Dead Dozen
-
జైల్లో ఘర్షణ.. 68 మంది ఖైదీలు మృతి
క్విటో: ఈక్వెడార్‌లోని జైలులో రెండు ముఠాల మధ్య భీకరస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. కోస్తా తీర నగరం గుయాక్విల్‌లో ఈ దారుణం జరిగినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధం ఉన్న రెండు గ్యాంగుల నడుమ దాదాపు 8 గంటలపాటు ఈ ఘర్షణ జరిగింది. తుపాకులతో కాల్పులు జరుపుకున్నట్లు తెలిసింది. జైలు అధికారులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) -
అమెరికాలో ఉన్మాది కాల్పులు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్ సిటీలో ఓ ఇంజనీర్ శుక్రవారం తుపాకీతో సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని కాల్చిచంపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని డ్వేన్ క్రాడిక్(40)గా గుర్తించారు. ఈ విషయమై వర్జీనియా బీచ్ పోలీస్ చీఫ్ జేమ్స్ సెర్వెరా మాట్లాడుతూ.. నగర మున్సిపల్ శాఖలోని ప్రజాపనుల విభాగంలో గత 15 సంవత్సరాలుగా డ్వేన్ క్రాడిక్ ఇంజనీర్‌గా సేవలు అందిస్తున్నాడని తెలిపారు. అయితే తన విధుల పట్ల అసంతృప్తిగా ఉన్న డ్వేన్ క్రాడిక్.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు(స్థానిక కాలమానం) సైలెన్సర్ అమర్చిన తుపాకీతో తన కార్యాలయం ఉన్న వర్జీనియా బీచ్ మున్సిపల్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. ఆఫీసులోకి వచ్చేముందు గేటుదగ్గర ఒకరిని తుపాకీతో కాల్చాడు. అనంతరం మున్సిపల్ శాఖ కార్యాలయాలున్న రెండో భవంతిలోకి దూసుకెళ్లాడు. ఆ భవంతిలోని మూడు అంతస్తుల్లోని సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగాడు. గదుల్లో దాక్కున్న ఉద్యోగులు.. ఈ సందర్భంగా కాల్పుల శబ్దం విన్న కొందరు ఉద్యోగులు.. గది తలుపులు మూసేసి 911కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్రాడిక్ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు డ్వేన్ క్రాడిక్ను కాల్చిచంపారు. క్రాడిక్ జరిపిన కాల్పుల్లో ఓ కాంట్రాక్టర్‌తో పాటు 11 మంది సహోద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. క్రాడిక్ ఈ హత్యలు ఎందుకు చేశాడు? సహోద్యోగులతో ఏమైనా గొడవపడ్డాడా? ఉన్నతాధికారులు మందలించారా? అన్న విషయమై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఇది వర్జీనియాబీచ్ చరిత్రలోనే అత్యంత దుర్దినమని నగర మేయర్ అన్నారు. -
తీహార్ జైల్లో గ్యాంగ్‌వార్; ఇద్దరు మృతి
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో బుధవారం ఖైదీల మధ్య గ్యాంగ్‌వార్ చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత రేపిన ఈ గ్యాంగ్‌వార్‌లో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జైలు ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం... బుధవారం భోజన విరామం తరువాత కట్టుదిట్టమైన భద్రత మధ్యుండే వార్డుకు చెందిన ఖైదీలు ఈశ్వర్, విజయ్, షాదాబ్ ను జైలు ఆవరణలోని ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. తిరిగి వార్డు తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. జైలు అధికారులు, పోలీసుల సమక్షంలోనే ఖైదీలు అనిల్, వాసు, సందీప్ పరస్పరం దాడులకు దిగారు. మరోవైపు జైలు నెం. 1, 2 , 4 లకు చెందిన ఖైదీలు కూడా వీరికి జత కలిశారు. దీంతో పరిస్థితి మరింత భయానకంగా మారిపోయింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన అనిల్(20) ఈశ్వర్(20) అక్కడిక్కడే మరణించారని, సెక్యూరిటీ సిబ్బంది సహా మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి ముఖేష్ ప్రసాద్ తెలిపారు. ఘర్ణణను అదుపు చేసే క్రమంలో జైలు సిబ్బంది కూడా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించి, పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.