
సాక్షి, ముంబై: ఎంఅండ్‌ఎం అధినేత, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. అనూహ్యంగా.. తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పుకున్న ఒక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. కర్మ, విధి ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోతే మీరు ఈ వీడియోను ఒకసారి చూడాల్సిందే ..ఈ విషయంలో పునరాలోచనలో పడతారు అంటూ దీన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ వీడియోలో ఏముందంటే.. ఒక యువకుడు ఒక ప్లేస్‌లో రైలింగ్ వద్ద నిలబడి ఉంటాడు. దేని కోసమో ఎదురుచూస్తున్న అతగాడు కాజువల్‌గా అలా నడుచు కుంటూ కాస్తముందుకు వెళతాడు. అలా వెళ్లిన మరుక్షణమే ఒక కారు వేగంగా దూసుకొస్తుంది. అలా లిప్తపాటులో ప్రాణాపాయం నుంచి బయట పడటం మాత్రమే కాదు.. ఏ చిన్న గాయం కూడా కాకుండా భారీ ప్రమాదంనుంచి తప్పించు కుంటాడు.
కర్మ అనేది మనం చేసిన క్రియలకు ప్రతిఫలం. నిజంగా అతడు అదృష్టవంతుడు. నిజమే సార్.. కర్మను లేదా విధిని నమ్మాల్సిన విషయమే. ఈ వ్యక్తికి దీర్ఘాయుష్షు ఉంది. అందుకే సరైన సమయంలో ఆ ప్లేస్‌నుంచి దూరం జరిగాడు అంతా దైవ లీల అంటూ పలువురు కమెంట్ చేశారు.
మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ల రూపంలో తెలియజేయండి!
If you didn’t believe in Karma or Destiny, this may make you think again… ! pic.twitter.com/OtPn1P4rhJ
— anand mahindra (@anandmahindra) May 5, 2023
Comments
Please login to add a commentAdd a comment