Delhi journalist
-
‘భారత్ రహస్యాలు లీక్; ఢిల్లీ జర్నలిస్ట్ అరెస్టు’
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన సున్నతమైన సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్‌కు చేరవేసిన కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందుతుల్లో ఢిల్లీ జర్నలిస్టు రాజీవ్ శర్మ అనే వ్యక్తి తోపాటు చైనా మహిళ ఉన్నారు. చైనాకు చెందిన గూఢచారి ఏజెన్సీలతో భారత రహస్య రక్షణ పత్రాలను పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారించిన అనతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (జాతీయ భద్రతకు సంబంధించిన డేటా హ్యాక్..!) Freelance journalist Rajeev Sharma (pic 1) arrested under Official Secrets Act for passing sensitive information to Chinese intelligence. A Chinese woman & her Nepalese associate also arrested for paying him large amounts of money routed through shell companies: Delhi Police pic.twitter.com/8cDHbwcFtB — ANI (@ANI) September 19, 2020 పోలీసుల వివరాల ప్రకారం.. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న న్యూఢిల్లీలోని పితమ్‌పురాకు చెందిన రాజీవ్ శర్మ విలేఖరి ముసుగులో చైనా గూఢచారిగా పనిచేస్తూ దేశ రహస్యాలను చైనాకు లీక్ చేస్తున్నాడు. అందుకోసం అతడికి, చైనాకు చెందిన మహిళకు పెద్ద ఎత్తున డబ్బులు అందుతున్నాయి. ఈ కేసుపై విచారణ జరుగుతుందని.. విచారణ క్రమంలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని పోలీసులు తెలిపారు. కాగా రాజీవ్ శర్మను ముందుగా సెప్టెంబర్ 14న స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసి.. సెప్టెంబర్ 15 కోర్టులో హాజరుపరిచారు. అతడిని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. (టిక్‌టాక్, వీచాట్‌ల బ్యాన్.. చైనా స్పందన) -
టీవీ జర్నలిస్టుపై దుండగుల కాల్పులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో ఇద్దరు సాయుధులు ఓ టీవీ జర్నలిస్ట్‌పై ఆయన నివాసంలోనే కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సహారా సమయ్ హిందీ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ అనూజ్ చౌదరి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజాపూర్ గ్రామం నుంచి ఇంటికి తిరిగివచ్చిన అనంతరం అనూజ్‌పై హెల్మెట్లు ధరించిన సాయుధులు ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అనూజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, వ్యక్తిగత శతృత్వమే జర్నలిస్ట్‌పై దాడికి కారణంగా ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దాడికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అనూజ్ చౌదరి బీఎస్పీ కౌన్సిలర్ భర్త కావడం గమనార్హం. పాతకక్షల నేపథ్యంలోనే కాల్పులు జరిగాయని ఎస్పీ వైభవ్ కృష్ణ పేర్కొన్నారు. దాడి చేసిన వారిని బాధిత కుటుంబ సభ్యులు గుర్తించారని, నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు. -
మహిళా జర్నలిస్టుపై దాడి..పరిస్థితి విషమం
న్యూడిల్లీ: ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై దాడి చేసింది. ఈవినింగ్ వాక్ కోసం వెళ్లిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు అపర్ణ కల్రా(45) గుర్తు తెలియని వ్యక్తి దాడిచేశాడు. దీంతో ఆమెతీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ అశోక్ విహార్ లో పబ్లిక్ పార్క్‌లో బుధవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి అపర్ణపై దాడి చేశాడు. ఇనుపరాడ్ తో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలో అపర్ణ అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెదడుకు మల్టిపుల్ గాయాలు కావడంతో ఫోర్టిస్ ఆస్పత్రిలో వైద్యులు ఒక శస్త్రచికిత్స నిర్వహించారనీ, కానీ పరిస్థితి విషమంగా ఉందనీ అపర్ణ బంధువు భాటియా తెలిపారు. సెల్ ఫోన్ చోరీ కోసం దాడి జరిగి ఉంటుందని మొదట అనుమానించామనీ, కానీ ఆమె ఫోన్ ఇంట్లోనే వదిలి వాకింగ్ వెళ్లారని చెప్పారు.ఆమె దగ్గర ఇతర విలువైన వస్తువులు ఏమీ లేవని చెప్పారు. హత్యా యత్నం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు డిసిపి (నార్త్-వెస్ట్)మిలింద్ డుంబ్రే చెప్పారు. ముక్కు, తలనుంచి తీవ్ర రక్త స్రావంతో పడివున్న ఆమెపై తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. దాడిచేసిన వారి గురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కాగా ఫ్రీ జర్నలిస్టుకాక ముందు అపర్ణ చాలా జాతీయ దినపత్రికల్లో పనిచేశారు.