DBTL
-
ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రయోజనం తక్కువే!
ఎల్పీజీ సబ్సిడీపై కేంద్రం ప్రకటనను తప్పుబట్టిన కాగ్ న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ. 1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలుతో ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని, వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో పేర్కొంది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ. 35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ వల్ల జరిగిన మిగులుగా ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లే(15 శాతం) డీబీటీఎల్ వల్ల మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనంగా వచ్చిందేనని పేర్కొంది. ఇక సబ్సిడీ మొత్తం, 67.27 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీని వదులుకోవడం వల్ల మిగిలిన మొత్తానికి సంబంధించి చమురు సంస్థలు, పెట్రోలియం శాఖల లెక్కలకు పొంతన లేదని పేర్కొంది. తప్పుడు విధానంలో ‘ఏఆర్‌సీఐ’ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ‘ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ(ఏఆర్‌సీఐ)’ని ఏర్పాటు చేసిందని కాగ్ పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేకుండా ఇలాంటి సంస్థ ఏర్పాటు.. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధమని, ఇప్పటికైనా ఆ అనుమతి తీసుకోవాలని సూచించింది. -
నగదు బదిలీతో మిగులు తక్కువే!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ.1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలు ద్వారా ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లుగా ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని... వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ.35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ పథకం కారణంగా జరిగిన మిగులుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లు మాత్రమే డీబీటీఎల్ కారణంగా మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనం కారణంగా వచ్చిందేనని పేర్కొంది. -
వచ్చింది 'ఆధారం'.. మిగిల్చింది కోట్ల ఆదాయం!
ఆధార్ కార్డులను గుర్తింపు కార్డులుగా ఆమోదించడం మొదలయ్యాక వేల కోట్లలో ప్రభుత్వ నిధులు ఆదా అవుతున్నాయి. గతంలో ఆయా శాఖల కింద పెట్టిన ఖర్చులతో పోల్చితే గత చట్టాల్లోని డొల్లతనం బయటపడుతోంది. పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖకు చెందిన నిధుల్లో ఆధార్ అమలు తర్వాత రూ.14,672 కోట్ల మిగులు కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లోని ప్రజా పంపిణీ వ్యవస్థలో రూ.2,346కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్‌ల్లో స్కాలర్‌షిప్‌ల్లో రూ.276 కోట్లు, జాతీయ సామాజిక ప్రోత్సహం కింద జార్ఖండ్, చండీఘడ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్లో రూ. 66 కోట్లు మిగిలాయి. -
గడువు పెంపు
సాక్షి, చెన్నై : వంట గ్యాస్ సబ్సిడీ నిమిత్తం ‘డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ విధానానికి గాను దరఖాస్తులు చేసుకునేందుకు మరింత గడువు పెంచారు. దరఖాస్తులు చేసుకోని వినియోగదారులకు జూలైతర్వాత సబ్సిడీ రద్దవుతుంది. రాష్ట్రంలో గురువారం నుంచి ఈ సబ్సిడీ విధానం అమల్లోకి వచ్చింది. వంట గ్యాస్ వినియోగదారులకు ఇదివరకు డీలర్ల ద్వారా సబ్సిడీ రూపంలో సిలిండర్ల పంపిణీ జరిగేది. సబ్సిడీ భారం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించే పనిలో పడింది. దేశంలో గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు నేరుగా సబ్సిడీని బ్యాంక్ ద్వారా అందించేందుకు నిర్ణయించింది. ఇందుకుగాను వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను, ఆధార్ నంబర్లను సేకరించే పనిలోపడింది. ఒకే ఇంట్లో రెండు మూడు కనెక్షన్లు ఉన్నా, వాటిని రద్దు చేయడానికి ఈ విధానం దోహదకారిగా మారింది. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీఎల్) విధానం అమల్లోకి తెచ్చేందుకుగాను వినియోగదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పర్వం వేగవంతమైంది. అయితే, రాష్ర్టంలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని చెప్పవచ్చు. గతంలో ఉచిత సింగిల్ సిలిండర్ పథకం అమలు చేసిన దృష్ట్యా, గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ వినియోగం దరిచేరింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతాలు కల్గిన వారి సంఖ్య తక్కువే. అదే సమయంలో ఆధార్ కార్డు మంజూరు అంతంత మాత్రమే. గడువు పెంపు జనవరి ఒకటో తేదీలోపు డీబీటీఎల్ విధానంలో చేరిన వారు పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసుకోవాలి. సబ్సిడీ మొత్తం రెండు లేదా నాలుగు రోజుల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఐవోసీ, హెచ్‌పీ, భారత్ తదితర పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు ప్రకటించాయి. ఆ మేరకు ఈ విధానం రాష్ట్రంలో గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, రాష్ట్రంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గురువారం నాటికి ఆ పథకంలోకి చేరిన వారి సంఖ్య గ్యాస్ వినియోగదారుల సంఖ్య కంటే తక్కువే. ఈ నేపథ్యంలో గడువును పెంచేందుకు సిద్ధయయ్యారు. మార్చి 31వ తేదీలోపు బ్యాంక్ ఖాతా నంబర్లు సంబంధిత డీలర్లకు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక, ప్రతి ఆదివారమూ ప్రత్యేక శిబిరం ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ విషయంగా ఐవోసీ అధికారి వెట్రి సెల్వన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీ విధానంలో అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్న వారందరికీ వారివారి బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ జమ చేయడం జరుగుతుందన్నారు. మరె ందరో వినియోగదారులు దరఖాస్తులు సమర్పించాల్సిన దృష్ట్యా, గడువును పెంచినట్టు తెలిపారు. మార్చి 31లోపు దరఖాస్తులు సమర్పించే వారికి త్వరితగతిన బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ చేస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దరఖాస్తులు చేసుకున్న పక్షంలో వారికి మూడు నెలల అనంతరం బ్యాంక్‌ల్లో సబ్సిడీ జమవుతుందన్నారు. జూన్ నెలఖారుకు ఈ ప్రక్రియను ముగియనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకోని గ్యాస్ వినియోగదారులు శాశ్వతంగా సబ్సిడీని కొల్పోయినట్టేనని స్పష్టం చేశారు. -
గ్యాస్ సబ్సిడీ చెల్లింపు నేటి నుంచే
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కొనే ముంబై, ఢిల్లీ వినియోగదారులకు బుధవారం నుంచి వారి ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తాన్ని జమచేస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ప్రకారం వినియోగదారుడు మొదట మార్కెట్ ధర రూ.1,021 సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తరువాత సబ్సిడీ మొత్తం అతడు/ఆమె ఖాతాలోకి జమవుతుంది. అయితే బుక్ చేసిన వెంటనే రూ.435 ఖాతాలోకి జమవుతుంది. పూర్తి డబ్బు చెల్లించిన రోజు మిగతా మొత్తం బదిలీ అవుతుంది. ఆధార్ ద్వారా అనుసంధానించిన ఖాతాలకు ఈ మొత్తాలను బదిలీ చేస్తారు. మొదటిదశలో దేశంలోని 184 జిల్లాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నారు.