designed
-
గ్రాము గోల్డ్.. రెండు గంటలు.. సూక్ష్మ బంగారు ‘ఆస్కార్’..
సాక్షి, పెద్దాపురం(కాకినాడ జిల్లా): నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి అభినందనలు తెలుపుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ ఆస్కార్ అవార్డు ప్రతిమ రూపొందించారు. ఒక గ్రాము బంగారం వినియోగించి 15 మిల్లీ మీటర్ల పొడవుతో ఈ ప్రతిమను రెండు గంటల సమయంలో తయారు చేసి అందరి మన్ననలూ అందుకున్నారు. చదవండి: రాజమౌళితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ: RRR నిర్మాత -
78 ఏళ్ల వయసులో డిజైనర్‌గా రాణిస్తున్న షీలా బజాజ్
‘అభిరుచిని ఆచరణలో పెట్టాలే గానీ ఏ వయసయినా అనుకున్నది సాధించవచ్చు’ అని నిరూపిస్తున్నారు ఢిల్లీలో ఉంటున్న 78 ఏళ్ల షీలా బజాజ్. ‘ఇప్పుండెందుకీ పనులు... హాయిగా కూర్చోక’ అని చెప్పేవారికి సవాల్‌గా ‘నా క్రొచెట్ డిజైన్స్ మీకు కావాలా’అని అడుగుతారు. కొత్తగా ఆన్లైన్ భాషను వంటపట్టించుకొని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అల్లికల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చిన ఆర్డర్లను తీసుకుంటూ క్రొచెట్ అల్లికల తయారీలో బిజీబిజీగా ఉంటూ, సంపాదన మార్గంలో ఉన్నారు. ‘నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల కోసం క్రోచెట్ అల్లికలు చేసేదాన్ని. ఆ తర్వాత బాధ్యతల నడుమ అభిరుచిని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పిల్లలు పెద్దగై, వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు నా మనవరాలితో పాటు ఉంటున్నాను. కిందటేడాది కరోనా మహమ్మారి మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థిక అవసరాలు తీరడానికి ఎటూ దారి దొరకలేదు. మనవరాలిపై ఆధారపడుతున్నానని బెంగ. ఈ మాటలు నా మనవరాలితో అంటూ ఉండటం వల్ల ఓ రోజు ‘మీరు క్రోచెట్ అల్లికలు బాగా చేస్తారు కదా! మళ్లీ ఎందుకు మొదలుపెట్టకూడదు మీ కోసం’ అంది. దాంతో తిరిగి దారాలు నా చేతిలోకి వచ్చాయి. ఈ కాలానికి తగినట్టు అందమైన అల్లికలు రూపొందించడం మొదలుపెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రూపొందించిన డిజైన్స్ ఫొటోలు పెట్టాం. మొదటి ఆర్డర్‌కు రూ.350 వచ్చాయి. 78 ఏళ్ల వయసులో నా మొదటి సంపాదన అది. ఎన్నడూ పొందలేనంత అనుభూతిని పొందాను. చాలా గర్వంగా, స్వతంత్రం గా అనిపించింది. డ్యాన్స్ చేయాలనిపించింది. అంతగా ఆనందించాను. నా వయస్సులో ఉన్న చాలా మంది వ్యక్తులు ‘ఇప్పుడిక చేసేదేముంది’ అంటే, ‘ఇప్పుడు నాకు పని ఉంది ’ అని గర్వంగా చెబుతున్నాను. అలా అన్నవారు కూడా ఇప్పుడు నా ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకుంటున్నారు. దీంతో క్రియేషన్స్‌తో పాటు ఉత్పత్తులూ పెరిగాయి. ఆర్డర్లూ పెరిగాయి. ఈ పనిలో అలసట అన్నదే లేదు ఇప్పుడు. 20 ఏళ్ల యువతి నా క్రోచెట్ డ్రెస్‌ను ఇష్టపడుతుంది. ఒక తల్లి తన బిడ్డకు చేసిచ్చిన క్రొచెట్ ఫ్రాక్ ఎంతో అందంగా ఉందని నాకు చెప్పింది. వయసుతో పనిలేదు. ఏ వయసులోనైనా కావల్సినది నచ్చిన పని. మన చేతులతో మనం స్వయంగా సంపాదించుకున్న పని. అది ఏదైనా కావచ్చు. ఎవరికి వారు ఎవరిమీదా ఆధారపడకుండా బతికేంత సామర్థ్యాన్ని పెంచుకోవడం చాలా చాలా అవసరం’’ అంటూ ఈ బామ్మ ఆనందంగా చెబుతున్న మాటలు అన్ని వయసులవారినీ ఆలోచింపజేస్తాయి. అనుకున్న పనులను ఆచరణలో పెట్టేలా చేస్తాయి. చదవండి: Rohit Sharma: రోహిత్‌పై గంగూలీ ఆసక్తికర వాఖ్యలు.. -
కరోనా టెస్ట్ కిట్‌ను రూపొందించిన ఢిల్లీ ఐఐటీ
సాక్షి, హైదరాబాద్: కేవలం వందల రూపాయల ఖర్చుతో తయారయ్యే ‘కోవిడ్ 19 డిటెక్షన్ కిట్’ను దేశీయ టెక్నాలజీతో ఢిల్లీ ఐఐటీ రూపొందించింది. దీనిని వైద్య పరిశోధనలో అత్యున్నత పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ఆమోదించింది. కోవిడ్‌ను గుర్తించడంలో ఈ కిట్ వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారితంగా ఈ పరికరం పనిచేస్తుంది. సరైన పారిశ్రామిక భాగస్వామి దొరికితే వారం పది రోజుల్లో ఈ కిట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఢిల్లీ ఐఐటీ సన్నాహాలు చేస్తోంది. తక్కువ ధరలో అందుబాటులోకి.. కరోనా జన్యుక్రమంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో బలహీనమైన ఆర్ఎన్ఏ క్రమాలను గుర్తించారు. ఈ అంశం కోవిడ్–19ను గుర్తుపట్టడంలో కీలకంగా మారడంతో పీసీఆర్ ఆధారంగా కిట్‌ను రూపొందించారు. ఈ ఏడాది జనవరి నుంచి తక్కువ ఖర్చుతో తయారయ్యే పరికరాన్ని రూపొందించడంపై ఢిల్లీ ఐఐటీ బృందం దృష్టి సారించింది. ఈ పరికరాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ధర కూడా తగ్గే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ పరికరంపై పేటెంట్ కోసం పరిశోధక బృందం దరఖాస్తు చేసింది. -
ప్రమాదాలను తప్పించుకొని బతకొచ్చు..!
మెల్బోర్న్ః భారీ కారు ప్రమాదం జరిగితే బతికే వారు అరుదే. అటువంటి ప్రమాదాలను ఎదుర్కొని ప్రాణాలకు నష్టం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలా అన్న ఆలోచననుంచి ఓ కళాకారుడికి తట్టిన రూపమే గ్రాహం. మనిషి కంటే కాస్త పెద్దదిగా.. మనిషిని పోలిన మనిషిగా రూపొందిన ఆ శిల్పాన్ని వినియోగించి, భవిష్యత్తులో ప్రమాద మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉండదంటున్నాడు రూపకర్త, కళాకారుడు ప్యాట్రిసియా పిక్సినిని. ప్రముఖ ట్రౌమా సర్జన్, ట్రాష్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ పర్ట్ ల సహకారంతో రూపొందిన ఆ శిల్పం.. (గ్రాహం) ఇప్పుడు ఆస్ట్రేలియా రహదారి భద్రతా ప్రచారంలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. మెడ కనిపించకుండా ఉండే అతిపెద్ద హెల్మెంట్ లాంటి తల, వికారమైన శరీరాకృతి, గిట్టల్లా ఉండే పాదాలు, ఇంకా ఇతర అసాధారణ లక్షణాలతో కూడిన మానవాకృతి ఇప్పుడు ఆస్ట్రేలియా రహదారి భద్రతా ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అనుకోకుండా జరిగే కార్లు, వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడాలంటే ఏం చేయాలో చోదకులకు వివరించేందుకు వీలుగా కళాకారుడు ప్యాట్రిసియా పిక్సినిని.. ప్రముఖ ట్రౌమా సర్జన్, ట్రాష్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ పర్ట్ సహకారంతో 'గ్రాహం' ను రూపొందించాడు. రహదారుల్లో పెరుగుతున్న మరణాలు, గాయాల సంఖ్య తగ్గించడం, నియంత్రించడంలో భాగంగా 'గ్రాహం'.. తో అవగాహనా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆస్ట్రేలియా ట్రాన్స్ పోర్ట్ యాక్సిడెంట్ కమిషన్ సీఈవో.. జో కలాఫియోర్ తెలిపారు. విపరీతమైన వేగంతో కారు.. లేదా ఏదైనా వాహనం నడిపే సమయంలో యాక్సిడెంట్ అయితే ప్రాణాలతో బయటపడటం చాలా అరుదని, మానవుడి వేగంకంటే కార్ల వేగం చాలా ఎక్కువగా ఉండటంవల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవడం కష్టమౌతుందని కాలాఫియోర్ చెప్తున్నారు. అందుకే ప్రమాదాలనుంచి బయటపడేందుకు మనం చేసే తప్పులను, రోడ్ల వ్యవస్థను మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అటువంటివాటిని క్షుణ్ణంగా వివరించేందుకు గ్రాహం సహాయపడుతుందని కాలాఫియోర్ పేర్కొన్నారు. రాయల్ మెల్బోర్న్ ఆస్పత్రిలో ట్రౌమా సర్జన్ గా పనిచేస్తున్న క్రిస్టియన్ కెన్ఫీల్డ్.., మోనాష్ యూనివర్శిటీ యాక్సిడెంట్ రీసెర్చ్ సెంటర్ క్రాష్ పరిశోధకుడు డేవిడ్ లోగాన్ లు గ్రాహం రూపకల్పనకోసం మెల్బోర్న్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా కళాకారుడు పిక్సినిని కి సహకారం అందించారు. ఈ సందర్భంలో శరీరంలో ముఖ్యమైన భాగం తల అని, దానికి దెబ్బలు తగిలితే చాలా ప్రమాదం అని, అలాగే తల ముందుభాగం, వెనుక భాగం, మెదడు ఇలా తల్లోని భాగాలతోపాటు వెన్నెముక వంటి శరీర భాగాలకు గాయాలైతే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందన్న విషయాలను గ్రాహం చక్కగా చెప్తుందని కెన్ ఫీల్డ్ వివరించారు. అలాగే ప్రమాదాల్లో పక్కటెముకలు వంటివాటిని రక్షించేందుకు వీలుగా ఎయిర్ బ్యాగ్ లాంటి ఆకారం, రాపిడిని తట్టుకునేట్లు మందపాటి చర్మం వంటివన్నీ గ్రాహం రూపకల్పనలో కనిపిస్తాయి. చూసేందుకు అసహజంగా, ఓ భయంకరమైన హారర్ సినిమా మనిషిలా ఉన్నా... భారీ రోడ్డు ప్రమాదాలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మాత్రం గ్రాహం తో కల్పించే అవగాహన ఎంతో సహాయపడుతుందని చెప్తున్నారు. -
వెరైటీ హౌస్