Destiny
-
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
కర్మను నమ్ముతారా? ఈ వీడియోను చూడాల్సిందే: ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: ఎంఅండ్ఎం అధినేత, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. అనూహ్యంగా.. తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పుకున్న ఒక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. కర్మ, విధి ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోతే మీరు ఈ వీడియోను ఒకసారి చూడాల్సిందే ..ఈ విషయంలో పునరాలోచనలో పడతారు అంటూ దీన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ఏముందంటే.. ఒక యువకుడు ఒక ప్లేస్‌లో రైలింగ్ వద్ద నిలబడి ఉంటాడు. దేని కోసమో ఎదురుచూస్తున్న అతగాడు కాజువల్‌గా అలా నడుచు కుంటూ కాస్తముందుకు వెళతాడు. అలా వెళ్లిన మరుక్షణమే ఒక కారు వేగంగా దూసుకొస్తుంది. అలా లిప్తపాటులో ప్రాణాపాయం నుంచి బయట పడటం మాత్రమే కాదు.. ఏ చిన్న గాయం కూడా కాకుండా భారీ ప్రమాదంనుంచి తప్పించు కుంటాడు. కర్మ అనేది మనం చేసిన క్రియలకు ప్రతిఫలం. నిజంగా అతడు అదృష్టవంతుడు. నిజమే సార్.. కర్మను లేదా విధిని నమ్మాల్సిన విషయమే. ఈ వ్యక్తికి దీర్ఘాయుష్షు ఉంది. అందుకే సరైన సమయంలో ఆ ప్లేస్నుంచి దూరం జరిగాడు అంతా దైవ లీల అంటూ పలువురు కమెంట్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ల రూపంలో తెలియజేయండి! If you didn’t believe in Karma or Destiny, this may make you think again… ! pic.twitter.com/OtPn1P4rhJ — anand mahindra (@anandmahindra) May 5, 2023 -
అమెరికాలో.. శిక్ష విధించిన కాసేపటికే పెళ్లి...
లాస్ ఏంజెలెస్: అమెరికాలో ఒక వ్యక్తికి హత్య కేసులో ఏకంగా 53 ఏళ్ల శిక్ష విధించిన జడ్జి, తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికి అదే నేరస్తుడి పెళ్లికి పెద్దరికం వహించారు. ఇదివరకు ఎక్కడా కని విని ఎరుగని ఈ సంఘటన శాండియాగో కోర్టులో జరిగింది. డేన్ డెస్బ్రో (36) అనే వ్యక్తిని పదేళ్ల నాటి హత్య కేసులో దోషిగా తేల్చిన శాండియాగో సుపీరియర్ కోర్టు జడ్జి పాట్రీషియా కుక్సన్, అతడికి 53 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కొద్దిసేపటికే, అతడు కోరుకున్న డెస్టినీ (33) అనే యువతితో కోర్టులోనే పెళ్లి చేశారు. నిర్బంధంలో ఉన్న నేరస్తులకు జడ్జిలు పెళ్లిళ్లు జరపడం అంత అసాధారణం కాకపోయినా, ఒక నేరస్తుడికి దాదాపు జీవితకాలం శిక్ష విధించిన జడ్జి, అదే నేరస్తుడికి పెళ్లి జరిపించడం విశేషం.