కొడుకు కోసం నిర్మాతనయ్యాను | Delhi ganesh turned into director | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం నిర్మాతనయ్యాను

Published Wed, Nov 4 2015 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

Delhi ganesh turned into director

చెన్నై : తన కొడుకును హీరో చేయడం కోసం నిర్మాత గా మారానని సీనియర్ నటుడు ఢిల్లీగణేశ్ అన్నారు. రంగస్థలం నుంచి వచ్చిన ఈయన బహుభాషా నటుడు కూడా. ఢిల్లీగణేశ్ కొడుకు మహా తెరంగేట్రం చేస్తున్నారు. ఓం గణేశ్ క్రియేషన్స్ పతాకంపై ఢిల్లీగణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్నుల్ ఆయిరం అనే పేరును నిర్ణయించారు. దర్శకుడు ఏఎల్.విజయ్ శిష్యుడు కృష్ణకుమార్ తొలి సారిగా మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో మహాకు జంటగా మలయాళీ బ్యూటీ మరీనా మైఖెల్, శ్రుతీయుగళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఇన్నుళ్ ఆయిరం చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీగణేశ్ మాట్లాడుతూ తన కొడుకు మహాను కథానాయకుడిగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నానన్నారు. ఈ సమయంలో దర్శకుడు ఏఎల్.విజయ్ వద్ద ఆరు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన కృష్ణకుమార్ ఒక కథ చెప్పారన్నారు. అది నచ్చడంతో ఓకే చేశామని చెప్పారు.

మరో వైపు ఇతర నిర్మాతలు కొందరు తన కొడుకును హీరోగా పరిచయం చేయడానికి ముందుకొచ్చారని, అయితే వారు దర్శకుల్ని కూడా ఎంపిక చేసుకుని రావడంతో వద్దనన్నానని అన్నారు. ఇందులో తానూ ఒక పాత్ర పోషించానని చెప్పారు. తన కుమారుడు బాగా నటించాడని తెలిపారు. ఈ సమావేశంలో హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement