రైలు నుంచి జారిపడి ఒకరి మృతి
మెదక్: ప్రమాదవశాత్తు రైలు బోగీ నుంచి కిందపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మాసాయిపేట రైల్వేస్టేషన్లో జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు ఎం.వెంకటేశ్వర్లు(26) దక్కన్ ఎక్స్ప్రెస్లో బయల్దేరారు. రైలు బుధవారం తెల్లవారుజామున 05:30 గంటలకు స్టేషన్ మాసాయిపేటకు రాగానే ప్రమాదవశాత్తు రైల్వే పట్టాలపై పడటంతో మృతిచెందినట్లు కామారెడ్డి రైల్వే పోలీస్ పాండు తెలిపారు.
మృతుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం సాయిపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మృతుని వద్ద దొరికిన సెల్ఫోన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు.