దేశం కోసం...
డ్రగ్స్... మద్యపానం... రేవ్‌పార్టీలు...
స్మోకింగ్... వంటి దురలవాట్లతో
కొందరు యువకులు
పక్కదారి పడుతున్నారు.
జాతి నిర్మాణానికి ఇటుకలు మోయవలసిన వయసులో జాతి వినాశనానికి అడుగులు వే స్తున్నారు.
దేశద్రోహులతో చేతులు కలిపి...
మాతృదేశానికి ద్రోహం చేస్తున్నారు.
దేశభవిష్యత్తు యువత చేతిలో ఉంది...
దేశరక్షణ పోలీసుల చేతిలో ఉంది...
దేశం కోసం పోలీసులు ఏ విధంగా ప్రాణాలు అర్పిస్తున్నారో, జాతి వినాశనానికి యువత ఏ విధంగా నడుం బిగిస్తోందో తెలిపే చిత్రం ‘దేశం కోసం’
డెరైక్టర్స్ వాయిస్: మాది కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామం. బి.కాం., సిఏ పూర్తి చేసి, ప్రస్తుతం ఎంబిఏ చేస్తున్నాను. ఫిలిమ్ మేకింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. ప్రతివారూ పోలీసులను నిందిస్తూనే ఉంటారు. కాని పోలీసులు లేనిదే మనం క్షేమంగా ఉండలేమనే విషమాన్ని మర్చిపోకూడదు. టైస్టుల బారి నుంచి దేశాన్ని పోలీసులు రక్షిస్తున్నారు కనుకనే ప్రజలంతా కంటి నిండా నిద్రపోగలుగుతున్నారు. ‘ఇండియాలో టైజం’ అనే అంశంతో ‘మోడలింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ బేనర్ మీద ఈ లఘుచిత్రం తీశాను. ఈ సినిమా కోసం మొత్తం 20 మంది పోలీసులు ఇందులో నటించారు. వీరంతా విజయవాడలో పనిచేస్తున్న అసలైన పోలీసులే. ఈ లఘుచిత్రాన్ని విజయవాడలో తీశాం. రెండు రోజులలో షూటింగ్ పూర్తి చేశాం. ఎడిటింగ్‌తో కలిపి ఐదు రోజులలో చిత్రాన్ని పూర్తిచేశాం.
షార్ట్‌స్టోరీ: ఒక పాకిస్తానీ టైస్టు భారతదేశంలో అలజడి సృష్టించడానికి పథకం వేస్తాడు. ఈజీ మనీకి అలవాటు పడిన యువత టైస్టుల ట్రాప్‌లో పడతారు. వారు చెప్పిన తప్పుడు పనులు చేస్తుంటారు. డ్రగ్స్ సప్లై చేయడం దగ్గర నుంచి హత్యలు చేయడం వరకు అన్ని పనులూ చేస్తుంటారు. అవసరమైతే వారిని వారు చంపుకునేలా ట్రయినింగ్ ఇస్తాడు పాకిస్తానీ టైస్టు. ఎన్నో తప్పులు చేసి, చివరకు పోలీసుల చేతిలో చిక్కి ఏ విధంగా అంతమవుతారన్నదే ఈ చిత్ర కథాంశం.
కామెంట్: మంచి కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో స్వయంగా పోలీసులే నటించారంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ లఘుచిత్రం గొప్పదనాన్ని. ఇందులో సంభాషణలు బాగున్నాయి. ‘నేనొక కానిస్టేబుల్ని. ఏసీ ఎలా పెట్టిస్తాను’ ‘ప్రతిసారీ డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు’ ‘మీకు డబ్బు కావాలి. మీరు నాకు కావాలి’ ‘మారిపోవడమే నువ్వు చేసిన తప్పురా’ ‘ఇండియన్ పోలీస్ పవరేంటో చూపించండి’ వంటివి కథకు బలం తీసుకువచ్చాయి.
దేశభక్తిని చాటేలా జెండాలు చూపడం, ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి, పోలీసుని ఆప్యాయంగా హత్తుకుని పేల్చి చంపడం, ఆటోవాలాకు ఒక చిన్నపాప ‘హ్యాపీ ఇండిపెండెన్స్‌డే’ అని చెబుతుండగా ఆటోవాలా ‘జైహింద్’ అంటుండగా అతడిని కాల్చిచంపడం వంటి దృశ్యాల ఎంపిక చాలా బాగుంది. కాని ఆ దృశ్యాలను మరింత పటిష్టంగా చూపితే బాగుండేది. చేతికి చిక్కిన టైస్టుని హింసించే విధానం కూడా ఇంకా బాగా చూపిస్తే లఘుచిత్రం మరింత హత్తుకునేది.
‘దేశానికి వెన్నెముకలా నిలబడవలసిన యువత నేడు మద్యం, డ్రగ్స్, మాఫియా బారిన పడి తమ బంగారు భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా పాడు చేస్తున్నారు’ ‘సన్మార్గంలో శాంతియుతపు ఆలోచనలతో భారత్‌ను ముందుకు నడుపుదాం’ అనే సందేశాత్మక వాక్యాలతో చిత్రం ముగించడం బాగుంది. ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాన్ని ఇంకా చాలా బాగా తెరకెక్కించాలి.
దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలు తీసినప్పుడు అందులోని దృశ్యాలు యువతకు రక్తం పొంగించేలా ఉండాలి. ఆ విషయంలో ఈ దర్శకుడు పూర్తిస్థాయి ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. ఏదిఏమైనా ఒక మంచి అంశంతో చిత్రాన్ని తీసినందుకు ఈ యువకుడికి ప్రశంసలు తెలపాల్సిందే.
- డా.వైజయంతి