ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారు. వీటితో పాటు తమిళ సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటించారు. అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో శనివారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)
ఢిల్లీ గణేశ్ మృతితో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈయన కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీలో కనిపించారు. అంతకు ముందు తెలుగులో ఈయన 'జైత్రయాత్ర', 'నాయుడమ్మ', 'పున్నమినాగు' తదితర సినిమాల్లో నటించారు. షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', సూర్య 'వీడొక్కడే', లారెన్స్ 'కాంచన 3' లాంటి డబ్బింగ్ చిత్రాల్లో ఈయన మీకు కనిపించే ఉంటారు.
1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేశ్ సినీ ప్రస్థానం.. ఈ ఏడాది వరకు కొనసాగింది. సినిమా ఇండస్ట్రీ రాకముందు ఈయన భారత వైమానిక దళంలోనూ పనిచేశారు. మొదటి సినిమా కె.బాలచందర్ దర్శకత్వంలో పట్టిన ప్రవేశం (1977)లో నటించారు. 1994 కలైమామణి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు అందించింది.
(ఇదీ చదవండి: OTT Review: గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన క్రికెట్)
Comments
Please login to add a commentAdd a comment