Mahadevan
-
లపతా లేడీస్ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి టాక్ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్ ఖాన్ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్ మహదేవన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్ అచ్చం గున్గట్ కే పట్ ఖోల్ లాగే ఉన్నాయని అన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్‌ఘట్ రైల్వే స్టేషన్లో వధువును బెంచ్‌పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్ఘట్లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఘున్‌ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.స్పందించిన రైటర్లపతా లేడీస్ కథ రాసిన బిప్లబ్ గోస్వామి ఈ విషయంపై స్పందించారు. నేను దశాబ్దం క్రితమే ఈ కథ రాశానని తెలిపారు. నా కథ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్టరజేషన్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజినల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందలేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. -
శశికళ మేనల్లుడి ఆకస్మిక మరణం
తిరుచ్చి:ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళను మరో విషాదం వెన్నాడింది. ఆమె మేనల్లుడు టీవీ మహదేవన్ ( 47) శనివారం కుంభకోణంలో గుండెపోటుతో మరణించారు. ఈ వార్త విన్న వెంటనే శశికళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మేనల్లుడి ఆకస్మిక మరణంతో కన్నీరు మున్నీరయ్యారు. శనివారం ఉదయం తంజావూరులోని మహాలింగేశ్వర టెంపుల్‌కి వెళ్లిన మహదేవన్‌కు గుండెపోటు వచ్చింది. గర్భగుడి ఎదురుగా పూజల అనంతరం బయటికి వస్తుండగా ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలిచారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు. మరోవైపు మేనల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా శశికళ పెద్ద సోదరుడు డా.వినోదగన్ కొడుకు మహాదేవన్ తంజావూరులో ఉంటున్నారు. తంజావూరులో తండ్రి డా. వినోదన్ ఆధ్వర్వంలో స్థాపించిన వినోదగన్ హాస్పిటల్‌కు మహదేవన్ ఎండీగా వున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ఫోరమ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. శశికళతో అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన, అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సమయంలో ఆమె వెంటే వున్నారు. -
కొడుకు కోసం నిర్మాతనయ్యాను
చెన్నై : తన కొడుకును హీరో చేయడం కోసం నిర్మాత గా మారానని సీనియర్ నటుడు ఢిల్లీగణేశ్ అన్నారు. రంగస్థలం నుంచి వచ్చిన ఈయన బహుభాషా నటుడు కూడా. ఢిల్లీగణేశ్ కొడుకు మహా తెరంగేట్రం చేస్తున్నారు. ఓం గణేశ్ క్రియేషన్స్ పతాకంపై ఢిల్లీగణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్నుల్ ఆయిరం అనే పేరును నిర్ణయించారు. దర్శకుడు ఏఎల్.విజయ్ శిష్యుడు కృష్ణకుమార్ తొలి సారిగా మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో మహాకు జంటగా మలయాళీ బ్యూటీ మరీనా మైఖెల్, శ్రుతీయుగళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఇన్నుళ్ ఆయిరం చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీగణేశ్ మాట్లాడుతూ తన కొడుకు మహాను కథానాయకుడిగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నానన్నారు. ఈ సమయంలో దర్శకుడు ఏఎల్.విజయ్ వద్ద ఆరు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన కృష్ణకుమార్ ఒక కథ చెప్పారన్నారు. అది నచ్చడంతో ఓకే చేశామని చెప్పారు. మరో వైపు ఇతర నిర్మాతలు కొందరు తన కొడుకును హీరోగా పరిచయం చేయడానికి ముందుకొచ్చారని, అయితే వారు దర్శకుల్ని కూడా ఎంపిక చేసుకుని రావడంతో వద్దనన్నానని అన్నారు. ఇందులో తానూ ఒక పాత్ర పోషించానని చెప్పారు. తన కుమారుడు బాగా నటించాడని తెలిపారు. ఈ సమావేశంలో హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.