Delhi ganesh
-
ఢిల్లీ గణేష్ కన్నుమూత
సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ (80) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యం కారణంగా శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నై రామాపురంలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1964–74 మధ్య కాలంలో ఇండియ¯Œ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు ఢిల్లీ గణేష్. కళలపై ఉన్న ఆసక్తితో ఢిల్లీకి చెందిన దక్షిణ భారత నాటక సభలో సభ్యుడిగా చేరారు. అనంతరం సినీ రంగ ప్రవేశం చేశారు.కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘పట్టణ ప్రవేశం’(1976) చిత్రం ద్వారా నటుడుగా పరిచయమయ్యారాయన. ‘ఎంగమ్మ మహారాణి’ అనే మూవీలో హీరోగా నటించారు కూడా. తమిళంతో పాటు తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో సహాయ నటుడిగా, హాస్యనటుడిగా దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. అలాగే పలు సీరియల్స్‌లోనూ, కొన్ని వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఆయన మంచి నటుడే కాదు.. డబ్బింగ్ కళాకారుడు కూడా. పలువురు ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు.ఢిల్లీ గణేశ్ తెలుగులో ‘జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమి నాగు’ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేడు(సోమవారం) ఉదయం 10 గంటలకు చెన్నైలో ఢిల్లీ గణేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు మాధవన్ గణేష్ తెలిపారు. -
తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత
-
ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారు. వీటితో పాటు తమిళ సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటించారు. అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో శనివారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)ఢిల్లీ గణేశ్ మృతితో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈయన కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీలో కనిపించారు. అంతకు ముందు తెలుగులో ఈయన 'జైత్రయాత్ర', 'నాయుడమ్మ', 'పున్నమినాగు' తదితర సినిమాల్లో నటించారు. షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', సూర్య 'వీడొక్కడే', లారెన్స్ 'కాంచన 3' లాంటి డబ్బింగ్ చిత్రాల్లో ఈయన మీకు కనిపించే ఉంటారు.1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేశ్ సినీ ప్రస్థానం.. ఈ ఏడాది వరకు కొనసాగింది. సినిమా ఇండస్ట్రీ రాకముందు ఈయన భారత వైమానిక దళంలోనూ పనిచేశారు. మొదటి సినిమా కె.బాలచందర్ దర్శకత్వంలో పట్టిన ప్రవేశం (1977)లో నటించారు. 1994 కలైమామణి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు అందించింది. (ఇదీ చదవండి: OTT Review: గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన క్రికెట్) -
కొడుకు కోసం నిర్మాతనయ్యాను
చెన్నై : తన కొడుకును హీరో చేయడం కోసం నిర్మాత గా మారానని సీనియర్ నటుడు ఢిల్లీగణేశ్ అన్నారు. రంగస్థలం నుంచి వచ్చిన ఈయన బహుభాషా నటుడు కూడా. ఢిల్లీగణేశ్ కొడుకు మహా తెరంగేట్రం చేస్తున్నారు. ఓం గణేశ్ క్రియేషన్స్ పతాకంపై ఢిల్లీగణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్నుల్ ఆయిరం అనే పేరును నిర్ణయించారు. దర్శకుడు ఏఎల్.విజయ్ శిష్యుడు కృష్ణకుమార్ తొలి సారిగా మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో మహాకు జంటగా మలయాళీ బ్యూటీ మరీనా మైఖెల్, శ్రుతీయుగళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఇన్నుళ్ ఆయిరం చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీగణేశ్ మాట్లాడుతూ తన కొడుకు మహాను కథానాయకుడిగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నానన్నారు. ఈ సమయంలో దర్శకుడు ఏఎల్.విజయ్ వద్ద ఆరు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన కృష్ణకుమార్ ఒక కథ చెప్పారన్నారు. అది నచ్చడంతో ఓకే చేశామని చెప్పారు. మరో వైపు ఇతర నిర్మాతలు కొందరు తన కొడుకును హీరోగా పరిచయం చేయడానికి ముందుకొచ్చారని, అయితే వారు దర్శకుల్ని కూడా ఎంపిక చేసుకుని రావడంతో వద్దనన్నానని అన్నారు. ఇందులో తానూ ఒక పాత్ర పోషించానని చెప్పారు. తన కుమారుడు బాగా నటించాడని తెలిపారు. ఈ సమావేశంలో హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.