Desk jobs
-
డెస్క్ జాబ్ చేస్తున్నారా, ప్రమాదం పొంచివుంది : ఈ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయండి!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చునే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతుంటుంది. చెయిర్లో కూర్చుని చేసే అనుకూలమైన వ్యాయామాలను సాధన చేయడం వల్ల పొట్ట భాగం ఫిట్‌గా అవుతుంది. దీంతో పాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు ఇవి...సీటెడ్ లెగ్ లిఫ్ట్స్: కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలకు అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలును కూడా అదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. చెయిర్‌కు ఉన్న హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్ల పాటు అదే పొజిషన్లో ఉంచాలి. దీని వల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఆబ్లిక్యూ ట్విస్ట్: చెయిర్లో నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. సీటెడ్ క్రంచెస్: చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి కొద్దిగా అదే భంగిమలో పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. టో టచెస్: చెయిర్ మీద కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది.సీటెడ్ బైస్కిల్ పెడల్స్: చెయిర్లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. -
గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం సహజం. చెయిర్లో లేదా యోగా మ్యాట్ మీద కూర్చుని చేసే వ్యాయామాలు కొన్ని ఉంటాయి. వీటిని సాధన చేయడం వల్ల పొట్ట భాగం చదునుగా అవుతుంది. దీంతోపాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాల గురించి తెలుసుకొని, ఆచరణ లో పెడదాం.. సీటెడ్ లెగ్ లిఫ్ట్స్కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలపై అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలిని కూడా అదేవిధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. కుర్చీ హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్లపాటు అదే పొజిషన్లో ఉంచాలి. దీనివల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజులు చేసేటప్పుడు చెయిర్ గట్టిగా, ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆబ్లిక్ ట్విస్ట్నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. సీటెడ్ క్రంచెస్చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి అదే భంగిమలో కొద్దిగా పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధాస్థితికి రావాలి. ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ వ్యాయామాన్ని చేయచ్చు. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. సీటెడ్ బైస్కిల్ పెడల్స్ చెయిర్లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. టో టచెస్కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధాస్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. (చదవండి: ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాదులను నివారించొచ్చు..!) -
డెస్క్ ఉద్యోగాలతో గుండె, నడుముకు చేటు
లండన్: అధిక సమయం కూర్చొని పనిచేసే డెస్క్ ఆధారిత ఉద్యోగాలతో గుండె జబ్బులతో పాటు, నడుము చుట్టుకొలత పెరిగే ముప్పు ఉందని మరోసారి వెల్లడైంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. రోజులో ఐదు పనిగంటల తరువాత కూర్చొని పనిచేసే ప్రతి అదనపు గంట వల్ల నడుము చుట్టుకొలత రెండు సెంటిమీటర్లు, గుండె జబ్బులు వచ్చే అవకాశం 0.2 శాతం పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే రోజుకు ఐదు పనిగంటల తరువాత ప్రతి అదనపు గంట పనివల్ల చెడు కొవ్వు పెరిగి, మంచి కొవ్వు తగ్గుతోందని వెల్లడించారు. రోజుకు ఏడు గంటలు నిల్చోవడం, ఏడు మైళ్లు నడవడం ద్వారా గుండె జబ్బులను దూరం చేయొచ్చని సూచించారు. 'మానవ జాతిగా ఎదిగే క్రమంలో మనం రోజంతా కూర్చొని ఉండేలా మన శరీర నిర్మాణం జరగలేదు. వేటగాళ్లు, చెత్తసేకరణ కార్మికుల మాదిరిగా రోజుకు 7-8 గంటలు కాళ్లకు పనిచెబితేనే ఆరోగ్యంగా ఉంటామనే ఆలోచన సరళికి అలవాటు పడ్డాం' అని ప్రొఫెసర్ మైక్ లీన్ అన్నారు.