న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కొనే ముంబై, ఢిల్లీ వినియోగదారులకు బుధవారం నుంచి వారి ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తాన్ని జమచేస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ప్రకారం వినియోగదారుడు మొదట మార్కెట్ ధర రూ.1,021 సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తరువాత సబ్సిడీ మొత్తం అతడు/ఆమె ఖాతాలోకి జమవుతుంది. అయితే బుక్ చేసిన వెంటనే రూ.435 ఖాతాలోకి జమవుతుంది. పూర్తి డబ్బు చెల్లించిన రోజు మిగతా మొత్తం బదిలీ అవుతుంది. ఆధార్ ద్వారా అనుసంధానించిన ఖాతాలకు ఈ మొత్తాలను బదిలీ చేస్తారు. మొదటిదశలో దేశంలోని 184 జిల్లాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నారు.