Deposit banks
-
మీ ఫిక్స్డ్ డిపాజిట్ భద్రమేనా..?
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతో విశ్వసనీయమైన, సౌకర్యమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఎన్నో దశాబ్దాలుగా ఎక్కువ మంది అనుసరించే సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో కాల పరీక్షలకు నిలిచింది. రిస్క్ లేని సాధనం కావడంతో రాబడి తక్కువైనా కానీ చిన్న ఇన్వెస్టర్లకు ఇది నమ్మతగ్గ ఆర్థిక సాధనంగా నిలబడింది. అయితే, ఇటీవలి సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లోనూ సంక్షోభాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో మీ డిపాజిట్ సురక్షితంగా ఉన్నట్టేనా...? బ్యాంకుల్లో డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ (డీఐసీజీసీ) కింద బీమా ఉంటుంది. ఇందుకోసం డిపాజిట్ చేసిన వారు ఎటువంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. ఆ పని బ్యాంకే చేస్తుంది. అయితే, ప్రతీ ఒక్కరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకులో ఒక వ్యక్తికి కేవలం రూ.లక్ష డిపాజిట్ మొత్తానికే బీమా వర్తిస్తుంది. ఒకవేళ రూ.లక్షకు మించి డిపాజిట్ చేసి ఉంటే అప్పుడు కూడా రూ.లక్షకే బీమా కవరేజీ ఉన్నట్టు. ఒకవేళ బ్యాంకు డిపాజిట్ దారునికి చెల్లించలేని పరిస్థితిలోకి వెళితే ఒక డిపాజిట్ దారునికి గరిష్టంగా రూ.లక్ష మేర బీమా కింద చెల్లింపులు చేస్తారు. అందుకే ఈ విషయంలో తమ డిపాజిట్‌కు భద్రత ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కొన్ని నివేదికలను పరిశీలించినట్టయితే... మన బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లలో 30 శాతం డిపాజిట్లకే బీమా కవరేజీ ఉందని తెలుస్తోంది. పదేళ్ల క్రితం ఇది 60 శాతంతో పోలిస్తే సగానికి సగం తగ్గినట్టు భావించాలి. ఈ మధ్య కాలంలో రూ.లక్షకు మించి డిపాజిట్ చేసే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. రూ.లక్షకు మించి చేసే డిపాజిట్లకు రిస్క్ ఉందని అర్థం చేసుకోవాలి. ఊహించని పరిస్థితులు ఎదురై బ్యాంకు డిపాజిట్లు తిరిగి ఇవ్వలేని పరిస్థితి తలెత్తితే అప్పుడే రిస్క్‌లో పడతాం. కాకపోతే డిపాజిట్ దారులు తెలివిగా వ్యవహరించడం ద్వారా ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు. స్థిరమైన బ్యాంకు పెద్దవైన, స్థిరమైన బ్యాంకులు అంత సులభంగా సంక్షోభాల్లోకి వెళ్లకపోవచ్చు. ఆస్తుల పరమైన సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యంతోనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ వంటి పెద్ద బ్యాంకులు రుణ ఆస్తుల విషయంలో ఎన్నో సమస్యలను చవిచూసినప్పటికీ, వాటిని అధిగమించే చర్యలతో మెరుగైన పనితీరునే చూపిస్తున్నాయి. పెద్ద బ్యాంకులు రుణాల విషయంలో కఠినమైన నిబంధనలనే అనుసరిస్తుంటాయి. అలాగే, యాజమాన్యం కూడా చురుగ్గానే వ్యవహరిస్తుందని భావించొచ్చు. మొత్తం రుణాల్లో... వసూలు కాని రుణాలు (ఎన్పీఏలు), ఎగవేసిన రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది. మీరు చేసిన డిపాజిట్‌ను బ్యాంకు కొంత కాలం తర్వాత మీకు అవసరమైన సందర్భంలో తిరిగి చెల్లించగలదా..? అని తెలుసుకునేందుకు ఆ బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ను పరిశీలించాలి. డిపాజిట్ దారులకు బ్యాంకు చెల్లించే వడ్డీ రేటు, రుణాలపై బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు.. వీటి మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్ అవుతుంది. బ్యాంకు మొత్తం రుణ ఆస్తులపై సగటున ఈ నికర వడ్డీ మార్జిన్ ఎంతుందనేది బ్యాంకు ప్రతీ త్రైమాసికం ఫలితాల్లోనూ ప్రకటిస్తుంటుంది. పరిశ్రమ సగటు కంటే బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ అధికంగా ఉంటే లేదా బెంచ్ మార్క్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నా సరే.. ఆ బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు. దాంతో డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకే చోట వద్దు ఆర్థిక ఆరోగ్యంతో ఉన్న పెద్ద బ్యాంకులో చేసే డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని భావించొచ్చు. అయితే, ఆ డిపాజిట్‌కు ఏమీ కాదులేనని గ్యారంటీగా చెప్పలేం. పెద్ద బ్యాంకులు తమ ఆస్తుల పరిమాణాన్ని పెంచుకునేందుకు భారీ ఎత్తుగడులనే అనుసరిస్తుంటాయి. కనుక రిస్క్ కూడా ఉంటుంది. అందుకని డిపాజిట్ చేసే సమయంలోనే మనమే కొన్ని చర్యలు అనుసరించడం లాభిస్తుంది. కనుక ఒకే బ్యాంకులో ఒకరి పేరిటే మొత్తం డిపాజిట్ చేయకపోవడం ఓ మంచి ఆలోచన. కుటుంబ సభ్యులు ఒక్కొకరి పేరిట గరిష్టంగా రూ.లక్ష వరకు డిపాజిట్ చేసుకోవడం వల్ల... భవిష్యత్తులో బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లినా తమ డిపాజిట్లకు భద్రత ఉంటుంది. అయితే, డిపాజిట్‌పై ఆదాయానికి పన్ను వర్తిస్తుందని మర్చిపోవద్దు. ఇక కుటుంబ సభ్యుల పేరిట డిపాజిట్‌ను విభజించేందుకు ఇష్టం లేని వారు.. తమ పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకటే పెద్ద డిపాజిట్ కాకుండా దాన్ని పలు డిపాజిట్లుగా వేరు చేయడం వల్ల.. ఎప్పుడైనా డబ్బులతో పని పడితే అవసరమైనంత మేరకే డిపాజిట్లను రద్దు చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్క డిపాజిట్‌గానే చేయడం వల్ల ఆ మొత్తాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే కొంత రాబడిని కోల్పోవాల్సి వస్తుంది. మరొకరితో కలసి రూ.2 లక్షలు జాయింట్‌గా డిపాజిట్ చేశారనుకోండి. అప్పుడు రూ.2 లక్షలకూ బీమా కవరేజీ వర్తించేలా చూసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.లక్ష డిపాజిట్‌పై బీమా అమలవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.. ► కేవలం బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల(రూ.లక్ష వరకు)కే కొంత భద్రత ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అన్నది ఆర్బీఐ సబ్సిడరీ. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే... బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించి ఉండాలి. ► డిపాజిట్లను వివిధ బ్యాంకుల మధ్య వేరు చేయడం వల్ల రిస్క్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైగా ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటే డిపాజిట్‌ను దీర్ఘకాలానికి చేయడానికి బదులు... చిన్న డిపాజిట్లుగా వేర్వేరు కాలాలకు డిపాజిట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఉదాహరణకు రూ.4 లక్షలు డిపాజిట్ చేసుకోదలిస్తే.. రూ.లక్ష చొప్పున ఒక్కో డిపాజిట్‌గా చేసుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల కాలానికి ఒకటి కేటాయించుకోవాలి. ఏడాది డిపాజిట్ గడువు తీరిపోగానే తిరిగి నాలుగేళ్లకు డిపాజిట్ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ రేట్ల పరంగా స్థిరత్వం ఉండేలా, లిక్విడిటీ ఉండేలా చూసుకోవచ్చు. ► ఎఫ్డీ చేసే సమయంలోనే కాలాన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలి. దీర్ఘకాలానికి డిపాజిట్ చేసుకుని, ముందే రద్దు చేసుకుంటే తక్కువ రాబడులకే పరిమితం కావాల్సి వస్తుంది. ఎందుకంటే గడువుకు ముందే డిపాజిట్ రద్దు చేసుకుంటే బ్యాంకులు ఒక శాతాన్ని తగ్గించి ఇస్తాయి. ఏడాది కాలానికి 7 శాతం, 5 ఏళ్ల దీర్ఘకాలానికి 7.5 శాతం ఆఫర్ చేసినప్పుడు, వడ్డీ ఎక్కువగా వస్తుందన్న ఆలోచనతో దీర్ఘకాల డిపాజిట్‌కు వెళ్లడం కంటే అవసరమైన కాలానికే డిపాజిట్ చేసుకోవాలి. ► ఎఫ్డీపై వచ్చే డిపాజిట్ ఆదాయంపై పన్ను అమలవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే బ్యాంకులు వడ్డీ రాబడిపై 10.3 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయిస్తాయి. ఇంతటితో పన్ను బాధ్యత తీరినట్టు కూడా కాదు. అధిక పన్ను పరిధిలో ఉంటే తమ శ్లాబు ప్రకారం అదనపు పన్ను కూడా చెల్లించాలి. టీడీఎస్ మినహాయించకపోయినప్పటికీ, బ్యాంకు సేవింగ్స్ ఖాతా, డిపాజిట్, బాండ్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. క్యుములేటివ్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే పన్నును ఏటా చెల్లించడం మరిచిపోవద్దు. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఉన్నప్పటికీ, మొత్తం వార్షికాదాయం బేసిక్ కనీస మిహాయింపు పరిధిలోనే ఉంటే అప్పుడు టీడీఎస్‌ను వెనక్కి పొందేందుకు పన్ను రిటర్నులు దాఖలు చేసి క్లెయిమ్ చేసుకోవాలి. తమ ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉందంటూ బ్యాంకులోనే ఫామ్ 15జీ ఇస్తే టీడీఎస్ మినహాయించరు. అదే సీనియర్ సిటిజన్లు అయితే ఫామ్ 15హెచ్ ఇవ్వాలి. ► మీ జీవిత భాగస్వామి, పిల్లల పేరిట డిపాజిట్ చేయడం ద్వారా పన్ను బాధ తప్పించుకోవచ్చు అనుకుంటే కుదరదు. మీ జీవిత భాగస్వామి, పిల్లలకు ఇచ్చే మొత్తంపై పన్ను చెల్లించనక్కర్లేదు. కానీ, అలా ఇచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన సందర్భాల్లో వచ్చే ఆదాయం, ఇచ్చిన వారి ఆదాయానికే కలుస్తుంది. ఇతర ఉత్పత్తులు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా రిస్క్ తక్కువగా ఉండే ఇతర పెట్టుబడి పథకాలను కూడా పరిశీలించొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీలు లేదా జీసెక్‌లు అత్యధిక భద్రతతో ఉంటాయి. షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. జీసెక్‌లను వద్దనుకుంటే సెకండరీ మార్కెట్లోనూ విక్రయించుకోవచ్చు. రెపో మార్కెట్లో వీటిపై రుణాలను కూడా పొందొచ్చు. -
పాత నోట్లు.. రూ.350 కోట్లు
గడువు ముగిసే సమయానికి బ్యాంకుల్లో డిపాజిట్ ఒక్కో పట్టణంలో రూ.కోటికి పైగానే.. ఇంకా తెరుచుకోని ఏటీఎంలతో ప్రజల ఇక్కట్లు కానరాని రూ.100 నోట్లు.. రూ.500 నోట్లూ అక్కడక్కడే! ఆత్మకూరు : కేంద్రప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి రెండు నెలలు కావస్తున్నా సాధారణ ప్రజల కష్టాల అంతు తేలడం లేదు. చెలామణి నిలిపివేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్, మార్పిడికి కేంద్రం అప్పట్లో అవకాశం కల్పించింది. కానీ నోట్ల మార్పిడిని రద్దు చేసిన ప్రభుత్వం బ్యాంకుల్లో ఖాతాదారులు మాత్రమే జమ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తన ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీతో బ్యాంకుల్లో పాత నోట్లను జమ చేసుకునే గడువు ముగియగా.. అప్పటి వరకు డిపాజిట్ అయిన మొత్తం వివరాలను బ్యాంకుల వారీగా ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల్లోనే.. వరంగల్ రూరల్ జిల్లాలో ఎక్కువగా ఎస్బీహెచ్, ఆంద్రా బ్యాంకులోనే డిపాజిట్లు జరిగాయి. ఒక్క పరకాల పట్టణంలోని ఎస్‌బీహెచ్‌లోనే రూ.80కోట్ల 50లక్షలు డిపాజిట్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇలా జిల్లా మొత్తం రూ.350 కోట్ల మేరకు పాత నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. 17 బ్యాంకులు.. 64 శాఖలు జిల్లాలో 17 బ్యాంకులకు సంబంధించి 64 శాఖలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 57 ఏటీఎంలు ఉండగా అందులో 45ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. పనిచేస్తున్న వాటిల్లోనూ డబ్బు లోడ్ చేసిన గంట, రెండు గంటల్లో ఖాళీ అవుతున్నాయి. మంగళవారం కూడా అధికంగా ఏటీఎంలు మంగళవారం మ««ధ్యాహ్నం వరకే ఖాళీ అయ్యాయి. సంగెం ఆంధ్రాబ్యాంకులో ఏటీఎంలో రూ.4లక్షలకు పైగా లోడ్ చేసినా సాయంత్రం తర్వాత ఖాతాదారులకు డబ్బు లభించలేదు. ఇక జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఉన్న ఏటీఎంల్లో రూ.100 నోట్లు కరువయ్యాయి. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో పనిచేసే పది, పదిహేను ఏటీఎంల్లో రూ.2వేల నోట్లే లోడ్ చేస్తున్నారు. ఇక నూతన రూ.500నోట్లు విడుదలైనా చాలా తక్కువగా ఖాతాదారులకు అందుతున్నాయి. రుణాల విషయంలో కరువైన స్పష్టత ఖాతాదారులు పాత నోట్లను జమ చేసే గడువు ముగిసి నాలుగు రోజులు దాటింది. అయినప్పటికీ రైతులు, వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఫసల్ భీమా యోజన దరఖాస్తుకు గడువు గత నెల 31తో ముగిసినా ఇంకా పది రోజులు పొడిగించారు. ఇక బ్యాంకర్లు రుణాల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్ని వర్గాల -
నోటీసుల భయం
అధిక డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ ఆరా బెంబేలెత్తుతున్న బడా బాబులు ఇతరుల ఖాతాలను ఉపయోగించేందుకు వెనుకంజ తిరుపతి: పెద్ద నోట్ల రద్దు తరువాత అధిక మొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ఖాతాదారులను నోటీసుల భయం వెంటాడుతోంది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో వీరు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. బంధువులు, పరిచయస్తుల నగదును తమ ఖాతాల్లో వేసుకునేందుకు సైతం జిల్లా వ్యాప్తంగా జనం వెనుకంజ వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మొదట్లో పన్ను ఎగవేతదారులను, ఇప్పుడు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన వారినీ బెంబేలెత్తిస్తోంది. ఈ నెల 8న నోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకోగానే మరుసటి రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు వేగం పుంజుకున్నారుు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ సుమా రు రూ.600 కోట్లకు పైగానే డిపాజిట్లు జరిగాయని జిల్లాకు చెందిన బ్యాంకర్లు చెబుతున్నారు. నల్లధనం కలిగిన ఎంతో మంది పన్ను ఎగువేతదారులు తమకు పరిచయమున్న వారి ఖాతాల్లోనూ, నమ్మకస్తులైన వారి ఖాతాల్లోనూ నగదు డిపాజిట్ చేశారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు ప్రాంతాల్లో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశారని వినికిడి. వీరితో పాటు వడ్డీ వ్యాపారులు, రాజకీయ నేపథ్యం ఉన్న బడాబాబులు లక్షలాది రూపాయల డబ్బును ఇతరుల ఖాతాలకు మళ్లించారని సమాచారం. జిల్లాలో 72 శాఖలను కలిగిన ఎస్బీఐలో సుమారు 2 వేల ఖాతాల్లోనూ, జిల్లాలో అత్యధిక శాఖలను కలిగిన సప్తగిరి గ్రామీణ బ్యాంకులోనూ, ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ ఇతరత్రా వాణిజ్య బ్యాంకుల్లో మరో వెరుు్య ఖాతాల్లోనూ రూ.2.5 లక్షల కంటే ఎక్కువ నగదు జమ జరిగినట్లు సమాచారం. తమ డబ్బును మీ ఖాతాలో సర్దుబాటు చేస్తే ఎంతో కొంత ముట్టజెబుతామని కొంతమంది పన్ను ఎగవేతదారులు పేద మధ్య తరగతి వాళ్లను అక్కడక్కడా ఒప్పించి వారి నగదును వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అంతేకాకుండా ఎంతో మంది అవగాహన లేనివారు ఈ మధ్య తెరిచిన జన్‌ధన్ ఖాతాల్లోనూ నగదు డిపాజిట్ చేస్తున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఈ ఖాతాల్లో ఉండకూడదన్న నిబంధన విస్మరించి పలువురు డిపాజిట్లు చేస్తున్నారు. ఇవన్నీ ఇబ్బందులు కొని తెస్తాయన్న విషయం తెలియక చాలామంది తొందరపడి ఇతరుల నగదును సొంత ఖాతాల్లో వేసుకుంటున్నారు. దృష్టి సారిస్తున్న ఆదాయపు పన్నుల శాఖ ఆదాయపు పన్నుల అధికారులు అధిక డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ తరహా ఖాతాలకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వారం రోజుల్లో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ అరుున ఖాతాలను గుర్తించి వారికి నోటీసులు పంపి డిపాజిట్ చేసిన సొమ్ము తాలూకు డాక్యుమెం ట్లను పరిశీలించే పనిలో పడింది. సోషల్ మీడియా ద్వారా విషయం తెల్సుకున్న జిల్లా డిపాజిటర్లు కలవరపాటుకు గురవుతున్నారు. మొబైల్ ఏటీఎంల ద్వారా చాలా మంది నగదు విత్‌డ్రా చేయడం ప్రారంభించారు. దీనివల్లనైనా తమ ఖాతాల్లో నగదు తక్కువగా కనిపిస్తుందని వీరి భావన. శనివారం ఆదాయపు పన్నుల శాఖకు సెలవు దినం కావడంతో సోమవారం నుంచి ఆయా శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టే వీలుందని తెలుస్తోంది. -
మనోడే కదా అనుకుంటే నామం పెట్టాడు
♦ నమ్మిన వ్యక్తికి రూ. 20 లక్షల టోకరా ♦ దర్జాగా బ్యాంకుల్లో డిపాజిట్ ♦ పోలీసుల విచారణలో నేరం అంగీకారం ♦ కటకటాలపాలైన నిందితుడు కందుకూరు: నమ్మిన వ్యక్తికి ఓ ప్రబుద్ధుడు రూ. 20 లక్షలకు టోకరా వేశాడు. అరుుతే బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిని కటకటాల వెనక్కు పంపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రకాశరావు వివరాలు వెల్లడించారు. స్థానిక పాతబ్యాంక్బజార్ నివాసి తుమ్మల వెంకట కృష్ణారావు గతంలో నెల్లూరులోని నారాయణ కాలేజీ యాజమాన్యానికి దాదాపు రూ. 18లక్షలను, ఒకటిన్నర రూపాయి లెక్కన నెలవారీ వడ్డీకి అప్పుకి ఇచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల నారాయణ కాలేజీ యాజమాన్యం.. కృష్ణారావుకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని నెల్లూరుకు రావాలని కోరింది. అరుుతే ఆయన అనోరోగ్యంతో బాధపడుతుండడంతో వెళ్లలేక, తన ఇంటిముందు ఉండే పరిచయస్తుడు ఎం. బాలాజీ సింగయ్య వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుని రావాలని కోరాడు. దీనికి బాలాజీ సింగయ్య అంగీకరించడంతో.. తన వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు ఇచ్చి నెల్లూరు పంపాడు. యూజమాన్యం లెక్క చూసి అసలు, వడ్డీ కలిపి.. మొత్తం రూ. 20,52,000 బాలాజీ సింగయ్యకు ఇచ్చింది. అయితే సింగయ్య డబ్బును కృష్ణారావుకు ఇవ్వలేదు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో రూ. 5 లక్షలు, కెనరాబ్యాంకులో రూ. 2లక్షలు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 5లక్షలు, తన భార్య నీలిమపై కో ఆపరేటివ్ బ్యాంకులో రూ. 5లక్షలు, కెనరా బ్యాంకులో రూ. 3లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మిగిలిన 52 వేలల్లో రూ. 40 వేలు పిల్లల స్కూల్ ఫీజులు, రూ. 12వేలు ఇతర ఖర్చులకు వాడుకున్నాడు. ఇదిలా ఉంటే కృష్ణారావు తన డబ్బులు గురించి అడుగ్గా నెల్లూరు నుంచి తెచ్చిన వెంటనే నీకు ఇచ్చాను కదా అని బకాయించడం మొదలు పెట్టాడు. తనకేం సంబంధం లేదంటూ నాటకాలు మొదలు పెట్టాడు. దీంతో కృష్ణారావు పోలీసులను ఆశ్రయించాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. కేసును ఛేదించిన సీఐ లక్ష్మణ్, ఎస్సై హజరత్తయ్యలను డీఎస్పీ అభినందించారు.