deaths in India
-
The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు. → భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. → ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు. → ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు. → భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది. → క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. → స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. -
4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: 2021లో దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది గాయపడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజాగా ఒక నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలు 8.1 శాతం, బాధితుల సంఖ్య 14.8 శాతం తగ్గినట్టు చెప్పింది. ‘‘మృతుల సంఖ్య మాత్రం 1.9 శాతం పెరిగింది. 2020 కంటే 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం, గాయపడినవారి సంఖ్య 10.39 శాతం పెరిగాయి. దేశంలో రోజూ సగటున 1,130 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 422 మంది మరణిస్తున్నారు’’ అని తెలిపింది. ► 2021లో ప్రమాదాల మృతుల్లో 67.7 శాతం 18–45 ఏళ్లలోపు వారే! 18–60 ఏళ్లలోపు వారు 84.5 శాతం మంది. ► గతేడాది 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 31.2 శాతం జాతీయ రహదారులపై, 23.4 శాతం రాష్ట్ర రహదారులపై, 45.4 శాతం ఇతర రోడ్లపై జరిగాయి. ► 2021లో తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది మరణించారు. ► రోడ్డు ప్రమాద మరణాలకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రధాన కారణాలు. ► పమాదాల్లో ద్విచక్ర వాహనాలదే ప్రధాన వాటా. కార్లు, జీపులు తర్వాతి స్థానంలో ఉన్నాయి. -
ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: ఈ.కోలి. ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘2019లో ప్రపంచం మొత్తమ్మీద సంభవించిన మరణాలకు గుండె సంబంధిత వ్యాధుల తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే రెండో అతి పెద్ద కారణంగా నిలిచాయి. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటి ఫలితమే. 33 రకాల సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 77 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వీటిలోనూ కేవలం ఐదు బ్యాక్టీరియాల వల్ల సగానికి పైగా మరణాలు సంభవించాయి’’ అని అధ్యయనం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాక్టీరియాలను అదుపు చేయడం తక్షణావసరమని హెచ్చరించింది. ‘‘పటిష్టమైన ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల నిర్మాణం, మెరుగైన అదుపు చర్యలు, యాంటీబయాటిక్‌ల వాడకాన్ని గరిష్ట స్థాయికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని వాషింగ్టన్ వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ డైరెక్టర్, అధ్యయన కర్త క్రిస్టోఫర్ ముర్రే సూచించారు. చాలా ఇన్ఫెక్షన్లు తదితరాలకు మనకిప్పటిదాకా కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు గణాంకాలతో పాటు 3.43 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించారు. ‘‘2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 1.37 కోట్ల ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాల్లో సగానికి పైగా బ్యాక్టీరియానే కారణం. 77 లక్షల బ్యాక్టీరియా సంబంధిత మరణాల్లో మూడొంతులకు పైగా శ్వాస, రక్త, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లే. బ్యాక్టీరియాల్లో ఒక్క ఎస్.ఏరియస్ రకమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.1 కోట్ల మరణాలకు కారణమైంది. వయసుపరంగా కూడా 15 ఏళ్ల పై బడ్డ వారిలో అత్యధికంగా 9.4 లక్షల మందిని ఇది బలి తీసుకుంది’’ అని పరిశోధకులు తేల్చారు. సహారా ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 230 మంది బ్యాక్టీరియాకు బలైనట్టు వివరించారు. అదే పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న ప్రాంతాల్లో ఈ సంఖ్య అత్యల్పంగా ప్రతి లక్ష మందికి 52గా ఉందని చెప్పారు. ఇదీ చదవండి: Bruce Lee Death Reason: ఓవర్‌గా వాటర్ తాగితే.. బ్రూస్లీలా మరణం ఖాయమంటున్న పరిశోధకులు! -
భారత్‌లో 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం.. మేల్కోపోతే వినాశనమే!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతోనూ చాలా దేశాల్లో తిండి దొరకని పరిస్థితులు తెలెత్తాయి. అయితే, అంతుకు మించిన విపత్తు మనకు తెలియకుండానే ప్రాణాలను హరిస్తోంది. మనం చేసుకుంటున్న కర్మకు ఫలితేమేనంటూ శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూతాపం(గ్లోబల్ వార్మింగ్) పెరిగిపోయి.. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ పెరిగి.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఓ పరిశోధన. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఒక్క భారత్‌లోనే 2 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని తాజాగా నివేదిక ‘ద లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’ హెచ్చరించింది. ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ వంటి 50 సంస్థలకు చెందిన 99 మంది నిపుణులు రూపొందించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు సూచించారు. శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తూ.. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. ఆహార భద్రత, అంటు వ్యాధుల వ్యాప్తి, ఉష్ణోగ్రత వల్ల కలిగే వ్యాధులు, విద్యుత్తు సంక్షోభం, గాలి కాలుష్యం వల్ల మరణాలు వంటివి పెరిగిపోయి మహా విపత్తు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు చేపట్టకపోతే జరిగేది వినాశనమేనని హెచ్చరించారు. ► శిలాజ ఇంధనాల వాడకంతో ఏర్పడే కాలుష్యం కారణంగా భారత్‌లో గత ఏడాది 2020లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక వెల్లడించింది. అది ప్రతి 2 నిమిషాలకు 1.2 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనాలో 3,80,000 మరణాలు సంభవించగా, ఐరోపాలో 1,17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 32 వేల మంది మరణించారు. ► ప్రస్తుతం ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న తీరుతో ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్ పెరగనుంది. ప్రస్తుతం 1.1 డిగ్రీ సెల్సియస్ పెరిగినందుకే వడగాలులు, వరదలు, తుపాన్లతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. మరి ఆ స్థాయి ఉష్ణోగ్రతకు చేరుకుంటే పరిస్థితి దారుణంగా ఉండనుంది. ► వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని నివేదిక వెల్లడించింది. శిలాజ ఇంధానలను వాడటం వల్ల గ్రీన్‌హౌజ్ గ్యాస్ గాల్లో కలిసి ప్రాణాలను హరించివేస్తోందని పేర్కొంది. గాలి కాలుష్యం కారణంగా శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటున్నట్లు స్పష్టం చేసింది. గాలి నాణ్యత పీఎం 2.5గా ఉన్న అమెరికాలోనే గత ఏడాది 32వేల మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. ► ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు శిలాజ ఇంధనాలకు రాయితీలు ఇస్తున్నాయి. అందులో కొన్ని దేశాల్లో ఆరోగ్య రంగానికి మించి శిలాజ ఇంధానల కోసం ఖర్చు చేస్తున్నాయి. 2019లో 69 దేశాలు 400 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. భారత్ 43 బిలియన్ డాలర్లు, చైనా 35 బిలియన్ డాలర్లు, ఐరోపాలోని 15 దేశాలు ఒక్కో దేశానికి ఒక్కో బిలియన్ డాలర్ల చొప్పును రాయితీలు కల్పిస్తున్నాయి. అమెరికా 20 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. దీంతో శిలాజ ఇంధనాల వాడకం పెరిగిపోతోంది. దీంతో కాలుష్యం పెరగటం, పర్యావరణ మార్పులు చోటు చేసుకుని వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
Corona Alert: దేశంలో 45 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్‌తో దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 పాజిటవ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఇక, దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,87,606 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,25,020 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. ఇక దేశంలో 1,97,11,91,329 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇక, ఆదివారం 11,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సోమవారానికి కేసుల సంఖ్య ఒక్కసారిగా 17వేల మార్కును దాటింది. దీంతో, పాజిటివ్ కేసుల సంఖ్య 45 శాతం పెరిగింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య 17వేలు దాటడం జూన్ 24న, మళ్లీ సోమవారమే(జూన్ 27) చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 6493 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 1891 కేసులు నమోదయ్యాయి. India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7 — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: దావత్‌లు ఇవ్వరు.. డీజే, బారాత్‌లు బంద్.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు అక్కడ!! -
దేశంలో కరోనా మరణాలు.. హాట్ టాపిక్‌గా రాహుల్ గాంధీ కామెంట్స్
దేశంలో కోవిడ్ మరణాలపై ఆందోళన నెలకొంది. తాజగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా జనవరి 2020-2021 డిసెంబర్ చివరకు ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనను భారత్ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో దేశంలో కరోనా మరణాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మరణాలపై శుక్రవారం రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కోవిడ్ మహమ్మారి కారణంగా 47 లక్షల మంది భారతీయులు మరణించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు 4.8 లక్షలు కాదు. సైన్స్ అబద్ధం చెప్పుదు.. కానీ మోదీ చెబుతారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గౌరవించండి. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల పరిహారం ఇవ్వాలి’’ అని అన్నారు. అంతకు ముందు కూడా రాహుల్ గాంధీ.. కరోనా కారణంగా దేశంలో 40 లక్షల మంది భారతీయులు చనిపోయారని ఆరోపించారు. 47 lakh Indians died due to the Covid pandemic. NOT 4.8 lakh as claimed by the Govt. Science doesn't LIE. Modi does. Respect families who've lost loved ones. Support them with the mandated ₹4 lakh compensation. pic.twitter.com/p9y1VdVFsA — Rahul Gandhi (@RahulGandhi) May 6, 2022 ఇది కూడా చదవండి: సీఎంను చంపేస్తానంటూ బహిరంగంగా వార్నింగ్.. బీజేపీ కీలక నేత అరెస్ట్ -
దేశం లో భారీగా తగ్గిన కరోనా మరణాలు
-
Covid Deaths: కరోనా మరణాల్లో తగ్గుదల ఎప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా.. రోజువారీ మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించట్లేదు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత మే నెలలో ఇప్పటివరకు 25 రోజుల్లో 13 రోజులు... 4వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 4,157 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో వరుసగా గత పది రోజులుగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలలోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2,08,714 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది. గత 24 గంటల్లో 4,157 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,11,388కు పెరిగింది. వరుసగా 13వరోజూ కొత్త కరోనా కేసుల సంఖ్య కంటే కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.42 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 2,95,955 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,43,50,816కు పెరిగింది. దీంతో రికవరీ రేటు 89.66 శాతానికి పెరగడం విశేషం. మరణాల రేటు 1.15 శాతంగా నమోదైంది. ఐసీఎంఆర్ తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 33,48,11,496 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో మంగళవారం 22,17,320 శాంపిళ్లను పరీక్షించారు. ఒక్కరోజులో ఇంతటి భారీస్థాయిలో టెస్ట్‌లు చేయడం ఇదే ప్రథమం. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 9.42%కి చేరింది. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇచ్చిన వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య 20 కోట్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు మొత్తం 20,06,62,456 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. అందులో మంగళవారం ఒక్కరోజే 20,39,087 డోస్‌లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 22,00,59,880 కోవిడ్ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసింది. ఇందులో వృథానూ కలుపుకుని రాష్ట్రాలు, యూటీలు మొత్తంగా 20,13,74,636 డోస్‌లను వినియోగించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1,77,52,594 డోసులు అందుబాటులో ఉన్నాయి. మరో లక్ష వ్యాక్సిన్ డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపనుంది. మేలో 4వేలకుపైగా మరణాలు నమోదైన తేదీలు తేదీ మరణాలు మే 7 4,233 మే 8 4,092 మే 11 4,198 మే 12 4,128 మే 13 4,000 మే 15 4,077 మే 16 4,098 మే 17 4,334 మే 18 4,339 మే 20 4,209 మే 21 4,194 మే 23 4,454 మే 25 4,159 -
'రెడ్ కారిడార్' టెర్రర్
న్యూఢిల్లీ: 2016లో భారతదేశంలో జరిగిన దాడుల్లో సగం మరణాలు మావోయిస్టుల హింస వల్లే చోటుచేసుకున్నాయని సిడ్నీకి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ హత్యలన్నీ రెడ్ కారిడార్‌గా పిలిచే ఈశాన్య, మధ్య, దక్షిణ భారతదేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే జరిగాయని పేర్కొంది. 2016లో భారత్‌లో మొత్తం 929 దాడులు జరిగాయని, 340 మంది ప్రాణాలు కోల్పోయారని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఐదో గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్(జీటీఐ) నివేదికలో తెలిపింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఉగ్ర హింస తగ్గుముఖం పడుతున్నా 2016లో 18 శాతం పెరుగుదల నమోదైందని, మృతుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేసింది. గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్ నివేదిక ఉగ్ర హింసలో ఇరాక్, అఫ్గానిస్తాన్, నైజీరియా, సిరియా, పాకిస్తాన్, యెమెన్, సోమాలియా, భారత్‌లు మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. 2002 నుంచి భారత్‌లో హింస తగ్గుముఖం పట్టినా 2015తో పోలిస్తే మాత్రం 2016లో దాడులు 16 శాతం పెరగడం గమనార్హం. 2015లో మొత్తం 800 దాడులు చోటుచేసుకోగా 2016లో ఆ సంఖ్య 929కి పెరిగింది. 2015తో పోలిస్తే భారతదేశంలో ఈ దాడుల్లో మరణించినవారి సంఖ్య 18 శాతం పెరిగి 340కి చేరింది. ఇందులో సగం మంది మావోల హింసలో ప్రాణాలు కోల్పోగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హింసలో 30 మంది మరణించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఐదుగురిని బలితీసుకుంది. జాబితాలోని మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలతో పోలిస్తే ఒక్కో దాడిలో మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉంది. భారత్‌లో సగటున ఒక్కో దాడిలో 0.4 మరణాలు చోటుచేసుకోగా మిగతా తొమ్మిది దేశాల్లో అది 2.7గా ఉంది. భారత్‌లో సగానికి పైగా దాడులు పోలీసులు, ప్రైవేటు వ్యక్తులే లక్ష్యంగా జరిగాయి. భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులు ఎక్కువ శాతం ప్రమాదకరం కానివని నివేదిక వెల్లడించింది. ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు కొన్ని గ్రూపులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయిని, ఇలాంటి దాడులు ఎక్కువగా మావోయిస్టులే చేస్తున్నారని పేర్కొంది. భారత్‌లో హింసకు పాల్పడుతున్న గ్రూపుల్లో ఎక్కువ శాతం రాజకీయ గుర్తింపు కోరుకుంటున్నాయని, అందువల్లే ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా అవి దాడులకు పాల్పడున్నట్లు నిర్ధారించారు. నిజానికి 2016లో భారత్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మూడొంతుల ప్రమాదకరంగా కానివే.. కేవలం 2 శాతం దాడుల్లో మాత్రమే రెండు కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. దేశంలోని మొత్తం 56 గ్రూపుల్లో 20 మాత్రమే ప్రాణహానికి పాల్పడ్డాయని జీటీఐ నివేదిక పేర్కొంది. ఇక ఈశాన్య భారతదేశంలోని తీవ్రవాద గ్రూపుల్లో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ప్రమాదకరమని, 2016లో ఆ ఉగ్రసంస్థ 15 మందిని పొట్టనపెట్టుకుందని, అల్ఫా ఏడుగురుని హత్య చేసిందని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ వెల్లడించింది. ఇక జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్‌తో ఉన్న వివాదమే భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయంగా నిషేధం ఉన్నా అవి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించింది. ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని నివేదికలో వెల్లడించారు. -
భారత్‌లో 40 మంది మృతి
ఉత్తరభారతం, ఈశాన్య భారతాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 40 మంది మరణించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్.సి. గోయల్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. - భూప్రకంపనల వల్ల బీహార్‌లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. ఇప్పటి వరకు బీహార్ లో 20 మందికి పైగా మరణించినట్టు, వందల మంది గాయపడినట్లు సమాచారం - మాల్దాలో ఒక స్కూలు భవనం కుప్పకూలడంతో 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. - భూకంప తీవ్రతకు యూపీలో ఆరుగురు బలయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉండటం శోచనీయం. కాన్పూర్‌లోని ఓ స్కూలు భవనం కూలడంతో ఆ చిన్నారి మృతిచెందింది. రాష్ట్రవ్యాప్తంగా వందల మంది గాయపడ్డారు. - ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లో ముగ్గురు మృతిచెందగా, దాదాపు 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. - నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో ఓ భవనం కూలడంతో ఉద్యోగి కుమార్తె ఒకరు మరణించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పారు. - బీహార్ కు 5, యూపీకి 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఓపీ సింగ్ తెలిపారు. - మధ్యప్రదేశ్ లోని భోపాల్, గ్వాలియర్, మండల్, హోషంగాబాద్, సిద్ధి జిల్లాలో భూకంపం తీవ్ర ప్రభావాన్నిచూపింది. - భూకంప కేంద్రమైన నేపాల్ కు సమీపంగా ఉండటంతో ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. - భూకంప తీవ్రత వల్ల మంచుచరియలు విరిగిపడటంతో ఎవరెస్టు యాత్రకు వెళ్లిన 13 మంది మృతిచెందారు. - స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎవరెస్టు పై చెత్త తొలిగించేందుకు వెళ్లిన భారత సైనికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మన సైనికులు ఒక ప్రాంతం నుంచి పక్కకు వెళ్లగానే అక్కడ భారీ ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడ్డాయని, ప్రస్తుతం సైనికులందరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.