deficite budget
-
ద్రవ్యలోటు 12.3 శాతానికి అప్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు మే నెలనాటికి ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో 12.3 శాతానికి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ద్రవ్యలోటు లక్ష్యం రూ.16,61,196 కోట్లు. స్థూల దేశీయోత్పత్తి అంచనాలతో పోల్చితే ఇది 6.4 శాతం. అయితే మే ముగిసే నాటికి ద్రవ్యలోటు విలువ రూ.2,03,921 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు లక్ష్యంలో 8.2 శాతం వద్దే ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ వ్యయాల పెరుగుదలతో ద్రవ్యలోటు లక్ష్యంలో 12.3 శాతానికి పెరిగినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.3.81 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం అంచనాల్లో వసూళ్లు 16.7 శాతానికి చేరాయి. ►ఇక వ్యయాలు ఇదే కాలంలో రూ.5.85 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం అంచనాల్లో ఇది 14.8 శాతానికి చేరాయి. ► వెరసి ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు. అంటే ద్రవ్యలోటు 2.3 లక్షల కోట్లన్నమాట. ► పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. పెట్రో డీజిల్ ధరల తగ్గింపు వల్ల కేంద్రం ఏడాదికి రూ. లక్ష కోట్లు కోల్పోతుందని అంచనా. ► ఆహార, ఎరువులు సబ్సిడీలు, ఆర్బీఐ నుంచి భారీ డివిడెండ్ రాకపోవడం వంటి అంశాలు ద్రవ్యలోటును లక్ష్యానికి పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
రాష్ట్రాలకు పీడీఆర్డీ నిధులను విడుదల చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పదిహేడు రాష్ట్రాలకు చెందిన నాలుగో విడత పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు రూ .9,871 కోట్లను గురువారం రోజున విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను అర్హత గల రాష్ట్రాలకు మొత్తం 39,484 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు మంజూరు చేయబడుతుంది. 15 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలో అంతరాన్ని భర్తీ చేయడానికి ఈ గ్రాంట్లను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. 2021-22 మధ్య కాలంలో 17 రాష్ట్రాలకు పీడీఆర్డీ గ్రాంట్లను ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ .1,18,452 కోట్ల పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇప్పటివరకు రూ .39,484 కోట్లు (33.33 శాతం) నాలుగు విడతలుగా విడుదలయ్యాయి. ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
మోదీ సర్కార్ ముందు ఆర్థిక ఉచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ :అఖండ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసరంగా దేశ ఆర్థిక పరిస్థితిపై దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఏర్పడిందని దేశ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2019 జనవరి నుంచి మార్చి వరకు మొదటి త్రైమాసంలో దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 5.8కి పడిపోవడం ఆందోళనకరమని, గత ఐదేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయికి జీడీపీ రేటు పడిపోలేదని వారంటున్నారు. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగ శాతం 6.1 శాతానికి చేరుకుందని, ఇది గత 45 ఏళ్లలో ఇదే గరిష్టమని ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన పీరియాడికల్ సర్వే తేలిందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పుండు మీద కారం చల్లిన చందమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 2017–18 సంవత్సరం తర్వాత దేశంలోని నిరుద్యోగ సమస్యపై పీరియాడికల్ సర్వేలను కేంద్రం నిలిపి వేసిందని, వాస్తవానికి దేశంలో నిరుద్యోగ సమస్య 2018–19 సంవత్సరానికి 6.6 శాతానికి చేరుకుందని, ఇది ఆల్‌టైమ్ రికార్డని భారతీయ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల ఆ రంగం నుంచి ఏటా 60 నుంచి 70 లక్షల మంది ఉపాధి కోసం ఇతర రంగాలకు మల్లుతున్నారని వారు చెప్పారు. దీనికి అదనంగా కోటి ఇరవై లక్షల నుంచి కోటీ ముప్పై లక్షల మంది యువకులు ఉద్యోగ పర్వంలోకి అడుగుపెడుతున్నారని, వీరందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఇప్పటి ఐదేళ్లపాటు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని న్యూయార్క్‌లోని స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శతి రాజగోపాలన్ హెచ్చరించారు. ఇది జరగకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో దాదాపు పది కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటుందని, ఎన్నికలపై వారి ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికే భారత దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీకి ఓటేశారని, ఒకటి, రెండేళ్లు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్న యువతకు అది అప్పుడు అంత తీవ్రంగా అనిపించదని, ఐదేళ్ల పాటు నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా తానెంతో బలవంతుడినని నిరూపించుకున్న మోదీ ఎక్కడ దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా దష్టి పెట్టరేమోనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
మింగ మెతుకు లేదు..బాబు మీసాలకు సంపెంగ నూనె!
మింగడానికి మెతుకు లేకపోయినా.. మీసాలకు సంపెంగ నూనె కావాలన్నారట వెనుకట ఎవరో.. కాని ప్రస్తుతం ఆ నానుడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఓ పక్క డబ్బుల్లేవంటూ బీద అరుపులు అరుస్తూనే ఏ మాత్రం తగ్గకుండా దుబారా ఖర్చులకు సై అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి లోటు బడ్జెట్ అని తెలిసిన విషయమే. అయితే లోటు బడ్జెట్ అనే విషయాన్ని కనీసం పట్టించుకోకపోగా.. అట్టహాసంగా చేసిన ప్రమాణ స్వీకారానికి సర్కారు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి. కాని అవేమి పట్టించుకోకుండా.. సమయం చిక్కినపుడల్లా.. 'కూర్చోడానికి కుర్చీలేదు.. ఎక్కడ నుంచి పాలన సాగించాలి', 'ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది'', 'సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారు' అంటూ ఉపన్యాసాలతో ఊదర గొట్టేస్తూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పాటించాలని సందేశాలు ఇస్తూనే.. ముఖ్యమంత్రి హోదాలో పాటిస్తున్న పొదుపు తీరును చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. హైదరాబాద్ తాత్కాలిక రాజధాని అని తెలిసినా.. సచివాలయంలో తన చాంబర్ ఆధునీకరణ కోసం 10 కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెట్టేశారు. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు సొంతంగా ఓ టెలివిజన్ చానల్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు(ట). ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీపరంగా ఈ చానల్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చానెల్ ఆరంభించడంపై పార్టీ నేతలతో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇదే నిజమైతే... తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు 'ఎల్లో మీడియా'లో మరో అస్త్రం చేరడం ఖాయం.