అతను కామ పిశాచే..
దుర్మార్గానికి ఒడిగట్టిన హెచ్ఎం భర్త శామ్యూల్ ప్రఫుల్లా
ఎందరో చిన్నారులపై లైంగిక దాడులు
డీఈవో విచారణతో దారుణాలు వెలుగులోకి...
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలో తొమ్మిదో తరగతి బాలిక(14)పై లైంగిక దాడికి ఒడిగట్టిన కామాంధుడి వికృత చేష్టలు ఒక్కొక్కొటిగా బయటపడుతున్నాయి. కొం గారెడ్డిపల్లెలోని తమిళనాడుకు చెందిన షర్మన్ బాలికల ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి భర్తను అసలు ఆడపిల్లల వసతి గృహంలో ఎలా చేర్చారో అర్థం కావడంలేదు. మత బోధకుడిగా ఉన్న ఆ వ్యక్తి చాలా మంది పసిమొగ్గలకు మాయ మాటలు చెప్పి వారిని చిదిమేసినట్లు పలువురు పిల్లలు పోలీసులకు చెప్పారు.
అన్నీ తెలిసి మూసిపెట్టారు..
నగరంలోని బీసీ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న బాలికపై ఇక్కడున్న ఓ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి భర్త అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం సంఘటన జరిగిన ప్రాంతాన్ని, పాఠశాలలోని పలువురిని విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలియవచ్చాయి. బాలికపై దురాగతానికి పాల్పడ్డ శామ్యూల్ ప్రఫుల్లా గతంలో పలువురు బాలిక లపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు బాధితులు వెల్లడించారు. అయితే బయటకు చెబితే తమ పరువు పోతుందని ఎవరూ ముందుకురాలేదు. బాధితురాలి మరో స్నేహితురాల్ని సైతం ప్రఫుల్లా లైగింగ వేధింపులకు గురిచేయడంతో ఆ అమ్మాయి ఈ అవమానాన్ని భరించలేక చేతిపై బ్లేడుతో పలుమార్లు కోసుకుంది కూడా. ఈ గాట్లను సైతం పోలీసులకు చూపించింది. ఈ విషయాలు హెచ్ంతో పాటు మరో వ్యక్తికి తెలుసునని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ బయటకు చెబితే టీసీ ఇచ్చి పంపించేస్తాం.. మీ భవిష్యత్తు పాడవుతుందని ప్రఫుల్లాకు వంతనపాడే వాళ్లు బెదిరించడంతో ఎవరూ నోరు తెరవకుండా ఉండిపోయారు. తీరా ఓ బాలిక మాత్రం జరిగిన విషయాన్ని ధైర్యంగా బయటపెట్టడంతో పలువురు బాధితులు సైతం ముం దుకొచ్చి వారిపై జరిగిన ఆకృత్యాలను సైతం వివరిస్తున్నారు.
యాజమాన్యానికి నోటీసులు
జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎం తిరుఅరుల్ప్పావై పలువురు విద్యార్థుల్ని సొంత పనులకు ఉపయోగిస్తున్నట్లు విచారణకు వచ్చిన డీఈవోకు పలువురు పిల్లలు తెలిపారు. ఇక్కడి వ్యవహారంపై పట్టించుకోని తమిళనాడులోని వేలూరులో ఉన్న షర్మన్ యాజ మాన్యానికి సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు డీఈవో తెలిపారు. అవసరయితే హెచ్ఎంను సస్పెండ్ చేసే విషయాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాజీకి యత్నం..
ఈ సంఘటనలో దోషిని కాపాడటానికి పలువురు పెద్దలు రాజీకి ప్రయత్నించారు. లైంగికదాడికి గురైన బాలిక కుటుంబ సభ్యుల్ని ఆదివారం రాత్రి పిలిపిం చిన పెద్దలు.. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి వెల కట్టడానికి బేరసారాలు సాగించారు. అయితే విషయం మీడియాకు పొక్కడంతో ఎక్కడ తమ పేర్లు బయటకొస్తాయోనని భయపడి వెళ్లిపోయారు.