Demand in the market
-
అమ్మకాల్లో ఆన్‌లైన్‌దే హవా..
కోల్‌కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది. ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకంటే ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్ఐక్యూ, జీఎఫ్కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం.. డోర్ డెలివరీ ఎఫెక్ట్ కరోనా తదుపరి లాక్డౌన్లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్‌గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్‌లైన్‌కే ఓటు వేస్తున్నారు. భారీ వృద్ధి బాటలో లాక్డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్‌లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది. ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్‌డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్ఫ్రీ ఫ్రిజ్‌లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి. -
డిష్ వాష్ కరోనా!
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్తే మొహానికి మాస్కు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. శానిటైజర్ రాసుకోవడం... కరోనా కట్టడి కోసం ఇప్పుడు మనమంతా చేస్తున్న పని. ఇంతవరకు బాగానే ఉంది. మరి నిత్యం గిన్నెలు తోమేందుకు ఇళ్లకు వచ్చే పనిమనుషులు మనలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తెలి యదు. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది పనిమనుషులను దూరం పెట్టారు. మరి వారు రాకుండా ఎంతకాలం నెట్టుకురాగలరు? ఇందుకు వారికి లభించిన సమాధానమే డిష్ వాషర్. లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు డిష్ వాషర్ల కొనుగోలు కోసం ఎలక్ట్రానిక్ షోరూంలకు వెళ్తున్నారు. ల్యాప్‌టాప్‌లకూ పెరిగిన గిరాకీ... కరోనా ఇప్పట్లో వదిలే అవకాశం లేక పోవడంతో విద్యా సంస్థలు ఆన్లైన్ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఇందుకు అనువుగా ఉండే ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కోసం తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్ షోరూంలకు అధికంగా వెళ్తున్నారు. ‘‘లాక్డౌన్ కంటే ముందు మా షోరూంకు నిత్యం 60 నుంచి 70 మంది వచ్చే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటుతోంది. ఏసీలు, టీవీలు, కూలర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు కొంటున్నారు. ఇప్పుడు సరి–బేసి విధానం వల్ల కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోందా తగ్గుతోందా అనేది ఇంకా అంచనా వేయాల్సి ఉంది. మరో వారం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జనం భయం వదిలి కొనుగోలుకు ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అని మరో ప్రధాన షోరూం నిర్వాహకుడు పేర్కొన్నారు. తెలియని వస్తువే అయినా... డిష్ వాషర్ సాధారణ కుటుంబాలకు అంతగా పరిచయం లేనిది. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్ వాడకం సాధారణమే కానీ డిష్ వాషర్ పేరు వినడమే ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇది గిన్నెలు తోమే యం త్రం. వాషింగ్ మెషీ న్లలో బట్టలు, వాషింగ్ పౌడర్ వేసి సమయం సెట్ చేస్తే దాని పని ఎలా చేసుకుంటూ వెళ్తుందో అదే తరహాలో డిష్ వాషర్ కూడా పనిచేస్తుంది. పళ్లాలు, గిన్నె లు, గ్లాసులను వాటి సైజుల ప్రకారం యంత్రంలో ఉంచి లిక్విడ్ డిటెర్జంట్ వేసి సమయం నిర్దేశిస్తే చాలు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య డిష్ వాషర్ల ధర పలుకు తోంది. సైజు, నాణ్యత, కంపెనీల ఆధారంగా ధరల్లో తేడాలున్నాయి. ఇంటిల్లి పాదీ బోళ్లు తోమేం దుకు ఇది అనుకూలంగా ఉండటంతో వాటిని కొనే స్తోమత ఉన్న వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ‘గతంలో నెలలో మేం 7–8 వరకు వీటిని అమ్మే వాళ్లం. కానీ ఇప్పుడు లాక్డౌన్ సడలించిన తర్వాత గత మూడు నాలుగు రోజుల్లో 10 వరకు అమ్మేశాం. త్వరలో వీటి కొనుగోళ్లు మరింత పెరుగుతాయి’ అని నగరంలో ఓ ప్రధాన ఎలక్ట్రానిక్ షోరూం ఇన్చార్జి పేర్కొన్నారు. ఇక వాషింగ్ మెషీన్ల కొనుగోలు కూడా గతంతో పోలిస్తే పెరిగింది. -
చల్లబడిన నూనె ధరలు
తాడేపల్లిగూడెం : పామాయిల్ ధర దిగివచ్చింది. మార్కెట్లో డిమాండ్ తగ్గడం, రాష్ట్ర విభజన కారణంగా టిన్ నంబర్లు బిల్లులు మారడం, ఆయిల్ కంపెనీల వ్యాపార సంబంధ సాఫ్ట్వేర్లను మార్చుకోవడం తదితర కారణాల వల్ల వ్యాపారం మందగించింది. మార్కెట్లో ఉన్న స్టాకునకు డిమాండ్ లేక పామాయిల్ ధర ఒక్కసారిగా పడిపోయింది. పదిహేను కిలోల డబ్బా రూ.990 నుంచి రూ.1000 వరకు పలకగా, ప్రస్తుతం రూ.900కు పడి పోయింది. రైస్ బ్రాన్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 15 కిలోల డబ్బా రూ.1,040 నుంచి రూ.వెరుు్యకి తగ్గింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర మాత్రం 15 కిలోల డబ్బా రూ.1,175 వద్ద స్థిరంగా ఉండి పోయింది. సన్‌ఫ్లవర్ మార్కెట్లో మనుగడలో ఉన్న దిగుమతి దారులకు గతంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దశలో సన్‌ఫ్లవర్ మార్కెట్‌ను ఉక్రెయిన్ శాసిస్తుందా అనే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఉక్రెయిన్‌లో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి సన్‌ఫ్లవర్ దిగుమతులు తగ్గాయి. ఆవకాయ పచ్చళ్ల సీజన్ కావడంతో వే రుశనగ నూనె ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. 15 కిలోల డబ్బా గుత్త మార్కెట్లో రూ.1,350 నుంచి రూ.1,400 కు పెరిగింది. పామాయిల్ ధర చల్లబడటంతో అల్పాదాయ వర్గాలు కాస్త ఉపశమనం పొందాయి. ఈ సమయంలో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి నూనెల లోడింగ్ జరగలేదు.