delivery center
-
ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డెలివరీ స్టేషన్, ఎక్కడంటే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పూర్తిగా మహిళల నిర్వహణలో డెలివరీ కేంద్రాల సంఖ్యను పెంచుతోంది. 5వ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇటువంటి డెలివరీ పార్ట్నర్ స్టేషన్స్ చెన్నై, గుజరాత్, కేరళలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 750కిపైగా నగరాలు, పట్టణాల్లో మొత్తం 1,650 డెలివరీ సర్వీస్ పార్ట్నర్ స్టేషన్స్ ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యం మరోవైపు మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించే దిశగా అమెజాన్ సహేలీ ప్రోగ్రాం కింద నాలుగు సంస్థలతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తెలిపింది. జార్ఖండ్ స్టేట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (జెఎస్ఎల్పీఎస్), ఉత్తర్‌ప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (యూపీఎస్ఆర్ఎల్ఎం), ఛత్తీస్‌గఢ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ (సీజీ ఫారెస్ట్) అస్సామ్ రూరల్ ఇన్ఫ్రా అండ్ అగ్రి సర్వీసెస్ (ఏఆర్‌ఐఏఎస్) వీటిలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో సదరు సంస్థల పరిధిలోని మహిళా వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలను అమెజాన్ ఇండియాలో నమోదు చేసుకునేందుకు, మరింత విస్తృతంగా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా చేసేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడతాయని అమెజాన్ తెలిపింది. ఉత్పత్తుల లిస్టింగ్, ప్యాకేజింగ్, షిప్పింగ్ తదితర అంశాలకు సంబంధించి మహిళలు అమెజాన్ సహేలీ ప్రోగ్రాం కింద శిక్షణ కల్పిస్తామని పేర్కొంది. ఉమెన్స్ ఎంట్రప్రెన్యూర్షిప్ డే సందర్భంగా మహిళా వ్యాపారవేత్తలు రూపొందించిన ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టోర్ ఆవిష్కరించినట్లు అమెజాన్ వివరించింది. చదవండి: అమెజాన్, 10 లక్షల మంది ఏ రేంజ్ ఫోన్లు కొన్నారో తెలుసా..! -
హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద డెలివరీ సెంటర్
-
ఫ్రాన్స్‌లో టీసీఎస్ మరో డెలివరీ సెంటర్
న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫ్రాన్స్‌లో కొత్త డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఫ్రాన్స్‌లోని సురెసెన్స్లో ఈ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేశామని టీసీఎస్ తెలిపింది. ఈ సెంటర్లో ఉద్యోగుల సంఖ్య 230 వరకూ ఉంటుందని టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేశ్ గోపీనాధన్ చెప్పారు. ఫ్రాన్స్‌లో ఇప్పటికే రెండు డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఇది మూడో డెలివరీ సెంటర్ అని వివరించారు. 2012లో లిల్లేలో, 2014లో పొయిటీర్స్లో ఈ సెంటర్లను ఆరంభించామని పేర్కొన్నారు. -
కరీంనగర్లో ‘ఇక్లాట్’ డెలివరీ సెంటర్
• 1,000 మందికి ఉద్యోగాలు • రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి • ఇక్లాట్ సీఈవో కార్తీక్ పొల్సాని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మెడికల్ కోడింగ్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన ‘ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్’ కరీంనగర్లో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.100 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ప్రస్తుతం 200 మంది పనిచేస్తున్న ఈ కేంద్రం ద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగాలు రానున్నట్లు కంపెనీ తెలియజేసింది. నిజానికి తెలంగాణలో హైదరాబాద్ వెలుపల ఓ బహుళజాతి సంస్థ ఈ స్థాయిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. డెలివరీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది మే నెలలో తెలంగాణ ప్రభుత్వానికి, కంపెనీకి అమెరికాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారంనాడు కొత్త సెంటర్‌ను ప్రారంభిస్తారని ఇక్లాట్ సీఈవో కార్తీక్ పొల్సాని మంగళవారమిక్కడ తెలిపారు. ఇక్లాట్ చైర్మన్ సుధాకర్‌రావు పొల్సాని, సీవోవో స్నేహ పొల్సానితో కలిసి మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో 5,000 మంది... ఇక్లాట్కు యూఎస్‌లో మూడు కార్యాలయాలు, భారత్‌లో హైదరాబాద్, చెన్నైలో డెలివరీ సెంటర్లున్నాయి. హైదరాబాద్‌లో 250 మంది, చెన్నైలో 100, యూఎస్‌లో 40 మంది పనిచేస్తున్నారు. అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 5,000లకు చేరుస్తామని కార్తీక్ వెల్లడించారు. లైఫ్ సెన్సైస్ చదివినవారికి తొలి ప్రాధాన్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ‘సమర్థులు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్, కరీంనగర్లో పనిచేస్తున్నవారిలో 70 శాతం మంది తెలుగు మీడియంలో చదివినవారే. అట్రిషన్ రేటు తక్కువ కాబట్టే కరీంనగర్‌ను ఎంచుకున్నాం. కంపెనీకి అయ్యే ఖర్చు కూడా తక్కువ’ అని చెప్పారు. 2017లో వరంగల్‌లో.. వరంగల్‌లో మరో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా దీన్ని అందుబాటులోకి తెస్తామని కార్తీక్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి వెల్లడించారు. ‘‘ముందుగా 100-150 మందితో ప్రారంభిస్తాం. దశలవారీగా ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచుతాం. ఈ కేంద్రానికి కూడా రూ.100 కోట్ల దాకా పెట్టుబడి అవసరం అవుతుంది’’ అని వివరించారు. మెడికల్ రికార్డులను కోడ్స్ రూపంలోకి మార్చడమే కంపెనీ పని. ఈ కోడ్స్ ఆధారంగా బీమా కంపెనీలు క్లెయిమ్‌లను సెటిల్ చేస్తాయి. అమెరికాలో టాప్-20 ఆసుపత్రుల్లో అయిదు సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నట్లు స్నేహ చెప్పారు.