Dave Cameron
-
కీలక బ్యాట్స్ మన్ పై వేటు
సెయింట్ జాన్స్: కీలక బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్ల్యూఐసీబీ) షాక్ ఇచ్చింది. ‘బిగ్ ఇడియట్’ కాంట్రాక్టు వివాదంతో అతడిపై వేటు వేసింది. జింబాబ్వేలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో 27 ఏళ్ల బ్రావోకు చోటు కల్పించలేదు. డబ్ల్యూఐసీబీ ఇవ్వచూసిన సీ-కేటగిరి కాంట్రాక్టుపై అతడు బహిరంగంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ ఆటగాళ్లకు తక్కువ స్థాయి కాంట్రాక్టులు కట్టబెడతారా అని ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అంతేకాదు డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కెమరాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డేవ్ బిగ్ ఇడియట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఫలితంగా బ్రావోపై వేటు పడింది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ జాసన్ మహ్మద్ ను జట్టులోకి తీసుకున్నారు. అనుచిత ప్రవర్తన కారణంగా బ్రావోను ఎంపిక చేయలేదని డబ్ల్యూఐసీబీ వెల్లడించింది. 95 వన్డేలు ఆడిన బ్రావో 2,955 పరుగులు చేశాడు. వ్యక్తిగత కారణాలతో వైదొలగిన సునీల్ నరైన్ స్థానంలో బిషూను తీసుకున్నారు. -
విండీస్ బోర్డుపై బీసీసీఐ కరుణ
రూ. 280 కోట్ల నష్టపరిహారం రద్దు న్యూఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) చెల్లించాల్సిన దాదాపు రూ. 280 కోట్ల నష్టపరిహారంపై బీసీసీఐ వెనక్కి తగ్గింది. 2014లో డ్వేన్ బ్రేవో నేతృత్వంలోని విండీస్ వన్డే జట్టు అర్ధాంతరంగా సిరీస్ నుంచి తప్పుకుని స్వదేశానికి పయనమైంది. దీంతో తాము భారీగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, నష్టపరిహారంగా 41.97 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా బీసీసీఐ డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడా మొత్తాన్ని రద్దు చేసుకుంది. ‘విండీస్ బోర్డుతో సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు గత సిరీస్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఆడేందుకు 2017లో విండీస్ జట్టు భారత్కు వస్తుంది. ఈ విషయంలో మేం కూడా సంతృప్తిగా ఉన్నాం. అందుకే పెనాల్టీని రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇక మేలో షెడ్యూల్ను ఖరారు చేస్తాం’ అని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. మరోవైపు మనోహర్ చెప్పిన విషయాలకు తాము కట్టుబడి ఉన్నట్టు డబ్ల్యుఐసీబీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్ తెలిపారు.