decreases
-
ఎగిరెగిరి పడ్డ టమాటా.. ఇప్పుడు ఢీలా!
సాక్షి, కర్నూలు జిల్లా: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావం రాష్ట్రంలో టమాటా ధరలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మార్కెట్లకు టమాటా చేరడం లేదు. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా రూ. 4 నుంచి 10 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ప్యాపిలి మార్కెట్లోనూ టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా రూ.3 మాత్రమే పలుకుతోంది. ధరలు లేకపోవడంతో టమాటాలను రైతులు మార్కెట్‌కు ఆరుబయటే పారేసి వెళ్లిపోతున్నారు. పచ్చి పంట కావడంతో ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాలను రోడ్లపైనే పారబోస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీస ధర లేకపోవడంతో డోన్ జాతీయ రహదారిపైనే టమాటాలను ఓ రైతు పారబోశాడు. పారబోసిన టమాటాలను పశువులు తింటున్నాయి. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చి పంట అయినందున ఎక్కడా దాచలేమని రైతులు దిగులు పడుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 200 వరకు పలికిన కిలో టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఎన్నో ఆశలతో ఉన్న టమాటా రైతులు.. వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఎగిరెగిరి పడ్డ టమాటా ఇప్పుడిలా ఉల్టా కావడం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఇదీ చదవండి: అలా.. ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు అవకాశాలు -
ఆ వైరస్‌తో మనకు మేలే!
వయసుతో పాటు మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతూంటుంది. వృద్ధులకు వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు టక్కున వచ్చేందుకు కారణం ఇదే. ఈ సమస్యను అధిగమించేందుకు అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఓ విచిత్రమైన ఫలితాలిచ్చాయి. వ్యాధులకు కారణమవుతాయని మనం ఇప్పటివరకూ భయపడుతూన్న వైరస్‌లలోనే ఒకటి మన రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయగలదని వీరు గుర్తించారు. సైటో మెగలో వైరస్ అని పిలుస్తున్న ఈ వైరస్ సగం మంది మనుషులకు చిన్నప్పుడే సోకుతుంది. చికిత్స ఏదీ లేకపోవడం వల్ల పెద్దవాళ్లలోనూ కనిపిస్తూంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి ఈ వైరస్‌తో పోరాడుతూ ఉంటుందని, ఫలితంగా ఇతర వైరస్‌లకు త్వరగా లొంగిపోతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే సైటో మెగలో వైరస్‌ను ఎలుకలకు ఎక్కించి, అదే సమయంలో లిస్టీరియా వైరస్‌ను చేర్చినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ మరింత సమర్థంగా లిస్టీరియాను ఎదుర్కొందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ స్మితీ తెలిపారు. మరిన్ని పరిశోధనలు చేసి∙చూడగా, సైటో మెగలో వైరస్ రోగ నిరోధక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. -
పడిపోయిన కార్ల రీసేల్ వాల్యూ
-
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుంది. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 4.5 డిగ్రీలు నమోదు అయింది. దీంతో ఏజెన్సీలోని ఉట్నూరు ప్రజలు చలికి వణుకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో దుప్పట్లు లేక చలి తీవ్రతకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామగుండం 11, నిజామాబాద్ 13, మెదక్ 13 డిగ్రీలు, ఖమ్మం 15, హైదరాబాద్ 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మరింత లోతుల్లోకి పాతాళ గంగ
* రాష్ట్రంలో 13.17 మీటర్లకు దిగజారిన భూగర్భ జలాలు * మెదక్ జిల్లాలో 22.59 మీటర్లు * నిజామాబాద్ జిల్లాలో 17.78 మీటర్లకు * రబీలో 76 శాతం లోటు వర్షపాతం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. గత ఖరీఫ్ మొదలు రబీ వరకు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. 2014 డిసెంబర్లో రాష్ట్రంలో 10.24 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు ఉండగా, 2015 డిసెంబర్లో 13.17 మీటర్ల లోతుల్లోకి అడుగంటాయి. ఏకంగా 2.93 మీటర్ల అదనపు లోతుల్లోకి దిగజారాయి. బోర్లు వట్టిపోయాయి. బావులు ఎండిపోయాయి. ఫలితంగా తాగునీటి సమస్య ఏర్పడింది. మెదక్ జిల్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆ జిల్లాలో 2014 డిసెంబర్లో 15.84 మీటర్ల లోతులో నీరు లభిస్తే, గత నెలలో ఏకంగా 22.59 మీటర్లకు అడుగంటింది. ఏకంగా 6.75 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 2014 డిసెంబర్లో 11.06 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2015 డిసెంబర్లో 17.78 మీటర్లకు పడిపోయింది. ఏకంగా 6.72 మీటర్ల అదనపు లోతుల్లోకి జలాలు దిగజారిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 3.89 మీటర్ల అదనపు లోతుల్లోకి అడుగంటాయి. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ ఏడాది కాలంగా భూగర్భ జలం పైకి రాకపోగా, ఇంకా అదనపు లోతుల్లోకి పడిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు ప్రజలనూ, ఇటు అధికారులనూ పట్టిపీడిస్తోంది. అంతేకాదు 2015 నవంబర్‌లో రాష్ట్రంలో 12.39 మీటర్ల లోతుల్లో పాతాళ గంగ లభిస్తే, ఒక్క నెల రోజుల్లోనే 13.17 మీటర్ల లోతుల్లోకి పడిపోయింది. రబీ సీజన్లో సాధారణంగా ఇప్పటివరకు 133 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 32 మీటర్లే నమోదై 76 శాతం లోటు కనిపిస్తోంది. 9 శాతానికి మించని వరినాట్లు రబీలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సాగు 35 శాతానికి మించలేదు. అందులో వరి నాట్లు 9 శాతానికి మించలేదు. రబీలో సహజంగా 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 11.10 లక్షల ఎకరాల్లోనే (35%) సాగు జరిగింది. అందులో వరి సాధారణంగా 16.12 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు లక్షన్నర ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఒక్క పప్పుధాన్యాల సాగు మాత్రమే 95 శాతం జరిగింది. సాధారణంగా 3.45 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 3.27 లక్షల ఎకరాల్లో జరిగింది. వరి నాట్లు అత్యంత దారుణంగా పడిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని వ్యవసాయశాఖ చెబుతోంది. ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తోంది. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 5 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, చింతపల్లి, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
తగ్గుముఖం పడుతున్న వరద నీరు
-
రూ.520 తగ్గిన బంగారం ధర