delhi crime branch police
-
ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ
-
ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ
చెన్నై: రెండాకుల గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ను క్రైం బ్రాంచ్ పోలీసులు చెన్నై నుంచి ఢిల్లీకి తరలించారు. తమ కస్టడీలో ఉన్న దినకరన్‌ను గురువారం చెన్నైకి తీసుకొచ్చిన పోలీసులు అడయార్‌లోని నివాసంలో గత రెండు రోజులుగా విచారణ చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఆయన స్నేహితుడు మల్లికార్జున్ అన్నానగర్ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. వీరి వద్ద నుంచి కొన్ని కీలక సాక్ష్యాలు సేకరించారు. చెన్నైలో దినకరన్‌ను విచారించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను రాజాజీ భవన్‌నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. పోరూర్‌లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్‌కు చేరుకుని దినకరన్‌ను, మల్లికార్జున్‌ను పలు విషయాలపై ప్రశ్నించారు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీలోనూ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకు రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో టీటీవీ దినకరన్ వెనక ఉన్నది మన్నార్గుడి మాఫియా అని దాదాపు తేలిపోయింది. ఐదు రోజుల కస్డడీలో ఉన్న దినకరన్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి కేసుకు సంబంధించిన నివేదికను తయారు చేయనున్నారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముందస్తుగా ఆయనకు లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ క్రైమ్ పోలీసుల చెన్నై పర్యటన వాయిదా
న్యూఢిల్లీ: రెండాకులు గుర్తుకు కేటాయించాలంటూ లంచం కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ చెన్నై పర్యటను వాయిదా వేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముందుగా ఢిల్లీలో విచారణ పూర్తి చేసిన అనంతరం చెన్నై వెళ్లనున్నారు. అంతేకాకుండా చెన్నై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దినకరన్‌ను ఢిల్లీ తీసుకు వచ్చే విచారణ జరపాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్కేనగర్కు మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా ఎలాగైనా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ భావించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక, రెండాకుల చిహ్నంపై సోమవారం ఢిల్లీలోని సీఈసీ కార్యాలయంలో మళ్లీ విచారణ జరగనున్నట్లు తెలుసుకుని ఆయన తన ప్రయత్నాల వేగం పెంచారు. ఎన్నికల కమిషన్‌లోని ఒక అధికారి ద్వారా పని కానిచ్చేందుకు బడా బ్రోకర్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల ‡హోటల్లో దినకరన్ తరఫున బేరసారాలు సాగుతున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులకు ఉప్పందడంతో ఒక్కసారిగా దాడులు జరిపారు. కర్ణాటకకు చెందిన సుఖేష్ చంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.1.30 కోట్లు, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చెందిన ఒక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండాకుల చిహ్నం సాధించి పెడతానని దినకరన్‌తో రూ.60 కోట్లు బేరం కుదుర్చుకున్న సుఖేష్ రూ.1.30 కోట్ల అడ్వాన్సు పొందాడు. దీంతో సుఖేష్ వాంగ్మూలం ఆధారంగా దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో దినకరన్‌కు నోటీసులు ఇచ్చే అంశం వాయిదా పడింది. కాగా దినకరన్ మాత్రం ఈ సుఖేష్ ఎవరో తనకు తెలియదు, సమన్లు అందితే చట్టం ద్వారా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన న్యాయవాదులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాగా తాను చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా ఢిల్లీ పోలీసుల చేతుల్లో దినకరన్ కటకటాలపాలు కాక తప్పదనే ప్రచారం జరుగుతోంది. -
తీహార్ జైలు కేంద్రంగా భూదందా
⇒ ఛేదించిన ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ⇒ విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరు నిందితుల అరెస్టు ⇒ విచారణలో వెలుగు చూసిన ఆసక్తికర విషయాలు ⇒ గ్యాంగ్‌స్టర్ జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్ మెంటల్‌గా వెల్లడి న్యూఢిల్లీ : తీహార్ జైలు కేంద్రంగా కొనసాగుతున్న భూ ఆక్రమణల ముఠాను ఢిల్లీ పోలీసులు బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించిన ఇద్దరి సభ్యులను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2012లో హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్ మెంటల్ జైలు కేంద్రంగా భూ దందా కొనసాగిస్తున్నాడని శుక్రవారం పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నజఫ్‌గర్ ప్రాంతంలోని నఫేసింగ్కు చెందిన ప్లాట్‌ను ఆక్రమించుకోవాలని ముఠా సభ్యులైన సోనిపట్‌కు చెందిన బిజేందర్, మరో సభ్యుడు నజఫ్గర్కు చెందిన పవాన్ మాన్‌ను పురమాయించాడు. ఈ మేరకు అప్పగించిన ప్లాట్ ఆక్రమణ పనిని సభ్యులు పూర్తి చేశారు. డిసెంబర్ 13 ఆ ప్లాట్‌లో నుంచి పొగలు వచ్చాయి. అదేవిధంగా డిసెంబర్ 18న కూడా వచ్చాయి. సమీప ప్రజల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు డిసెంబర్ 24న ద్వారకాలో చాకచక్యంగా బిజేందర్, పవన్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్(క్రైం) రవీంద్ర యాదవ్ పేర్కొన్నారు. వీరిని విచారించ గా, ఇంటి యజమానిని భయబ్రాంతులకు గురిచేయడానికి మంటలు పెట్టామని, ఇదంతా మెంటల్ ఆదేశాల ప్రకారమే చేసినట్లు అంగీకరించారు. మెంటల్ సోదరుడు జగదీప్ తమకు కావల్సిన పేలుడు పదార్థాలను అందజేశాడని చెప్పాడు. బీజేందర్ జైలులో మెంటల్తోపాటు ఉండేవాడు. డిసెంబర్ 4 బెయిల్‌పై బయటకొచ్చాడు. మెంటల్ ఆదేశాల మేరకు విశ్వాసంగా తాను అప్పగించిన పనిని చేస్తున్నట్లు విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఆ ప్లాట్‌ను ఇంతకుముందు ప్రదీప బంకా, అతడి సోదరుడు జస్వంత్ ఆక్రమించుకొన్నారు. ఈ క్రమంలో బంకాను 2012లో మెంటల్ హత్యచేశాడు. ఈ కేసులో అరెస్టు అయి జైలు పాలయ్యాడు. కాగా బంకా సోదరులు ఈ ప్లాట్‌ను నఫేసింగ్కు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
పోలీసులనే బురిడీ కొట్టించారు
విజయవాడ సిటీ : రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెద అవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుల అరెస్టులో పోలీసులను మధ్యవర్తులు బురిడీ కొట్టించారు. నిందితులు నేరుగా తమ వద్దకే వచ్చి లొంగిపోతారని పోలీసులు ధీమాతో ఉన్నారు. వారి దిమ్మ తిరిగేలా ఆరుగురు నిందితులు కోర్టులో లొంగిపోయి ఝలక్ ఇచ్చారు. ఏలూరుకు చెందిన తమ న్యాయవాది ద్వారా ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులైన పురాణం గణేష్, ఊరా గోపి, తూరపాటి పెదబాబు, సిరిగిరి గోపరాజు, కిన్నెర శ్రీను, చేజర్ల వెంకటేష్ గురువారం ఉదయం గన్నవరం కో ర్టులో లొంగిపోయారు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గత సెప్టెంబర్ 24న జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో 22 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో ఢిల్లీకి చెందిన కిరాయి హంతకులు ఎనిమిది మంది కాగా.. మిగిలిన వారు పినకడిమి గ్రామానికి చెందిన కుట్రదారులు. ప్రధాన కుట్రదారుడు భూతం గోవింద్ విదేశాల్లో తల దాచుకోగా.. మిగిలిన వారు ఈ హత్యల తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు.. ఈస్ట్‌జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. కేసులో ఆధారాల సేకరణ, నిందితుల పట్టివేతను సిట్‌కు అప్పగించారు. అరెస్టయింది వీరే సిట్ ఏర్పాటుకు ముందే ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల సాయంతో కిరాయి షూటర్స్ ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్వీర్ అలి యాస్ సల్లు, నితిన్, నీరజ్‌తో పాటు కుట్రదారులతో ఒప్పందం చేసుకున్న మంజిత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాష్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సిట్ బృందం పినకడిమి గ్రామానికి చెందిన భూతం బాలాజీ, పాస్తం మహేష్, పాలపాటి శివను అక్టోబర్ 16వ తేదీన అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు ‘సిట్’ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ గాలి స్తోంది. ఈ బృందం కళ్లుగప్పి ఆరుగురు నింది తులు గురువారం కోర్టులో లొంగిపోయారు. ఏమార్పు నిందితులకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉన్నట్టు తెలిసింది. వీరు లొంగిపోనున్నారనే సమాచారంతో మధ్యవర్తులు విధిం చిన షరతులకు పోలీసులు అంగీకరిం చినట్లు చెబుతున్నారు. నిందితులు నేరుగా వచ్చి తమ వద్ద లొంగిపోతారనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఎలాగు వచ్చి లొంగిపోతారనే ఉద్దేశంతో సిట్ బృందం వీరిపై పెద్దగా దృష్టి సారించలేదు.ఈ క్రమంలో ముందుగా ఇచ్చిన మాటకు విరుద్ధంగా కోర్టులో లొంగిపోవడంతో పోలీసులు ఖిన్నులయ్యారు. ఈ అంశంపై మధ్యవర్తుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పోలీసులు.. మిగిలిన వారినైనా పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.