Delhi IGI Airport
-
IGI: ఇందిరాగాంధీ విమానాశ్రయం అరుదైన ఘనత
ఢిల్లీ: నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI) అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్పోర్ట్ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం హైడ్రో, సోలార్ పవర్‌తోనే నడుస్తోంది. 2030 నాటికి.. పునరుత్పాదక ప్రయత్నంతో పూర్తిస్థాయి కార్బన్ ఉద్గార రహిత ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఒక ప్రధాన అడుగు అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించుకుంది. సుమారు రెండు లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంగా తెలిపింది. ఇదిలా ఉంటే.. 2036 దాకా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు హైడ్రోఎలక్ట్రిసిటీ సరఫరా చేసే ఉద్దేశంతో.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది డయల్. కిందటి ఏడాది భారత్‌తో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు దక్కించుకుంది ఐజీఐ. -
పరదేశీ వద్ద లక్షల్లో కొత్తనోట్లు!
పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులకు వెయ్యి, రెండువేలు రూపాయల కొత్త నోట్లు దొరకడమే గగనంగా మారగా.. మరోవైపు అక్రమార్కుల వద్ద వందల కోట్లలో కొత్త కరెన్సీ లభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ విదేశీయుడి వద్ద కూడా లక్షల రూపాయల్లో కొత్తనోట్లు దొరికాయి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీమొత్తంలో కొత్త కరెన్సీతో ప్రయాణిస్తున్న విదేశీయుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియా దేశస్తుడైన తుచుక్వో చిజియోకో అనే వ్యక్తి వద్ద 53.78 లక్షల కొత్త కరెన్సీని, రూ. 4.29 లక్షల పాత కరెన్సీని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఇండిగో విమానంలో అతడు వచ్చాడు. భారీ మొత్తంలో కరెన్సీ దొరకడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో కొత్త కరెన్సీ, పాత కరెన్సీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. -
పరదేశీ వద్ద లక్షల్లో కొత్తనోట్లు!
-
10 రోజులు ఎయిర్ పోర్టులో నక్కాడు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. నకిలీ టిక్కెట్లతో ఎయిర్ పోర్టులోకి చొరబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డేకు వారం రోజుల ముందు జరిగిన ఘటన భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోంది. నకిలీ టికెట్ తో ఎయిర్ పోర్టులోకి చొరబడిన ఓ వ్యక్తి ఏకంగా 10 రోజుల పాటు అక్కడ తిష్ట వేశాడు. అతడిని హౌస్ కీపింగ్ ఉద్యోగి గుర్తించి సీఐఎస్ఎఫ్ కు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. జనవరి 20న అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అబ్దుల్లాగా గుర్తించారు. ఇండియా ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి ఇన్నిరోజులు తిష్ట వేయడం ఇదే మొదటిసారని సీఐఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. జనవరి 11న అబ్దుల్లా.. ఢిల్లీ విమాశ్రయానికి వచ్చాడు. అతడి టికెట్ నకిలీదని గుర్తించి అనుమతి నిరాకరించారు. అయితే అతడు మరో గేటు గుండా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు. ఎవరికీ అనుమానం రాకుండా 10 రోజుల పాటు అక్కడ గడిపాడు. దుబాయ్ వెళ్లేందుకు రావల్సిన డబ్బు అందుకునేందుకే ఎయిర్ పోర్టులో వేచివున్నానని పోలీసుల విచారణలో అతడు చెప్పాడు. ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో నకిలీ టికెట్లతో 2015లో 50 మందిపైగా పట్టుబడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. మార్చిలో ఓ యువకుడు భద్రతాదళాల కళ్లుగప్పి తుపాకీతో ఎయిర్ పోర్టులోపలికి ప్రవేశించాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని గత నెలలో అరెస్ట్ చేశారు. విమానాశ్రయాల్లో భద్రతా వైఫల్యాలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.