ఒకే రోజు తొమ్మిది మంది డిబార్‌ | nine students debarred in tenth exam | Sakshi
Sakshi News home page

ఒకే రోజు తొమ్మిది మంది డిబార్‌

Published Sat, Mar 25 2017 11:31 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

nine students debarred in tenth exam

 
► l8 మంది ఇన్విజిలేటర్ల తొలగింపు 
 
చిత్తూరు:  జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన గణితం –2 పరీక్షలో ఒకే రోజు తొమ్మిది మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. వారికి సహకరించిన 8 మంది టీచర్లను పరీక్ష విధుల నుంచి తొలగించారు. గుర్రంకొండలోని బాలుర జెడ్పీ హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో చూసి రాస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇన్ చార్జీ డీఈవో శామ్యూల్‌ డిబార్‌ చేశారు.

అక్కడ సహకరించిన సుబ్బరాయుడు (ఎంపీపీఎస్, తరిగొండ), రెడ్డెప్ప (ఎంపీపీఎస్, సరిమడుగు)ను పరీక్షల విధుల నుంచి తొలగించారు. అలాగే పెద్దమండ్యంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి  డిబార్‌ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రెడ్డిబాషా (ఎస్‌జీటీ, కనుములోపల్లి)ను తొలగించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు రేణిగుంట జెడ్పీ బాలికల పరీక్ష కేంద్రంలో జవాబుపత్రాలను మార్చుకుని పరీక్షలు రాస్తున్న ఇద్దరు విద్యార్థులను కనిపెట్టి డిబార్‌ చేశారు. నిర్లక్ష్యంగా వి«ధులు నిర్వహించిన నరసింహులు (ఎంపీపీఎస్, మామండూరు)ను తొలగించారు.

చిత్తూరులోని ఇండియన్‌ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థిని డీబార్‌ చేశారు. మాస్‌కాపీయింగ్‌కు ప్రోత్సహించిన ఇన్విజిలేటర్‌ గిరిధర్‌నాయుడు (ఎంపీపీఎస్, కాళేపల్లె) అనే టీచర్‌ను విధుల నుంచి తొలగించారు. పాకాలలోని ఇన్ఫాం‌ట్‌జీసెస్‌ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్‌ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులురెడ్డి (ఎస్‌జీటీ, చెన్నమ్మగారిపల్లె)ని విధుల నుంచి తొలగించారు. చంద్రగిరిలోని జెడ్పీ బాలికల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డిబార్‌ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న టీచర్‌ను తొలగించారు. పుత్తూరులోని జ్ఞానజ్యోతి పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి డీబార్‌ కాగా, అక్కడ పనిచేస్తున్న రేవతి (స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్, నారాయణవనం)ను ఇన్విజిలేషన్‌ విధుల నుంచి తొలగించారు. 
 
 
292 మంది గైర్హాజరు
 
శుక్రవారం జరిగిన గణితం–2 పేపర్‌ పరీక్షకు జిల్లా వ్యాప్తం గా 51,912 మంది హాజరుకావాల్సి ఉండగా 51,620 మంది పరీక్షలు రాశారు.  292 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇన్‌ చార్జి డీఈవో శామ్యూల్‌ తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు 103 పరీక్షకేంద్రాలను తనిఖీ చేయగా, ఇన్‌ చార్జి డీఈవో 5, అబ్జర్వర్‌ 7 కేంద్రాలను తనిఖీ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement