ఆసిఫ్ నగర్ లో కార్డన్ సెర్చ్, 72 మంది అరెస్ట్
హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 72 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితులలో 32 మంది బిహార్ కు చెందిన వారు ఉన్నారని పోలీసులు వివరించారు.