తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుంది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుంది. ఆదిలాబాద్లో కనిష్టంగా 4.5 డిగ్రీలు నమోదు అయింది. దీంతో ఏజెన్సీలోని ఉట్నూరు ప్రజలు చలికి వణుకుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో దుప్పట్లు లేక చలి తీవ్రతకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామగుండం 11, నిజామాబాద్ 13, మెదక్ 13 డిగ్రీలు, ఖమ్మం 15, హైదరాబాద్ 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.