్పగించమని కోరుతుంది.
ఎన్నిసా ర్లు చెప్పినా పాపను శిశుగృహకు తీసుకెళ్లకుండా పట్టించుకోవడం లేదని, ఇలా అయితే పాపకు పాలు కూడా ఇవ్వడం మానేస్తానని.. ఒకేరోజులో సీడీపీఓకు, అంగన్‌వాడీ టీచర్‌కు పదేపదే ఫోన్‌లు చేసింది. దీంతో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ వెం కాయమ్మ తండాకు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పాప పుట్టిన వెంటనే శిశుగృహకు తరలిస్తే ఇమ్యూనిటీ పవర్ లేక పిల్లలు చనిపోతున్నారని, కనీసం మూడు నెలలైనా తల్లిపాలు ఇస్తే బిడ్డకు ఇబ్బంది ఉండదని చెప్పే ప్రయత్నం చేసినా ఎంతకూ వినిపించుకోలేదు. మూడు గంటల పాటు కౌన్సెలింగ్ ఇవ్వగా చివరికి మనసు మార్చుకున్న శిశువు తల్లిదండ్రులు శిశుగృహకు ఏమి అప్పగించమని మూడు నెలల తర్వాతనే అప్పగిస్తామని ఒప్పుకున్నారు. దీంతో పాపకు అనా రోగ్యం కలిగినా, ఏదైనా అపాయం కలిగినా పూర్తి బాధ్యత మాదే అని ఐసీడీఎస్ అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment