deparment
-
కస్టడీలోకి తీసుకుని విచారించాలి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. -
ప్రత్యేక గుర్తింపు ఉంటేనే న్యాయవాదికి భవిష్యత్తు
నాగార్జున వర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్ జయశ్రీ కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : న్యాయ విద్యార్థిగా పట్టా పొందడం గొప్పకాదని, న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నవారికే భవిష్యత్తు ఉంటుందని నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగాధిపతి డాక్టర్ జయశ్రీ అన్నారు. జేఎన్టీయూకే ఆడిటోరియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ–ఐలు) జిల్లా అధ్యక్షుడు మేడపాటి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి న్యాయ విద్యార్థుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ క్లాస్‌లకు హాజరుకాకుండా పరీక్షలు రాసేవారికి లా పట్టా వస్తుందే తప్ప ‘లా’ రాదన్నారు. ఇంటర్నెట్పై కంటే టెక్టŠస్బుక్ను చదివితేనే అవగాహన వస్తుందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఐలు రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుం దన్నారు. అనంతపురం ఎస్కేడీ వర్సిటీ ప్రొఫెసర్ ఎస్వీ పుల్లారెడ్డి మాట్లాడుతూ లా విద్యకు పెట్టిన వయసు నిబంధన మంచిదేనన్నారు. బార్ కౌన్సిల్ మెంబర్ గోకుల్‌కృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాలపై అవగాహన ఉంటేనే కేసును వాదించగలరన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు రాజేష్ మాట్లాడుతూ సంపద ఆశించకుంటే భవిష్యత్తు ఉంటుందన్నారు. రాజీవ్ గాంధీ లా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చిన్నస్థాయి లా కళాశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులే చేరతారని, వారిని దృష్టిలో పెట్టుకుని వెసులుబాటు కల్పించాలన్నారు. ఐలు జిల్లా అధ్యక్షుడు ధర్మారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక, కేరళ రాష్ట్రాల మాదిరిగా జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాలని కోరతామన్నారు. కాకినాడ సీనియర్ న్యాయవాది జవహర్‌ఆలీ మాట్లాడుతూ న్యాయవాదికి సేవాదృక్పథం ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు సదస్సులో పాల్గొన్నారు.