నాదెళ్ల తొలిపుస్తకానికి ముహుర్తం ఖరారు
న్యూఢిల్లీ : మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల తొలిపుస్తకానికి ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది(2017) నుంచి అన్ని స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మార్పు అనే కాన్సెప్ట్ తో నాదెళ్ల రాసిన హిట్ రీఫ్రెష్ అనే బుక్ ను మూడు స్టోరీ లైన్లను ప్రతిబింబిస్తూ మార్కెట్లోకి రాబోతుంది. ఎలా విజయం సాధించాలి, లేదా నాదెళ్లకు ఓ జ్ఞాపకంలా ఈ బుక్ ను మార్కెట్లోకి రావడం లేదని, పూర్తిగా మార్పుకు సంబంధించే నాదెళ్ల ఈ బుక్ ను రచించినట్టు తెలుస్తోంది. నాదెళ్ల వ్యక్తిగత జీవిత ప్రయాణంలోని పరిణామాలు, సాంకేతిక సంస్థల మధ్య నేడు నెలకొంటున్న మార్పు, మన జీవనంలో ఇంటెలిజెన్స్ మిషన్స్ తీసుకొస్తున్న మార్పు లను నాదెళ్ల ఈ బుక్ వివరించబోతున్నారని పబ్లిషర్ హార్పెర్ బిజినెస్ చెప్పింది.
సత్య నాదెళ్ల తొలి పుస్తకానికి హార్పెర్ కొల్లిన్స్ పబ్లిషర్ ప్రపంచ ఇంగ్లిష్ ప్రింటింగ్ హక్కులను దక్కించుకుంది. లెవిన్ గ్రీన్బెర్గ్ రోస్టన్ లిటరరీ ఏజెన్సీ జేమ్స్ లెవిన్ తో ఒప్పంద చర్చలు జరిగాయని హార్పెర్ బిజినెస్ ల వైస్ ప్రెసిడెంట్, ప్రచురణ కర్త హోల్లియిస్ హేమ్ బౌచ్ తెలిపారు. 2017లో దీన్ని పబ్లిష్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలు, ఆర్గనైజేషన్స్, సొసైటీల్లో ఎలా మార్పులు సంభవిస్తున్నాయో అన్వేషిస్తూ హిట్ రీఫ్రెష్ ను నాదెళ్ల రచించారు. న్యూ ఎనర్జీ, న్యూ ఐడియాలు, రిలవెన్స్ లను నిరంతర తపనగా హిట్ రీఫ్రెష్ బుక్ ద్వారా నాదెళ్ల మనకు తెలియజేయబోతున్నారు. ఈ బుక్ అంతా మార్పు అనే అంశంపైనే ఉంటుందని నాదెళ్ల పేర్కొన్నారు. ఈ బుక్ ను మైక్రోసాప్ట్ టీమ్ మెంబర్లకు, కస్టమర్లకు, పార్టనర్లను ఉద్దేశించి రచించానని, మార్పుకు సంబంధించిన స్టోరీలు కచ్చితంగా వీరికి ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నట్టు, వారి సొంత బాటలో నడవడానికి మార్గ నిర్దేశం చేస్తుందని తెలిపారు.