శశికళ మేనల్లుడి ఆకస్మిక మరణం | V K Sasikala’s nephew TV Mahadevan dies of heart attac | Sakshi
Sakshi News home page

శశికళ మేనల్లుడి ఆకస్మిక మరణం

Published Sat, Apr 15 2017 3:28 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

శశికళ మేనల్లుడి ఆకస్మిక మరణం - Sakshi

శశికళ మేనల్లుడి ఆకస్మిక మరణం

తిరుచ్చి:ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళను మరో విషాదం వెన్నాడింది. ఆమె మేనల్లుడు  టీవీ మహదేవన్ ( 47) శనివారం  కుంభకోణంలో గుండెపోటుతో మరణించారు.  ఈ వార్త విన్న వెంటనే శశికళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  మేనల్లుడి  ఆకస్మిక మరణంతో కన్నీరు మున్నీరయ్యారు.

శనివారం ఉదయం తంజావూరులోని మహాలింగేశ్వర టెంపుల్‌కి వెళ్లిన మహదేవన్‌‌కు గుండెపోటు వచ్చింది. గర్భగుడి ఎదురుగా పూజల అనంతరం బయటికి వస్తుండగా ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి  తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలిచారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు.  మరోవైపు మేనల్లుడి  అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
    

కాగా శశికళ పెద్ద సోదరుడు డా.వినోదగన్ కొడుకు మహాదేవన్ తంజావూరులో ఉంటున్నారు. తంజావూరులో తండ్రి డా. వినోదన్‌ ఆధ్వర్వంలో స్థాపించిన వినోదగన్‌  హాస్పిటల్‌కు  మహదేవన్‌ ఎండీగా వున్నారు.  ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జయలలిత మరణం తర్వాత పార్టీ ఫోరమ్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. శశికళతో అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన, అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సమయంలో ఆమె వెంటే వున్నారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement