దివ్యశ్రీ, కీర్తన..శభాష్
తల్లి, తండ్రి మృతి చెందిన దుఃఖంలో పరీక్ష రాసి మంచి మార్కులు సాధించిన విద్యార్థినులు
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యామని చెప్పుకోడానికి ఒకరికేమో తల్లిలేదు.. మరొకరికేమో తండ్రి లేడు. పరీక్షల సమయంలో ఈ ఇద్దరు విద్యార్థినిలు ఒకరు త ండ్రిని, మరొకరు తల్లిని కోల్పోయారు. పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసి నేడు మంచి ఫలితాలు సాధించారు. దివ్యశ్రీ జిపిఎ 10కి 10, కీర్తన 8.2 జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరం పోలీస్లైన్లోని పద్మావతి, సుబ్బనరసింహల పెద్ద కుమార్తె దివ్యశ్రీ. నగరంలోని సాయి క్రిష ్ణహైస్కూల్లో పదవ తరగతి చదివింది.
ఈమె తల్లి పద్మావతి మార్చి 25న తమ బందువుల ఆమ్మాయికి ఆరోగ్యం బాగా లేకుంటే చెన్నైలోని అపోలో అసుపత్రిలో చూపించుకుని 26వ తేదీ రాత్రి చెన్నై నుంచి వస్తుండగా రాజంపేట సమీపంలో లారీని కారు ఢీకున్న సంఘనటలో మృతి చెందింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలిసిన దివ్యశ్రీ పుట్టెడు దుఖాన్ని దిగమింగుకుని 27న నాగార్జున మోడల్ స్కూల్లోని పరీక్షా కేంద్రానికి హాజరై తెలుగు పరీక్ష రాసింది. అన్ని సబ్జెక్టులలో పదికి పది (జీపీఏ)మార్కులను సాధించి సత్తా చాటుకుంది.
తండ్రి ఇకరారని తెలిసి..
కడపలోని నెహ్రునగర్కు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి పెద్ద కుమార్తె కీర్తన. జయనగర్కాలనీకి చెందిన జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివింది. వెంకట రమణ అనారోగ్యంతో భాదపడుతూ మార్చి 27 తెల్లవారుజామున మృతి చెందాడు. బాగా చదువుకోవాలమ్మా అని తండ్రి తరచూ చెప్పే మాటలను గుర్తు తెచ్చుకుని గుండె నిబ్బరం చేసుకుని నాగార్జున మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రానికి హాజరై పరీక్ష రాసింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 8.2 జీపీఏ సాధించింది.
అప్పట్లో పరీక్ష రాస్తున్న కీర్తనను డీఈఓ ప్రతాపరెడ్డి ఓదార్చారు. పై చదువుకు తన వంతు సాయం చేస్తానని కూడా చెప్పారు. అదే సెంటర్లో దివ్యశ్రీ అనే విద్యార్థిని తల్లి కూడా వృుతి చెందిందని తెలియక పోవటంతో అప్పట్లో డీఈఓ పరామర్శించలేకపోయారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థినులిద్దరూ మంచి మార్కులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.