deposing
-
'ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ'
ముంబై: 26/11 మారణహోమంలో ముంబై ఎయిర్ పోర్టుపై దాడి చేయనందుకు లష్కరే తొయిబా అసంతృప్తికి గురైందని అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీ వెల్లడించాడు. ముంబై ఎయిర్ పోర్టులో రెక్కీ నిర్వహించానని, ఈ విషయం తెలిసి ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్టును టార్గెట్ చేయడం మంచి ఆలోచన కాదని ఇక్బాల్ అభిప్రాయపడినట్టు తెలిపాడు. యూదులు, ఇజ్రాయెల్ దేశస్తులు ఎక్కువగా ఉండే బచబాద్ హౌస్ ను లష్కరే తొయిబా టార్గెట్ గా ఎంపిక చేసిందన్నాడు. పాకిస్థాన్ పై గతంలో భారత్ జరిపిన బాంబు దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలంటే 26/11 దాడులను పక్కాగా అమలు చేయాలని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ తమకు నూరిపోశాడని చెప్పాడు. ఉగ్రవాదులు ఎక్కడ దిగాలో ఇక్బాల్, సాజిద్ మిర్ తనకు వీడియోలో చూపించారని చెప్పాడు. దాడికి పాల్పడిన 10 మంది ఉగ్రవాదులు హిందువులుగా నమ్మించేందుకు సిద్ధివినాయక ఆలయంలో ఎరుపు, పసుపు రంగు తాళ్లు కొన్నారని తెలిపాడు. ఐఎస్ఐ తరపున పనిచేందుకు భవిష్యత్ లో బాటా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) నుంచి కొంతమందిని నియమించుకోవాలనుకుంటున్నట్టు మేజన్ ఇక్బాల్ తనతో చెప్పాడని వెల్లడించాడు. తాను బార్క్ ను సందర్శించి తీసిన వీడియోను ఇక్బాల్, సాజిద్ మిర్ ఇచ్చినట్టు హెడ్లీ తెలిపాడు. -
'2006లో ముంబైలో ఆఫీసు పెట్టా'
ముంబై: 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55) సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. నాలుగో రోజు గురువారం ముంబై ప్రత్యేక కోర్టు జడ్జికి వీడియో లింక్ ద్వారా హెడ్లీ వాంగ్మూలం ఇచ్చాడు. ముంబైపై ముష్కరుల దాడికి అండదండలు అందించింది పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐనేనని ఇప్పటికే వెల్లడించిన హెడ్లీ మరిన్ని విషయాలు బయటపెట్టాడు. ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్, సామిర్ అలీ, డాక్టర్ తవ్వూర్ రానా, అబ్దుర్ రెహ్మాన్ పాషా నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నానని వెల్లడించాడు. ముంబైలోని నారీమన్ ప్రాంతంలో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంకు ద్వారా ఈ మొత్తం అందుకున్నానని తెలిపాడు. 2006, సెప్టెంబర్ 14న టార్డియో ఏసీ మార్కెట్ ప్రాంతంలో కార్యాలయం ప్రారంభించానని చెప్పాడు. 26/11 దాడుల తర్వాత దీన్ని మూసివేయాలని భావించినట్టు పేర్కొన్నాడు. భారత్ లో తాను రెండుమూడు ఫోన్ నంబర్లు వినియోగించినట్టు తెలిపాడు. ఇక్బాల్, సామిర్ అలీ, రానాలతో ఇ-మెయిల్స్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్టు పంపినట్టు తెలిపాడు. 2004లో గుజరాత్ ఎన్ కౌంటర్ లో హతమైన ఇష్రత్ జహాన్ తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సభ్యుడని వెల్లడించాడు. లష్కర్ తోయిబాలో మహిళా విభాగం కూడా ఉందని చెప్పాడు.