పరదేశీ వద్ద లక్షల్లో కొత్తనోట్లు! | Rs 53.78 lakh in new notes seized from foreign national | Sakshi
Sakshi News home page

పరదేశీ వద్ద లక్షల్లో కొత్తనోట్లు!

Published Fri, Dec 23 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

పరదేశీ వద్ద లక్షల్లో కొత్తనోట్లు!

పరదేశీ వద్ద లక్షల్లో కొత్తనోట్లు!

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులకు వెయ్యి, రెండువేలు రూపాయల కొత్త నోట్లు దొరకడమే గగనంగా మారగా.. మరోవైపు అక్రమార్కుల వద్ద వందల కోట్లలో కొత్త కరెన్సీ లభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ విదేశీయుడి వద్ద కూడా లక్షల రూపాయల్లో కొత్తనోట్లు దొరికాయి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీమొత్తంలో కొత్త కరెన్సీతో ప్రయాణిస్తున్న విదేశీయుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నైజీరియా దేశస్తుడైన తుచుక్వో చిజియోకో అనే వ్యక్తి వద్ద 53.78 లక్షల కొత్త కరెన్సీని, రూ. 4.29 లక్షల పాత కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఇండిగో విమానంలో అతడు వచ్చాడు. భారీ మొత్తంలో కరెన్సీ దొరకడంతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో కొత్త కరెన్సీ, పాత కరెన్సీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement