గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీకి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఉత్తర్వులిచ్చారు. పటియాలా కోర్టుకు తెస్తే ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని, అందువల్ల అక్కడికి 7 కి.మీ. దూరంలో ఉన్న చాణక్యపురి పోలీస్స్టేషన్లో విచారణ జరపాల్సిందిగా పోలీసులు కోరారు. అందుకు అంగీకరించిన మేజిస్ట్రేట్ ఉదయమే అక్కడికి వెళ్లారు. తర్వాత తీహార్ జైలుకు తరలించారు.