debarred
-
టెన్త్ పేపర్ లీక్ కేసు.. డిబార్ అయిన విద్యార్థికి ఊరట
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ ఆరోపణలతో డిబార్ అయిన టెన్త్ విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది కాగా హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీక్ చేసిన ఆరోపణలతో అధికారులు హరీష్‌ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని తెలిపారు. కమలాపూర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్లో కూడా హరీష్ పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమంతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని ఆరోపిస్తూ.. హరీష్‌ను టెన్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విద్యార్థిని మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించింది. చదవండి: టెన్త్ పేపర్ లీక్ కేసు.. ఎగ్జామ్ సెంటర్లో జరిగింది ఇదేనా..? -
రేపిస్టులకు సంక్షేమ పథకాలు కట్..!
చండీగఢ్ : హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో నిందితులకు సంక్షేమ పథకాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం వారికి రేషన్ మినహా మిగత ప్రభుత్వ పథకాలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గురువారం వెల్లడించారు. అందులో భాగంగా వారి వృద్ధాప్య ఫింఛన్, వికలాంగ ఫింఛన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుధ లైసెన్స్‌లను తొలుత తాత్కాలికంగా రద్దు చేస్తారు. ఒకవేళ కోర్టులో వారు దోషిగా తెలితే వాటిపై పూర్తి నిషేధం విధిస్తారు. కాగా రేషన్ మాత్రం యథాతదంగా కొనసాగుతోంది. ఇంకా ఖట్టర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత కోసం ఓ సమగ్ర పథకాన్ని ఆగస్టు 15న గానీ, రక్షా బంధన్(ఆగస్టు 26)న గానీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అత్యాచార బాధితులు తమ తరపున ఇష్టమైన లాయర్‌ను నియమించుకునేందుకు వారికి 22,000 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. అత్యాచార, ఈవ్‌టీజింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారిచేయనున్నట్టు తెలిపారు. అత్యాచారం కేసు విచారణ నెల రోజుల్లో, ఈవ్‌టీజింగ్ కేసు విచారణ 15 రోజుల్లో పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో 6 పాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. -
ఒకే రోజు తొమ్మిది మంది డిబార్
► l8 మంది ఇన్విజిలేటర్ల తొలగింపు చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన గణితం –2 పరీక్షలో ఒకే రోజు తొమ్మిది మంది విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. వారికి సహకరించిన 8 మంది టీచర్లను పరీక్ష విధుల నుంచి తొలగించారు. గుర్రంకొండలోని బాలుర జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో చూసి రాస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇన్ చార్జీ డీఈవో శామ్యూల్ డిబార్ చేశారు. అక్కడ సహకరించిన సుబ్బరాయుడు (ఎంపీపీఎస్, తరిగొండ), రెడ్డెప్ప (ఎంపీపీఎస్, సరిమడుగు)ను పరీక్షల విధుల నుంచి తొలగించారు. అలాగే పెద్దమండ్యంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రెడ్డిబాషా (ఎస్జీటీ, కనుములోపల్లి)ను తొలగించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు రేణిగుంట జెడ్పీ బాలికల పరీక్ష కేంద్రంలో జవాబుపత్రాలను మార్చుకుని పరీక్షలు రాస్తున్న ఇద్దరు విద్యార్థులను కనిపెట్టి డిబార్ చేశారు. నిర్లక్ష్యంగా వి«ధులు నిర్వహించిన నరసింహులు (ఎంపీపీఎస్, మామండూరు)ను తొలగించారు. చిత్తూరులోని ఇండియన్ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థిని డీబార్ చేశారు. మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సహించిన ఇన్విజిలేటర్ గిరిధర్‌నాయుడు (ఎంపీపీఎస్, కాళేపల్లె) అనే టీచర్‌ను విధుల నుంచి తొలగించారు. పాకాలలోని ఇన్ఫాంట్‌జీసెస్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులురెడ్డి (ఎస్జీటీ, చెన్నమ్మగారిపల్లె)ని విధుల నుంచి తొలగించారు. చంద్రగిరిలోని జెడ్పీ బాలికల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న టీచర్‌ను తొలగించారు. పుత్తూరులోని జ్ఞానజ్యోతి పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డీబార్ కాగా, అక్కడ పనిచేస్తున్న రేవతి (స్కూల్ అసిస్టెంట్ సోషల్, నారాయణవనం)ను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించారు. 292 మంది గైర్హాజరు శుక్రవారం జరిగిన గణితం–2 పేపర్ పరీక్షకు జిల్లా వ్యాప్తం గా 51,912 మంది హాజరుకావాల్సి ఉండగా 51,620 మంది పరీక్షలు రాశారు. 292 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇన్ చార్జి డీఈవో శామ్యూల్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 103 పరీక్షకేంద్రాలను తనిఖీ చేయగా, ఇన్ చార్జి డీఈవో 5, అబ్జర్వర్ 7 కేంద్రాలను తనిఖీ చేశారు. -
వాచీ లాంటి ఫోన్ తో హైటెక్ కాపీయింగ్
కదిరి : చేతి గడియారం రూపంలో ఉన్న సెల్‌ఫోన్‌తో హైటెక్ కాపీయింగ్‌కు పాలపడుతున్న ఓ విద్యార్థి ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు. వివరాల ప్రకారం...అనంతపురం జిల్లా ఓడిచెరువు మండలం గౌనిపల్లికి చెందిన ఇలియాజ్ అనే విద్యార్థి కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం మొదటి సంవత్సరం పరీక్షలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ శ్రావణ్‌కు దొరికిపోయాడు. పరీక్ష సమయంలో విద్యార్థి తన ఎడమ చేతికి పెట్టుకున్న రిస్ట్‌వాచ్ వైపు పదే పదే చూస్తూ పరీక్ష రాస్తుండటంతో గమనించిన ఇన్విజిలేటర్ అనుమానంతో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సెల్‌ఫోన్ విభాగాలన్నీ ఆ రిస్ట్వాచ్కు అమర్చి ఉన్నాయి. 20ప్రశ్నలకు సమాధానాలు అందులో మెసేజ్‌ల రూపంలో ఉన్నాయి. వెంటనే ఇన్విజిలేటర్ అతన్ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మిరెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ విద్యార్థి తాను హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతున్న విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంటి దగ్గర ఉన్న తన సెల్ఫోన్లో సమాధానాలన్నీ ఫీడ్ చేసి.. చేతి గడియారం రూపంలో ఉన్న ఈ సెల్‌కు అన్నీ సెండ్ చేశానని, ఇందులో ఒక మెసేజ్‌ను డిలీట్ చేయగానే, అందులోని ఇంకో మెసేజ్(సమాధానం) వచ్చి చేరుతుందని అతను ప్రాక్టికల్‌గా చూపాడు. దీంతో ఆ విద్యార్థిని డిబార్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు. -
విద్యార్థుల కేరింత
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం ముగిశాయి. విద్యాసంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంలో ఎగిరి గంతేశారు. ఉత్తమ ఫలితాల సాధనకు శ్రమించి చదివిన వారంతా పరీక్షా కేంద్రాల నుంచి ఉత్సాహంగా బయటకు అడుగుపెట్టారు. పరీక్షా కేంద్రాల్లో పరిచయమైన మిత్రులకు వీడ్కోలు పలికారు. బస్సుల్లో ఎక్కి కేరింతలు కొడుతూ, కాగితాలు చించి రోడ్లపై చల్లుతూ విజయ చిహ్నం చూపుతూ సందడి చేశారు. చివరి రోజు ఒక విద్యార్థి డిబార్.. పరీక్షల చివరి రోజు జిల్లాలో ఒక మాల్ ప్రాక్టీసు కేసు నమోదయింది. వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒకేషనల్ పరీక్ష రాస్తూ అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్డడ్డాడు. గుర్తించిన అధికారులు అతడిని డిబార్ చేశారు. ఈనెల 12న ప్రారంభమైన ప్రథమ సంవత్సర పరీక్షల్లో మొత్తం 16 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడి డిబార్ అయ్యారు. ఈనెల 18న ఏడుగురు, 20న మరో ఏడుగురు, 22న ఒకరు, మంగళవారం మరొకరు డిబారయ్యారు.