Daughter dead body
-
కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు..
-
కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు..
భువనేశ్వర్: ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపుర్ గ్రామంలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. టిట్లీ తుపాన్ కారణంగా మరణించిన కూతురి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలో ఓ తండ్రి ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీపుర్ గ్రామానికి చెందిన ముకుంద్ 7 ఏళ్ల కూతురు బబిత అక్టోబర్ 11 వ తేదీన తిత్లీ తుపాన్ కారణంగా సంభవించిన వరదల్లో తప్పిపోయింది. కాగా, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బుధవారం మహేంద్ర గిరి వద్ద కొండచరియల కింద బబిత మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గురువారం ముకుంద్‌కు చేరవేశారు. అలాగే కూతురి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తేనే.. ప్రభుత్వం నుంచి అందించే పరిహారం అందుతుందని అతనికి తెలిపారు. అలాగే బబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా.. మృతదేహాన్ని కైన్పూర్ ఆస్పత్రికి తీసుకురావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. కూతురి మృతదేహాన్ని వాహనంలో ఆస్పత్రికి తరలించడానికి డబ్బులు లేని ముకుంద్.. మృతదేహాన్ని ఓ సంచిలో ఉంచి దానిని భుజం వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. దారి పోడువున చాలా మంది అతన్ని చూస్తూ ఉన్నప్పటికీ.. ఎవరు అతనికి సహాయపడలేదు. ఇలా అతను 8 కి.మీలు ప్రయాణించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి ఆటో ఏర్పాటు చేసి కైన్పూర్ ఆస్పత్రికి వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీనిపై ముకుంద్ మాట్లాడుతూ.. తన కూతురి మృతదేహాన్ని వాహనంలో తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తుపాన్ కారణంగా గ్రామానికి వచ్చే దారి దెబ్బతినడంతో.. తానే భుజంపై మోసుకుంటూ వచ్చానని అన్నారు. బబిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడానికి సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ విషయం తెలుసుకున్న గజపతి జిల్లా కలెక్టర్ అనుపమ్ షా మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తుపాన్ కారణంగా కూతురిని కొల్పోయిన ముకుంద్‌కు గురువారం సాయంత్రం 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. -
కూతురి శవంతో.. 6 కిలోమీటర్ల నడక!
-
కూతురి శవంతో.. 6 కిలోమీటర్ల నడక!
సుమారు వారం రోజుల క్రితం ఒడిషాలో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో పాటు పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాని వేడి చల్లారేలోపే మరో వివాదం అదే రాష్ట్రంలో చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లాలో ఓ వ్యక్తి తన ఏడేళ్ల కూతురి శవాన్ని భుజాన వేసుకుని 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆ చిన్నారిని అంబులెన్సులో మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. దారి మధ్యలోనే ఆమె చనిపోయినట్లు తెలియడంతో అంబులెన్సు వాళ్లు దారిలోనే వాళ్లను దించేశారు. ఏడేళ్ల బర్షా ఖేముదు ఆరోగ్యం విషమించడంతో అప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్న మిథాలి ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. అంబులెన్సులో ఆమెను తీసుకెళ్తుండగా.. దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ విషయం తెలిసిన అంబులెన్సు డ్రైవర్ వెంటనే తమను దించేశాడని బాలిక తండ్రి దీనబంధు ఖేముదు చెప్పారు. భార్యాభర్తలిద్దరూ కూతురి శవాన్ని మోసుకుంటూ సమీపంలోని గ్రామానికి వెళ్లడంతో ఏమైందని అక్కడి గ్రామస్తులు అడిగారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరో వాహనంలో ఆ కుటుంబాన్ని వారి గ్రామంలో వదిలిపెట్టాలని వారు బీడీఓను, వైద్యాధికారులను కోరారు. ఆనోటా ఈనోటా విషయం జిల్లా కలెక్టర్ కె. సుదర్శన్ చక్రవర్తి దృష్టికి వెళ్లింది. వెంటనే దీనిపై విచారణ జరపాల్సిందిగా చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ మిశ్రాను ఆదేశించారు. అంబులెన్సు డ్రైవర్, ఫార్మాసిస్ట్, వాహనంలో ఉన్న మరో అటెండెంటుపై మల్కన్‌గిరి పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. డ్రైవర్ చేసినది పూర్తిగా చట్ట విరుద్ధమని, నేరపూరిత నిర్లక్ష్యమని కలెక్టర్ చక్రవర్తి అన్నారు. అతడితో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని జిల్లా యంత్రాంగం కల్పించిందని ఆయన చెప్పారు. -
బియాస్ నదిలో లభించిన శ్రీనిధి ఆచూకీ
కన్నీటి నిరీక్షణకు తెర - 42 రోజులుగా దు:ఖసాగరంలో తల్లిదండ్రులు - నేడు రేకుర్తికి మృతదేహం కరీంనగర్ రూరల్ : కన్నకూతురు మృతదేహాన్ని కడసారి చూడాలనే ఆ తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడింది. 42 రోజుల సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం ఆదివారం బియాస్ నదిలో కూతురు మృతదేహం లభించిందనే సమాచారంతో ఇన్నాళ్లూ దిగమింగిన దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం రేకుర్తికి తీసుకరావడానికి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద ఉధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 24 మంది విద్యార్థులు నదిలో గల్లంతు కావడంతో శ్రీనిధి అచూకీ కోసం ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. కూతురు ఆచూకీ కోసం నది ఒడ్డున పదిరోజులపాటు పడిగాపులు కాశాడు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి కొద్ది రోజులపాటు అక్కడే ఉండి గా లింపును పర్యవేక్షించారు. మంచుకొండలు కరిగి నదిలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చే పట్టగా గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో 21 మృతదేహాలు లభించా యి. ఒక్కొక్క మృతదేహం బయటపడుతున్న కొద్దీ అది తమ కూతురుదేమోననే ఆతృతతో వెళ్లి చూడడం... ఆమెది కాదని తెలిసి నది ఒడ్డున విషాదవదనంతో ఎదురుచూపులు చూడడం రాజిరెడ్డికి నిత్యకృత్యమైంది. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు ప్రకటి ంచింది. గల్లంతైన విద్యార్థుల పేరిట డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కూతురు ఆచూకీపై రాజిరెడ్డి ఆశ లు వదులుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరినీ అక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజిరెడ్డి గత నెల 20న స్వగ్రామం రేకుర్తికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి శ్రీనిధి జ్ఞాపకాలతో ఆమె మృతదేహం ఆచూకీ కోసం రాజిరెడ్డి కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం బియాస్‌నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో లభించిన రెండు మృతదేహాల్లో ఒకటి శ్రీనిధిగా గుర్తించినట్లు అధికారులు ప్రకటించడంతో తల్లిదండ్రులు రాజిరెడ్డి, అనంతలక్ష్మి, అక్క తేజతోపాటు బంధువుల్లో దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. శ్రీనిధి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని సోమవారం హిమాచల్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించడానికి అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి రాజిరెడ్డి సమీప బంధువులతో కలిసి సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మృతదేహం రేకుర్తికి వచ్చే అవకాశముంది.