నేడు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని ప్రకటించనున్న ప్రభుత్వం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేకే శర్మ వ్యక్తిగత పని మీద పది రోజులపాటు అమెరికా వెళ్తుండటంతో ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని నేడు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించనుంది. అత్యం త సీనియర్ అధికారి ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. సర్వీసెస్ డిపార్ట్మెంట్ నలుగురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. వీరిలో 1980 బ్యాచ్‌కు చెందిన నళినీ జయశీల న్, 1984 బ్యాచ్ కు చెందిన అరవింద్ రే, శకుంతల డి గామ్లిన్, ఎస్పీ సింగ్‌లు ఉన్నట్లు సమాచారం. హోం సెక్రట రీ ధర్మపాల్ కూడా సీనియర్ అధికారే అయినప్పటికీ ప్రధానితో కలిసి చైనా వెళ్లిన బృందంలో సభ్యునిగా ఉన్నారు.